అధికార దాహంతోనే చంద్రబాబు కుట్ర..




కేసును టీడీపీ నీరుగారుస్తోంది...
వైయస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజా...
హైదరాబాద్ః ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత వైయస్‌ జగన్‌మోహన్‌పై జరిగిన హత్యాయత్నం కేసు విచారణను చంద్రబాబు ప్రభుత్వం నీరుగారుస్తుందని వైయస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజా మండిపడ్డారు.పీపీలో పోలీసు వ్యవస్థ, మంత్రివర్గం స్పందిస్తున్న తీరు అనుమానాలు కలిగిస్తుందన్నారు.హత్యాయత్నంపై టీడీపీ కుట్ర ఉందని స్పష్టమవుతుందన్నారు. వైయస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి స్థాయి ఉన్న వ్యక్తిని అంతమొందించాలంటే దాని వెనుక చాలా పెద్ద స్కెచ్‌ ఉండాలని, పెద్ద లాభం కూడా ఉండాలనే విషయం  చంద్రబాబుకు తెలుసన్నారు.వైయస్‌ రాజశేఖర్‌ రెడ్డి మరణం తర్వాత రాజకీయంగా తనకు ఎదురులేదని భావించిన చంద్రబాబుకు వైయస్‌ జగన్‌ పోలిటికల్‌ ఎంట్రీ చంద్రబాబకు నచ్చలేదనే విషయం అనేకసార్లు తేటతెల్లమయ్యిందన్నారు. కిరణ్‌కుమార్‌ రెడ్డి గవర్నమెంట్‌ను తన భుజస్కందాలపై మోసి వైయస్‌ జగన్‌మోహన్‌ రెడ్డిని ఇబ్బందులు పాలు చేసి జైల్లో పెట్టించిన సంగతి రాష్ట్ర ప్రజలకు తెలుసన్నారు.అలాగే జగన్‌మోహన్‌ రెడ్డిని రాజకీయంగా అణగతొక్కడానికి 22 మంది ఎమ్మెల్యేలను కొనుగోలు చేసిన కూడా  వైయస్‌ జగన్‌ అధైర్యం చెందకుండా ప్రజల్లోకి వెళ్లడం, జగన్‌కు పెద్దఎత్తున్న ప్రజాభిమానం వెల్లువెత్తడంతో సహించలేని చంద్రబాబు కుట్రలు పన్నుతున్నారని ఆరోపించారు. జగన్‌ను ఎదుర్కోవడం అంత సులువు కాదనే ఆలోచనతోనే ఈ స్కెచ్‌ వేసినట్లు అర్థమవుతుందన్నారు.శ్రీనివాస్‌ అనే సామాన్య వ్యక్తి జగన్‌మోహన్‌ రెడ్డిని చంపవలసిన అవసరం లేదని రాష్ట్ర ప్రజానీకానికి అర్థమవుతుందన్నారు. నిందుతుడి మాత్రమే చుట్టూ కేసును తిప్పుతున్నారని కుట్రకోణంలో కేసును దర్యాప్తు చేయడంలేదన్నారు. చంద్రబాబు తన తప్పుపై ఎప్పడైతే విచారణ జరుగుతుందో అప్పుడు ఢిల్లీకి వెళ్ళి  కేంద్రం కాళ్లు పట్టుకుంటారన్నారు. ఎన్నో సంవత్సరాల నుంచి చూస్తున్నామన్నారు. నేడు రాహుల్‌గాంధీని కలవడానికి వెళ్లారని, ఏ పార్టీకైతే వ్యతిరేకంగా తెలుగుదేశం పార్టీని ఎన్టీఆర్‌ పెట్టారో..అదే తెలుగుదేశం పార్టీని నేడు కాంగ్రెస్‌తో జతకలిపి ఎన్నికలకు వెళ్ళాడానికి సిద్ధమయ్యాడంటే చంద్రబాబు అధికార దాహం తేటతెల్లమవుతుందన్నారు.
Back to Top