రాష్ట్ర‌మంత‌టా ‘రావాలి జగన్‌..కావాలి జగన్‌’

నవరత్నాలపై ప్రజలకు అవగాహన..

ఊరూరా ప్ర‌చారం నిర్వ‌హిస్తున్న వైయ‌స్ఆర్‌సీపీ శ్రేణులు

రాష్ట్రవ్యాప్తంగా కావాలి జగన్‌–రావాలి జగన్‌ కార్యక్రమం కొనసాగుతుంది. జిల్లాల్లోనూ నియోజకర్గ కోఆర్డినేటర్లు,పార్టీ నేతలు,శ్రేణులు పాల్గొని ప్రజలకు నవరత్నాలపై అవగాహన కలిగించి..ప్రజల సమస్యలను అడిగి తెలుసుకుంటున్నారు. తూర్పుగోదావరి జిల్లా ముమ్మిడివరం పంచాయతీ పరిధి 17,18 వార్డుల్లో వైయస్‌ఆర్‌సీపీ కోఆర్డినేటర్‌ పొన్నాల వెంకట సతీష్‌కుమార్‌ ఆధ్వర్యంలో రావాలి జగన్‌–కావాలి జగన్‌ కార్యక్రమం నిర్వహించారు.ఇంటింటికి వెళ్ళి నవరత్నాలపై అవగాహన కల్పించారు. పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం మండలం దర్బరేవు గ్రామంలో నరసాపురం పార్లమెంటరీ జిల్లా వైయస్‌ఆర్‌సీపీ అధ్యక్షుడు ముదునూరి ప్రసాదరావు ఆ«ధ్వర్యంలో కావాలి జగన్‌–రావాలి జగన్‌ కార్యక్రమం నిర్వహించారు. ఉంగుటూరు మండలం కైకరంలో రావాలి జగన్‌–కావాలి జగన్‌ కార్యక్రమం నిర్వహించారు.

వైయస్‌ఆర్‌సీపీ ఏలూరు పార్లమెంటరీ సమన్వయకర్త కోటగిరి శ్రీధర్,వుప్పాల వాసుబాబు,మరడా వెంకట మంగారావు,వుప్పాల గోపి, కొరిపల్లి శ్రీను తదితరులు పాల్గొన్నారు. కృష్ణాజిల్లా నందిగామ మండలం గోళ్లముడిలో వైయస్‌ఆర్‌సీపీ విజయవాడ పార్లమెంటురీ పార్టీ జిల్లా అధ్యక్షులు సామినేని ఉదయభాను ఆధ్వర్యంలో కావాలి జగన్‌–రావాలి జగన్‌ కార్యక్రమం నిర్వహించారు. విజయవాడ 34వ  డివిజన్‌లో రావాలి జగన్‌–కావాలి జగన్‌ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విజయవాడ పశ్చిమ నియోజకవర్గ కన్వీనర్‌ వెల్లంపల్లి శ్రీనివాస్,పార్టీ నేతలు పైడిపాటి మురళీ,చట్టర్జీ,రమేష్,మైలవరపు దుర్గారావు తదితరులు పాల్గొన్నారు.

అనంతపురం జిల్లా తాడిపత్రి రజక వీధిలో వైయస్‌ఆర్‌సీపీ సమన్వయకర్త కేతిరెడ్డి పెద్దారెడ్డి తనయుడు హర్షవర్ధన్‌ రెడ్డి ఆధ్వర్యంలో రావాలి జగన్‌–కావాలిజగన్‌ కార్యక్రమం నిర్వహించారు.పార్టీనేతలు,కార్యకర్తలు పాల్గొన్నారు.కల్యాణదుర్గం మండలం తిమ్మ సముద్రం,మంగలకుంట,కడదరకుంట గ్రామాల్లో వైయస్‌ఆర్‌సీపీ సమన్వయకర్త ఉషశ్రీ చరణ్‌ ఆధ్వర్యంలో రావాలి జగన్‌..కావాలి జగన్‌ కార్యక్రమం నిర్వహించారు.రాయదుర్గం 25వ వార్డులో రావాలి జగన్‌–కావాలి జగన్‌ కార్యక్రమం నిర్వహించారు.మాజీ ఎమ్మెల్యే కాపు రామచంంద్రరెడ్డి పాల్గొన్నారు. 44వ వార్డు డివిజన్‌లో మాజీ ఎంపీ అనంత వెంకట్రామిరెడ్డి ఆధ్వర్యంలో రావాలి జగన్‌..కావాలి జగన్‌ కార్యక్రమం నిర్వహించారు. అనంత వెంకట్రామిరెడ్డి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు.

విజయవాడ రూరల్‌లో నిన్ను నమ్మం బాబు..

కృష్ణాజిల్లా  విజయవాడ రూరల్‌ మండలంపాతపాడు,అప్పారావుపేట,సీతారామపురం,వెంకటాపురం గ్రామాల్లో యార్లగడ్డ వెంకట్రావు ఆధ్వర్యంలో నిన్ను నమ్మం బాబు కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు దేవగిరి ఓంకార్‌ రెడ్డి,యార్కరెడ్డి నాగిరెడ్డి, కిరణ్‌బాబు పాల్గొన్నారు.

 

Back to Top