ప్రజల కష్టాలను తెలుసుకునేందుకే షర్మిల పాదయాత్ర

షాద్‌నగర్:

ప్రజల కష్టసుఖాలను తెలుసుకునేందుకే దివంగత మహానేత డాక్టర్ వైయస్ రాజశేఖరరెడ్డి తనయ, వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శ్రీ వైయస్ జగన్మోహన్‌ రెడ్డి సోదరి అయిన శ్రీమతి షర్మిల పాదయాత్ర చేపట్టారని పార్టీ మహబూబ్‌నగర్ జిల్లా నాయకుడు బొబ్బిలి సుధాకర్‌రెడ్డి పేర్కొన్నారు. కొత్తూరు మండల పరిధిలోని పెంజర్ల గ్రామానికి చెందిన మామిడి రాజేందర్‌రెడ్డి, మామిడి నవీన్‌రెడ్డి, బి.శ్రీనివాస్‌రెడ్డి ఆధ్వర్యంలో దాదాపు వందమంది యువకులు పార్టీలో చేరిన సందర్భంగా షాద్‌నగర్‌లోని పార్టీ కార్యాలయంలో వారిని బొబ్బిలి సుధాకర్‌రెడ్డి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తమ పార్టీలో యువకులు పాత్ర అత్యంత కీలకంగా మారుతుందన్నారు. పార్టీని గ్రామగ్రామానా విస్తరింపజేయాలని కోరారు. షర్మిల చేపట్టిన మరో ప్రజాప్రస్థానం పాదయాత్ర శుక్రవారం ఉదయం కేశంపేట మండలం తొమ్మిదిరేకుల గ్రామానికి చేరుతున్న సందర్భంగా నియోజకవర్గంలోని పలు గ్రామాల ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని ఆమెకు ఘనస్వాగతం పలికారు.

Back to Top