చంద్రబాబు రాజకీయాలు.. దిగజారుడుతనానికి పరాకాష్ఠ

చేతకాని ముఖ్యమంత్రి చంద్రబాబు..
ఏపీలో సమస్యలు గాలికొదిలి.. తెలంగాణలో ప్రచారమా..
కాంగ్రెస్‌తో టీడీపీ పొత్తు అనైతికం..
పదవుల కోసం విలువలకు తిలోదకాలు..
చంద్రబాబు రాజకీయాలు.. దిగజారుడుతనానికి పరాకాష్ఠ
వైయస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజా...
ఏలూరుః ఏపీని సర్వనాశనం చేసి  చేతకాని ముఖ్యమంత్రిగా చంద్రబాబు చ్రరితకెక్కారని  వైయస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజా విమర్శించారు. రాష్ట్రంలో  ఎన్ని సమస్యలున్నా గాలికొదిలి చంద్రబాబు తెలంగాణలో ప్రచారం కోసం తిరుగుతున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్‌ పార్టీతో చంద్రబాబు పొత్తు అనైతికమన్నారు. పదవులు కోసం విలువలకు తిలోదకాలిచ్చి ఎంతటికైనా దిగజారిపోయే వ్యక్తి చంద్రబాబు అని దుయ్యబట్టారు. కాంగ్రెస్‌ వలన వినాశనమేని, దేశం నుంచి తరిమికొట్టాలి అని గతంలో విమర్శలు గుప్పించిన చంద్రబాబు కాంగ్రెస్‌తో జతకట్టడం సిగ్గుచేటరన్నారు. రెండు సంవత్సరాల ముందు రాహుల్‌ గాంధీపై చెప్పులు వేసిన చంద్రబాబు నాయుడు అదే చెప్పులను నెత్తిన పెట్టుకుని నడుస్తున్నారన్నారు. రాహుల్‌గాంధీ గుంటూరు వస్తే చంద్రబాబు టమోటోలతో  కొట్టించిన సంగతి రాష్ట్ర ప్రజలందరికి తెలుసునన్నారు.  అడ్డగోలు విభజించి ఏపీని సర్వనాశనం చేసిన కాంగ్రెస్‌తో కలిసి  వ్యవస్థలను కాపాడం కోసం, చా్రరితాత్మక కలయిక అని చెప్పుకోవడం దారుణమన్నారు. విభజన చట్టంలోని హామీలయిన  ప్రత్యేకహోదా, కడప స్టీల్‌ప్లాంట్, విశాఖ రైల్వేజోన్‌ వంటి విభజన చట్టంలో హామీలను సాధించలేకపోయిన చంద్రబాబు దేశ ప్రయోజనాలు రక్షిస్తాడా అని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో కరువు తాండవిస్తోందని రైతులు అల్లాడిపోతున్నాన్నారు. డ్వాక్రా రుణాలు మాఫీ చెప్పి చంద్రబాబు చేసిన వంచనకు అప్పులపాలై మహిళలు బ్లాక్‌ లిస్ట్‌లో ఉన్నారన్నారు. రాష్ట్రంలో ప్రతి కుటుంబాలను నిర్వీర్యం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉద్యోగాలు లేక నిరుద్యోగులు అల్లాడిపోతున్నారన్నారు. రాష్ట్రంలోని సమస్యలపై పరిష్కారం కోసం ఆలోచన చేయకుండా  తెలంగాణలో ఊరేగుతున్నారని విమర్శించారు. చంద్రబాబు చేసే తప్పులను, బినామీలు చేసే తప్పులను తమ పచ్చ మీడియాతో కలిసి పక్కదారి పట్టిస్తున్నారన్నారు. నాలుగున్నరేళ్లగా మోదీలో చేతుల్లో ఎవరున్నారు.. అన్యాయం చేసింది ఎవరు...