తిరుపతిలో చెవిరెడ్డి ధర్నా

తిరుపతి

8 నవంబర్ 2012 : మంత్రి గల్లా అరుణ కుమారి కుటుంబ సభ్యులు అటవీభూములను ఆక్రమించారని ఆరోపిస్తూ, అందుకు నిరసనగా వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు చెవిరెడ్డి భాస్కర రెడ్డి ఆధ్వర్యాన గురువారం తిరుపతిలో ధర్నా జరిగింది. స్థానిక ఆర్డీఓ ఆఫీసు ఎదుట నిర్వహించిన ఈ ప్రదర్శనలో పెద్దసంఖ్య లో వైయస్ఆర్ సీపీ కార్యకర్తలు పాల్గొన్నారు. అటవీభూములు ఆక్రమణకు గురి అయ్యాయని అధికారులు బహిరంగంగానే ప్రకటించారని చెవిరెడ్డి చెప్పారు. ఆక్రమణకు గురైన అటవీభూములను తిరిగి స్వాధీనపరచుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. మంత్రి కుటుంబసభ్యుల అటవీభూముల ఆక్రమణపై టిడిపి, వామపక్షాల నాయకులు నోరు మెదపకపోవడం సిగ్గుచేటని చెవిరెడ్డి వ్యాఖ్యానించారు.

Back to Top