'రాజన్న ముఖం చూసి ఓటు వేశాం'


ఇనుముల సర్వ (మహబూబ్ నగర్ జిల్లా), 10 డిసెంబర్ 2012:

గత ఎన్నికల్లో దివంగత మహానేత డాక్టర్ వైయస్ రాజశేఖరరెడ్డి ముఖం చూసి ఓటువేశామని పాలమూరు జిల్లా ప్రజలు స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీకో, సోనియాగాంధీ ముఖం చూసో తాము ఓటు వేయలేదన్నారు. డాక్టర్ రాజశేఖరరెడ్డి అధికారంలో ఉన్నప్పుడు ప్రతి రోజు కూలి పనులు దొరికేవన్నారు. ఇపుడు పరిస్థితులు తారుమారయ్యాయని వారు ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం నిరు పేదలను పట్టించుకున్న పాపాన పోవడంలేదన్నారు.

     'మరో ప్రజా ప్రస్థానం' పాదయాత్రలో భాగంగా మహానేత తనయ, వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి సోదరి శ్రీమతి షర్మిల సోమవారం పాలమూరు జిల్లా షాద్ నగర్ ప్రాంతంలోని ఇనుముల సర్వ గ్రామంలో పర్యటించారు. గ్రామంలో ఏర్పాటు చేసిన రచ్చ బండ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్థానిక ప్రజలు తమ కష్టాలను శ్రీమతి షర్మిలకు చెప్పుకున్నారు. మహానేత ఉన్నప్పుడు మహిళా సంఘాలకు సకాలంలో రుణాలు ఇచ్చారన్నారు. విద్యార్థులకు ఫీజులు చెల్లించేవారని అన్నారు.
 
     స్థానికులు ఎదుర్కొంటున్న సమస్యలను విన్న శ్రీమతి షర్మిల ప్రభుత్వంపై మండిపడ్డారు. ప్రజా సంక్షేమాన్ని ఈ ప్రభుత్వం గాలికొదిలేసిందన్నారు. కొద్ది రోజుల్లో జగనన్న బయటకు వస్తారని, అప్పుడు రాజన్న రాజ్యం మళ్లీ వస్తుందన్నారు. అప్పటి ఎవరూ అధైర్యపడొద్దని శ్రీమతి షర్మిల కోరారు.

Back to Top