‘లీడర్ టు లీడ‌ర్’ డైరీ ఆవిష్క‌రించిన విజయమ్మ

హైదరాబాద్‌ : ‘లీడర్ టు లీడ‌ర్’ డైరీని వై‌యస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ గౌరవ అధ్యక్షురాలు శ్రీమతి వైయస్ విజయమ్మ తమ నివాసంలో‌ సోమవారంనాడు ఆవిష్కరించారు. ప్రముఖ నవలా రచయిత వేంపల్లి నిరంజన్‌రెడ్డి ఈ డైరీని రూపొందించారు. దివంగత మహానేత డాక్టర్ వై‌యస్ రాజశేఖరరెడ్డి జీవిత విశేషాలు, యువనేత‌, జననేత శ్రీ వైయస్ జగ‌న్మోహన్‌రెడ్డి ఓదార్పుయాత్ర, ఆయన వ్యక్తిత్వ విశేషాలతో ఈ డైరీని సచిత్రంగా రూపొందించారు.

ఈ డైరీ ఆవిష్కరణ అనంతరం నిరంజన్‌రెడ్డి విలేకరులతో మాట్లాడుతూ.. దివంగత మహానేత రాజశేఖరరెడ్డి అంటే తమకు ఎంతో అభిమానమని తెలిపారు. 2010 సంవత్సరంలో తొలిసారిగా ఒక డైరీని రూపొందించి వెలువరించామని, దానికి వచ్చిన స్పందనతో మరింత స్ఫూర్తిని పొంది ఈ డైరీని రూపొందించినట్లు ఆయన పేర్కొన్నారు. డైరీలో మహానేత జీవితంలోని ముఖ్య ఘట్టాలు, వైయస్‌ఆర్‌ కాంగ్రెస్ అధ్యక్షుడు‌ శ్రీ జగన్మోహన్‌రెడ్డి విలక్షణ వ్యక్తిత్వాన్ని, ఓదార్పుయాత్ర విశేషాలను కళ్ళకు కట్టినట్లు డైరీలో చూపించామని నిరంజన్‌రెడ్డి పేర్కొన్నారు.
Back to Top