లబ్ధి చేకూర్చని షాదీ ముబారక్‌..

విజయనగరంః వైయస్‌ జగన్‌ను ముస్లింలు కలిసి తమ సమస్యలు చెప్పుకున్నారు. షాదీ ముబారక్‌ పథకం ద్వారా లబ్ధి చేకూరడంలేదని వివరించారు.  అప్పులు  చేసి పెళ్ళిళ్లు చేస్తున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. షాదీ ముబాకర్‌ పథకం నామమాత్రంగానే ఉందని, డబ్బులు ఇవ్వకుండా నిబంధనలు పేరుతో తిప్పుకుంటురన్నారు. చంద్రబాబు పాలనలో సంక్షేమమే లేదన్నారు. అప్పులు కట్టుకోలేక ఎన్నో ఇబ్బందులు పడుతున్నామన్నారు.సంక్షేమ పథకాలు అందడంలేదన్నారు.మైనార్టీలకు అది చేస్తాం.. ఇది చేస్తాం.. అంటూ చంద్రబాబు కల్లబొల్లి మాటలు చెప్పి ముస్లింలకు మోసగిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కనీసం రేషన్‌కూడా రావడంలేదని వాపోయారు.వైయస్‌ జగన్‌ వస్తే ముస్లింలకు మేలు జరుగతుందని ఆశాభావం వ్యక్తం చేశారు 
 
Back to Top