కిడ్నీ బాధితురాలిని ఆదుకున్న ఎంపీ మిథున్‌రెడ్డి

కురబలకోట: రెండు కిడ్నీలు దెబ్బతిని అనారోగ్యంతో బాధపడుతున్న ఓ మహిళను వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి ఆదుకున్నారు. వివరాల్లోకి వెళితే.. మండలంలోని మండ్యంవారిపల్లెకు చెందిన సి. శివకుమార్‌రెడ్డి కుమార్తె సి. భవిత బీటెక్‌ చదివింది. బెంగళూరు కార్పొరేట్‌ కంపెనీలో ఉద్యోగంలో చేరింది. ఉద్యోగంలో చేరిన మూడు నెలలకే అనారోగ్య బారిన పడడంతో ఆమెను తల్లిదండ్రులు ఆసుపత్రిలో చేర్పించారు. భవితకు పరీక్షలు చేసిన వైద్యులు రెండు కిడ్నీలు పాడయ్యాయని కిడ్నీ మార్పిడికి లక్షల్లో ఖర్చు అవుతుందని డాక్టర్లు చెప్పారు.  దీంతో దిక్కుతోచని స్థితిలో ఉన్న కుటుంబ సభ్యులను పార్టీ నియోజక వర్గ సమన్వయ కర్త పెద్దిరెడ్డి ద్వారకనాధరెడ్డి ఎంపీ దృష్టికి తీసుకెళ్లారు. దీంతో ఎంపీ ప్రధానమంత్రి సహాయ నిధి నుంచి రూ. 3 లక్షలు విడుదల చేయించారు. దీంతో భవిత కుటుంబ సభ్యులు ఊపిరిపీల్చుకున్నారు.

Back to Top