మైలవరం నుంచి షర్మిల పాదయాత్ర ప్రారంభం

మైలవరం (కృష్ణాజిల్లా), 15 ఏప్రిల్‌ 2013: శ్రీమతి షర్మిల మరో ప్రజాప్రస్థానం పాదయాత్ర కృష్ణాజిల్లాలో విజయవంతంగా కొనసాగుతోంది. పాదయాత్ర సోమవారంనాడు 121వ రోజుకు చేరుకుంది. మైలవరం నుంచి శ్రీమతి షర్మిల సోమవారం ఉదయం తన పాదయాత్రను ప్రారంభించారు. ఇక్కడి నుంచి కుంటముక్కల ఎక్సు రోడ్‌ మీదుగా వెంకటాపురం వరకు పాదయాత్ర చేస్తారని పార్టీ కార్యక్రమాల కమిటీ కో ఆర్డినేటర్‌ తలశిల రఘురాం, కృష్ణాజిల్లా కమిటి కన్వీనర్‌ సామినేని ఉదయభాను తెలిపారు.

వెంకటాపురంలో శ్రీమతి షర్మిలకు మధ్యాహ్న భోజన విరామం ఉంటుందన్నారు. భోజన విరామం అనంతరం శ్రీమతి షర్మిల చెవుటూరు, జి.కొండూరు, గడ్డమణుగు వరకు పాదయాత్ర చేస్తారని వారు తెలిపారు. సోమవారం రాత్రికి శ్రీమతి షర్మిల గడ్డమణుగు వద్ద బస చేస్తారని రఘురాం, ఉదయభాను వెల్లడించారు. కాగా సోమవారంనాడు శ్రీమతి షర్మిల మొత్తం 14.5 కిలోమీటర్లు పాదయాత్ర చేస్తారు.
Back to Top