చంద్రబాబు నాయుడు కాదా అని ప్రశ్నించారు. మూడుసార్లు బీజేపీతో జత కలిసి ఎన్నికలకు వెళ్ళింది.. చంద్రబాబు నాయుడు కాదా అని అన్నారు. దేశంలోనే నెంబర్‌ వన్‌ అవినీతి పరుడు చంద్రబాబు  అని జూన్‌ 8న చార్జీషీటు కాంగ్రెస్‌ విడుదల చేసిందని గుర్తు చేశారు. ఆ విషయాన్ని రాహల్‌గాంధీ  మరిచిపోయి చంద్రబాబు రాసి ఇచ్చిన స్క్రిప్టును చదువుతున్నారని విమర్శించారు. రాహుల్‌ రాజకీయ అజ్ఞాని అని, నిజాలు మాట్లాడటం మానేసి అబద్ధాల స్క్రిప్టులు  చదువుతున్నారని దుయ్యబట్టారు. 2009 నుంచి 2014 వరుకు కాంగ్రెస్‌ హయాంలో జరిగిన అవినీతిలో కాంగ్రెస్‌ రికార్డు సాధించిందన్నారు నాలున్నరేళ్లుగా ఏపీని  దోచుకున్న చంద్రబాబును మీతో జత కలుపుకోవడం నిజం కాదా అని కాంగ్రెస్‌ను ప్రశ్నించారు. ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికిపోయిన చంద్రబాబు పార్ట్‌నర్‌  రేవంత్‌ను కాంగ్రెస్‌ పార్టీలో చేర్చుకోడం ద్వారా బలమైన సందేశం ఇచ్చారన్నారు. నేడు తెలంగాణను మోసం చేయడానికి కూడా బయలుదేరారని మండిపడ్డారు. తెలంగాణ,ఆంధ్ర ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు.విభజన హామీలు నెరవేర్చకుండా ఏపీని సర్వనాశంన చేసిన  చంద్రబాబు నేటికి  బీజేపీతో చీకటి ఒప్పందాలు చేసుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీనే కాకుండా తెలంగాణను కూడా బాబు, రాహుల్‌ కలిసి సర్వనాశనం  చేయాలనుకుంటుంటే పవన్‌కల్యాణ్‌ మాట్లాడకపోవడం బాధాకరమన్నారు. 6 వేల కోట్లు దోచుకుని బ్యాంకులను నిర్వీర్యం చేసిన చంద్రబాబు బీనామీ సుజనాపై పవన్‌ మాట్లాడకడకపోవడం విచారకరమన్నారు.అవినీతి,అక్రమాలపై ప్రశ్నించకుండా వైయస్‌ జగన్‌పై విమర్శలు చేయడానికి పవన్‌కు అర్హత లేదన్నారు. ప్రజలకు అండగా ఉన్న  జగన్‌పై విమర్శలు మానుకోవాలని హెచ్చరించారు. సాధారణ మహిళ నుంచి ఒక  ప్రతిపక్షనాయకుడి మీద  హత్యాయత్నాలు జరుగుతున్నాయంటే ఏపీలో  లా అండ్‌ అర్డర్‌ ఎంతగా విఫలమయ్యిందో అర్థమవుతుందన్నారు.  వైయస్‌ జగన్‌పై హత్యాయత్నం జరిగితే చంద్రబాబు వెటకారంగా మాట్లాడారని, అదే చంద్రబాబు కొడుకుపై హత్యాయత్నం జరిగి ఉంటే ఇలా మాట్లాడేవారా అని సూటి గా ప్రశ్నించారు.  చంద్రబాబు పాలనలో రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షిణించాయన్నారు. కొడుకు లోకేష్‌కు  రాజకీయ భవిష్యత్‌ ఉండదనే  చెత్త ఆలోచనతో  చంద్రబాబు హత్యా రాజకీయాలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు.. జగన్‌పై హత్యాయత్నం కేసును నిర్వీర్యం చేయడానికి టీడీపీ ప్రభుత్వం ప్రయత్నం చేస్తుందన్నారు.  చివరికి సీబీఐ,ఈడిని కూడా రాష్ట్రంలో రావద్దనడం హస్యాస్పదంగా ఉందన్నారు.
 
Back to Top