చెప్పాడంటే.. చేస్తాడంతే

"కులం చూడం, మ‌తం చూడం.. పార్టీలు చూడం.. రాజ‌కీయాలు చేయం.. "  ఎన్నిక‌ల‌కు ముందు జ‌గ‌న‌న్న చెప్పిన మాట‌లు. చెప్పిన మాట ప్ర‌కారమే పార‌ద‌ర్శకంగా ప‌రీక్ష నిర్వ‌హించి అనుకున్న స‌మ‌యానికి చెప్పిన తేదీకి అక్టోబ‌ర్ 2న మ‌హాత్ముడి పుట్టిన రోజున ఆయ‌న ఆశీస్సుల‌తో గ్రామ స్వ‌రాజ్యానికి ముఖ్య‌మంత్రి జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి శ్రీకారం చుట్టారు. టీడీపీ నాయ‌కుల కుటుంబాలు అని తెలిసినా మెరిట్ ఆధారంగానే ఉద్యోగాలిచ్చారు. ఈరోజు ఉద్యోగ బాధ్య‌త‌లు చేప‌ట్టిన వారిలో ఎంతో మంది టీడీపీ నాయ‌కుల కుటుంబ స‌భ్యులున్నారు. కొంద‌రు ఎంపీటీసీలుగా, స‌ర్పంచ్‌లుగా ప‌నిచేసిన వారుసైతం ప‌రీక్ష‌లు రాసి ఇప్పుడు ఉద్యోగాల్లో చేరుతున్నారు. వారంతా మెరిట్ ఆధారంగానే ఉద్యోగాల్లో నియ‌మితుల‌య్యారు. పేప‌ర్ లీకై ఉంటే మా పార్టీ వారికే ఉద్యోగాలు ఇవ్వాల‌ని.., టీడీపీ కుటుంబ స‌భ్యుల పిల్ల‌ల‌కు ఇవ్వ‌కూడ‌ద‌ని సీఎం జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి అనుకుని ఉంటే వీరంద‌రికీ ఇప్పుడు ఉద్యోగాలు ద‌క్కేవా.. దేశానికి, రాష్ట్రానికి యువ‌త విలువ తెలిసిన ఓ యువ ముఖ్య‌మంత్రి ఇచ్చిన చిన్న బ‌హుమానం ఈ గ్రామ సచివాలయాలు. ఏటా జ‌న‌వ‌రి మాసంలో ప‌రీక్ష‌లు నిర్వ‌హించి ప్ర‌భుత్వ ఉద్యోగాలు భ‌ర్తీ చేస్తాన‌ని చెప్ప‌డం నిరుద్యోగ యువ‌తకు మేలు చేయాల‌న్న‌ ఆయ‌న సంక‌ల్పానికి నిద‌ర్శ‌నం.
జ‌గ‌న్ ముందుచూపు
స‌చివాల‌యాల ద్వారా ఒక‌వైపు నిరుద్యోగ యువ‌తకు ఉద్యోగాలు క‌ల్పిస్తూనే మ‌రోప‌క్క గ్రామ స్థాయి నుంచే స‌మ‌స్య‌ల ప‌రిష్కారానికి శ్రీకారం చుట్టారు. అవినీతి వేళ్లూనుకుని ఉన్న వ్య‌వ‌స్థ‌ల ప్ర‌క్షాళ‌న‌కు శ్రీమాన్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి శ్రీకారం చుట్టారు. ప్ర‌భుత్వ ప‌థ‌కాలను డోర్ డెలివ‌రీ చేస్తాం అనే మాట‌ను వ‌లంటీర్ల ద్వారా చేసి చూపిస్తున్నారు. 72 గంట‌ల్లో స‌మ‌స్య‌లు ప‌రిష్క‌రిస్తాం అని నిరూపించ‌డానికి గ్రామ స‌చివాల‌య ఉద్యోగులు వ‌స్తున్నారు. ప్ర‌జా సేవ చేయాల‌న్న ఆకాంక్ష‌, ఓర్పు నేర్పు ఉన్న యువ‌త‌తో త‌న 
టీమ్‌ను సిద్ధం చేసుకుంటున్నాడు. 40 ఏళ్ల అనుభ‌వం అని చెప్పుకునే పేప‌ర్ మేధావిని 40 ఏళ్ల కుర్రాడు త‌న ప‌నిత‌నంతో ఢీకొడుతున్నాడు. 
'ఆరు నెల‌ల్లోనే నిరూపించుకుంటా' అని ప్ర‌మాణ స్వీకారం చేసిన రోజునే చెప్పాడు.. నాలుగు నెల‌ల్లోనే 4 నాలుగు ల‌క్ష‌ల ఉద్యోగాలు ఇవ్వ‌డం ద్వారా త‌న ప్ర‌యాణం ఎలా ఉండ‌బోతుందో ఆంధ్రా ప్ర‌జ‌ల‌కు క్లారిటీ ఇచ్చాడు. వేల కోట్లు అప్పులు చేసి రాష్ట్రాన్ని పీక‌ల్లోతు అప్పుల్లో ముంచిన చంద్ర‌బాబును ఈ నాలుగు నెల‌ల్లో ఏనాడూ దూషించ‌లేదు. అయిదేళ్లు ఇసుకను బొక్కేసి వాంతులు చేస‌కుంటున్న టీడీపీ ఇసుకాసురుల‌ను, కరెంటు కాంట్రాక్టుల్లో వేల‌కు వేల కోట్లు అప్ప‌నంగా దోచుకుని ఆంధ్రాన్ని అంధ‌కారంలో నెట్టినా.., పోల‌వ‌రం ప్రాజెక్టు చేప‌ట్టాలంటేనే డ‌బ్బులు పుట్ట‌ని ప‌రిస్థితి సృష్టించి క‌ల‌వ‌ర పెట్టాల‌ని చూసినా మౌన‌మే ఆయ‌న స‌మాధానం. రివ‌ర్స్ టెండ‌రింగ్‌లో వంద‌ల కోట్ల మిగిల్చిన సంఘ‌ట‌న‌లే ఆయ‌న ప‌నిత‌నానికి గీటురాయి.

Back to Top