నాసిరకం కానుకలు

పురుగులు పట్టి, పుచ్చిపోయిన సరుకులు
లబ్దిదారుల్లో అసహనం

చంద్రన్న కానుకల పేరుతో తెగ హడావుడి చేస్తున్న చంద్రబాబు సర్కార్ పేద ప్రజలను అవమానిస్తోంది. క్రిస్మస్, సంక్రాంతి కానుకల పేరుతో  నాసిరకం సరుకులను పంపిణీ చేస్తూ చేతులు దులుపుకుంటున్నారు. పురుగులు పట్టి, పుచ్చిపోయిన కందిపప్పు, నాసిరకం బెల్లం ఇస్తుండడంతో లబ్దిదారులు మండిపడుతున్నారు. ఇచ్చేదే అర, పావు.. దాంట్లో కూడా నాణ్యత లేని సరుకులను పంపిణీ చేస్తున్నారని వారు వాపోతున్నారు. 

ప్రచారం తప్ప సరుకుల్లో నాణ్యత లేదని లబ్దిదారులు అసహనం వ్యక్తం చేస్తున్నారు.  ఇచ్చింది గోరంత అయితే కొండంతగా  ప్రచారం చేసుకుంటున్నారని ధ్వజమెత్తుతున్నారు.  గతంలో కూడా ఇదే పరిస్థితి ఉందన్నారు.  అధికారులకు ఫిర్యాదు చేసినా ఫలితం లేదని వాపోతున్నారు. 
 
తెల్ల రేషన్ కార్డు దారులకు కేజీ గోధుమపిండి, వంద గ్రాముల నెయ్యి, అరకేజీ బెల్లం, కందిపప్పు, శనగపప్పు, పంచదార అందజేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఈ సరుకుల్లో అరకేజీ బెల్లం 450 గ్రాములు, వంద గ్రాముల నెయ్యికి 90 గ్రాములు ఇలా తూకం తగ్గించి ఇస్తున్నారు. ఇచ్చేదాంట్లో కూడా ఎక్కడ నాణ్యత ఉండడం లేదని లబ్దిదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.  
Back to Top