రాక్షస పాలనను అంతం చేస్తాం

అచ్చెన్నాయుడికి తగిన గుణపాఠం చెబుతాం
వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ నాయకులు
శ్రీకాకుళం: అచ్చెన్నాయుడు రాక్షస పాలనను అంతం చేయడానికి టెక్కలి నియోజకవర్గ ప్రజలంతా సిద్ధంగా ఉన్నారని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ నాయకులు అన్నారు. టెక్కల నియోజకవర్గంలో ప్రజ సంకల్పయాత్రలో పాల్గొన్న వైయస్‌ఆర్‌ సీపీ నాయకులు మీడియాతో మాట్లాడుతూ.. అచ్చెన్నాయుడిని చిత్తుగా ఓడించి పేరాడ తిలక్‌ను ఎమ్మెల్యేగా గెలిపించి వైయస్‌ఆర్‌ సీపీ అధ్యక్షులు వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి పుట్టినరోజు బహుమతిగా ఇస్తామన్నారు. పది వేల మంది నిరుద్యోగుల దగ్గర నుంచి అప్లికేషన్లు తీసుకొని ఓట్లు దండుకున్న అచ్చెన్నాయుడు అధికారంలోకి వచ్చిన తరువాత వారి పొట్టకొట్టాడని మండిపడ్డారు. వారంతా బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారన్నారు. కోటబొమ్మాళిలో వైయస్‌ జగన్‌ పాదయాత్రకు వస్తున్న ఆదరణ చూసి మంత్రి అచ్చెన్నాయుడికి మెదడు పనిచేయడం లేదన్నారు. రాక్షస పాలనను అంతం చేయడానికి ప్రజలంతా సిద్ధంగా ఉన్నారన్నారు. టెక్కలి బహిరంగ సభకు లక్ష మంది జనాలు తరలివస్తారన్నారు. 
 
Back to Top