నెల్లూరు)గాంధీనగర్ లో అనుమతులు లేకుండా నిర్వహిస్తున్న శ్రీచైతన్య పాఠశాలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ...వైయస్ఆర్ సీపీ విద్యార్ధి విభాగం రాష్ట్ర నాయకులు జయవర్ధన్ జిల్లా విద్యాశాఖా అసిస్టెంట్ డైరెక్టర్ ఉషాకి వినతిపత్రం సమర్పించారు. ఇప్పటికే పలుమార్లు వైయస్ఆర్ సీపీ స్టూడెంట్ యూనియన్ ఆధ్వర్యంలో అనేక ఆందోళనలతో పాటు అప్పటి ఇన్ చార్జ్ డిఇఓ కు వినతిపత్రాలు అందించామని చెప్పారు. ఐనా ఫలితం లేదన్నారు.
దీనిపై విద్యాశాఖ అధికారులు బహిరంగంగానే తామేమీ చేయలేకపోతున్నామని చెప్పడం హాస్యాస్పదంగా ఉందని ఎద్దేవా చేశారు. వెంటనే జిల్లా విద్యాశాఖ అధికారులు స్పందించాలని, లేకుంటే వైయస్ఆర్ సీపీ స్టూడెంట్ యూనియన్ ఆధ్వర్యంలో పెద్దఎత్తున ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. కార్యక్రమంలో వైయస్ఆర్ సీపీ విద్యార్ధి విభాగ జిల్లా ప్రధాన కార్యదర్శి యస్ మధన్ కుమార్, నగర ప్రధాన కార్యదర్శి వెంకటేష్, వంశీ నాయకులు ప్రభాకర్, చైతన్య తదితరులు పాల్గొన్నారు.