వైయస్ఆర్ విగ్రహాల ప్రతిష్ఠకు అనుమతించాలి

వైయస్‌ఆర్ విగ్ర హాల ప్రతిష్ఠకు అనుమతివ్వండి
చిత్తూరు: దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖరరెడ్డి విగ్రహాల ఏర్పాటుకు అనుమతివ్వాలని వైయస్ఆర్ సీపీ జిల్లా కన్వీనర్ నారాయణస్వామి జిల్లా కలెక్టర్‌కు విజ్ఞప్తి చేశారు. ఆ పార్టీ చిత్తూరు, సత్యవేడు నియోజకవర్గ ఇన్‌చార్జిలు ఏఎస్ మనోహర్, ఆదిమూలంతో కలసి సోమవారం కలెక్టరేట్‌కు వచ్చిన ఆయన కలెక్టర్‌ను కలిసి ప్రజాసమస్యలను వివరిం చారు. ఈ సందర్భంగా నారాయణస్వామి మాట్లాడుతూ వైయస్‌ఆర్ ప్రజల గుండెల్లో నిలిచిపోయారని, ఆ అభిమానంతోనే ఆయూ ప్రాంతాల్లో ఆయన విగ్రహాలు ఏర్పాటు చేయూలని నిర్ణయిస్తే స్థానిక నాయకులు, అధికారులు అడ్డుకుంటున్నారని తెలిపారు. గంగాధర నెల్లూరు మండలం బాలగంగనపల్లెలో బి.వరదాచారి వైయస్‌ఆర్ విగ్రహాన్ని ఏర్పాటు చేసేందుకు ముందుకు వస్తే స్థానిక నాయకులు అడ్డుపడుతున్నారని ఆరోపించారు. జిల్లాలోని ప్రతిచోట ఇదే పరిస్థితి నెలకొందని స్పష్టం చేశారు. ఇందిరమ్మ గృహ నిర్మాణాల బిల్లులు చెల్లింపుల్లో ఎమ్మెల్యేలు జోక్యం చేసుకుంటుండడంతో అసలైన లబ్ధిదారులు తీవ్రంగా నష్టపోతున్నారన్నారు. గ్యాస్‌ కనెక్షన్ ఉన్నవారు తప్పని సరిగా బ్యాంకు ఖాతా నెంబ ర్‌తో పాటు ఇతర ధ్రువీకరణ పత్రాలు సమర్పించాలని గ్యాస్ ఏజెన్సీలు విని యోగదారుల్ని ఇబ్బందులకు గురిచేస్తున్నాయని చెప్పారు. నగదు బదిలీ పథకంలో లబ్ధిదారులు ఖాతాలు తెరిచేం దుకు బ్యాంకులకు వెళితే రూ.500 అడుగుతున్నారని కలెక్టర్ దృ ష్టికి తెచ్చారు. పుత్తూరులో అంబేద్కర్ విగ్రహం పక్క న ఉన్న స్థలాన్ని కమ్యూనిటీ హాలుకు కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. వైయస్‌ఆర్‌సీపీ నేతల విజ్ఞప్తులపై కలెక్టర్ స్పందిస్తూ సమస్యలను పరిష్కరిస్తామని తెలిపారు.
బాబు పాదయాత్రను ప్రజలు నమ్మరు
ప్రజా సమస్యలను పట్టించుకోకుండా పాదయాత్ర పేరుతో టీడీపీ అధినేత చంద్రబాబు చేస్తున్న జిమ్మిక్కులను ప్రజలు గమనిస్తున్నారని వైయస్ఆర్ సీపీ జిల్లా కన్వీనర్ నారాయణస్వామి అన్నారు. కలెక్టరేట్ ఆవరణలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ రాష్ట్రంలో నెలకొన్న ప్రజా సమస్యలపై పోరాటాలు చేయడంలో తమ పార్టీ ముందుందని తెలిపారు. మిగిలిన పార్టీలు కూడా పోరాటాలు చేస్తున్న నేపథ్యంలో చంద్రబాబు పాదయాత్ర చేపడితే ఎవరికి ప్రయోజనమని ప్రశ్నించారు.
ఇటు రాష్ట్రంలో, అటు కేంద్రంలో కాంగ్రెస్ పార్టీతో కుమ్మక్కై ప్రజా సమస్యలపై పోరాటాలు చేసేందుకు చంద్రబాబు సాహసించడం లేదని దుయ్యబట్టారు. మహానేత రాజశేఖరరెడ్డి ప్రజా సమస్యలను గుర్తించేందుకు పాదయాత్ర చేశారని, చంద్రబాబు తాను కూడా పాదయాత్ర చేశానని చెప్పుకోవడానికి, ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు మాత్రమే పాదయాత్ర చేస్తున్నారని ఆరోపించారు. ఈ యూత్రను ప్రజలు నమ్మే స్థితిలో లేరని తె లిపారు. వంట గ్యాస్‌పై పరిమితులు విధించడంతో పాటు డీజిల్ ధర పెంచి ప్రజలపై కేంద్రం పెనుభారం మోపిందని తెలిపారు. రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షమైన టీడీపీ అసెంబ్లీలో అవిశ్వాస తీర్మానం పెడితే తమ పార్టీ మద్దతు ఇస్తుందన్నారు.రాష్ట్రంలో కాం గ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చి ప్రజా తీర్పుకు వెళ్లడానికి సిద్ధమేనా అని బాబుకు నారాయణస్వామి సవాలు విసిరారు. 

Back to Top