కాజీపేట: కాజీపేటలోని సోమిడికి చెందిన కాయిత రాజ్‌కుమార్‌యాదవ్ వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ గ్రేటర్ వరంగల్ అధ్యక్షుడిగా నియమితులయ్యూరు. తన ను గ్రేటర్ అధ్యక్షుడుగా నియమించినందుకు వైఎస్‌ఆర్ సీపీ జాతీయ అధ్యక్షుడు వైఎస్.జగన్‌మోహన్‌రెడ్డి, తెలంగాణ శాఖ అధ్యక్షుడు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, రాష్ట్ర అధికార ప్రతినిధి, జిల్లా పరిశీలకుడు కొండ రాఘవరెడ్డి, జిల్లా పార్టీ అధ్యక్షుడు జెన్నారెడ్డి మహేందర్‌రెడ్డి, జిల్లా అధికార ప్రతినిధి అప్పం కిషన్, జిల్లా సేవాదళ్ అధ్యక్షుడు ఎర్రంరెడ్డి మహిపాల్‌రెడ్డికి ఈ సందర్భంగా రాజ్‌కుమార్ యాదవ్ కృతజ్ఞతలు తెలిపారు.<br/>కాయిత రాజ్‌కుమార్ యాదవ్ 1990 నుంచి 2009 వరకు ఒక జాతీయ పార్టీలో కొనసాగుతూ మూడు సార్లు జిల్లా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టారు. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి వైఎస్‌ఆర్ సీపీని స్థాపించగా ఆ పార్టీకి రాజీనామా చేసి వైఎస్‌ఆర్ సీపీలో చేరాడు. ఈ సందర్భంగా రాజ్‌కుమార్ యాదవ్ మాట్లాడుతూ నగరంలో తాగునీరు, పారిశుద్ధ్య సమస్యలతోపాటు గ్రేటర్ వరంగల్ అభివృద్ధికి పార్టీ తరఫున జిల్లా అధ్యక్షుడు జెన్నారెడ్డి మహేందర్‌రెడ్డి నాయకత్వంలో కృషి చేస్తానన్నారు. గ్రేటర్ ఎన్నికల్లో టీఆర్‌ఎస్, టీడీపీ, బీజేపీ తదితర పార్టీల కు దీటుగా పార్టీ బలోపేతానికి కృషి చేయనున్నట్లు తెలిపారు. రాజ్‌కుమార్ యూద వ్ గతంలో జిల్లా యాదవ సంఘం అధ్యక్షుడిగా పని చేశారు.<br/>కాజీపేటలో స్వీట్ల పంపిణీ..రాజ్‌కుమార్ యూదవ్ నియూమకంపై హర్షం వ్యక్తంచేస్తూ కాజీపేటలో ఆదివారం వైఎస్‌ఆర్ సీపీ నాయకులు మంచె అశోక్, ముజఫరుద్దీన్‌ఖాన్ ఆధ్వర్యంలో కార్యకర్తలు స్వీట్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో వైఎస్‌ఆర్ సీపీ నాయకులు మేకల రాజు, అంచూరి వెంకటే శ్వర్లు, ఎం.రవీందర్, రమేష్ పాల్గొన్నారు.