పాదయాత్ర ఎందుకంటే...
17 Oct 2012 7:58 AM
- ఇది ప్రధానంగా కుట్రలు, కుతంత్రాలకు నిరసనగా చేస్తున్న యాత్ర.
- ఇది ప్రజాసంక్షేమాన్ని సర్వనాశనం చేస్తున్న అధికార కాంగ్రెస్‌వైఖరికి నిరసనగా చేస్తున్న యాత్ర.
- ఇది ప్రధానంగా ప్రతిపక్షమైన తెలుగుదేశం పార్టీ, అధికారపక్షమైన కాంగ్రెస్‌తో కుమ్మక్కై ప్రజాసమస్యలను గాలికి వదిలేసినందున, అన్నిటికీ మించి ఇన్ని సమస్యలున్నా ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం పెట్టనందుకు నిరసనగా చేస్తున్న పాదయాత్ర.
- ప్రజల అభిమానాన్ని విశేషంగా సంపాదించుకున్న ఏకైక నాయకుడు జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా మహానేత వైయస్ఆర్ మరణించిననాటి నుంచి కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలు సిబిఐతో కలిసి చేస్తున్న కుట్రలకు వ్యతిరేకంగా జరుగుతున్న పాదయాత్ర.
- ఇది చంద్రబాబు ఎనిమిదేళ్ల ఎనిమిది నెలల పన్నెండు రోజుల పాటు సాగించిన రాక్షస పాలనను మరోసారి ప్రజల ముందుంచేందుకు సాగుతున్న పాదయాత్ర.
- ఇది మూడేళ్లకు పైగా ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ చంద్రబాబును ముఖ్యమంత్రి సలహాదారుగా పెట్టుకుని పెంచుతున్న చార్జీలు, తెగ్గోస్తున్న సంక్షేమ పథకాలకు నిరసనగా సాగుతున్న పాదయాత్ర.
- ఇది ఐదేళ్ల మూడు నెలల పాటు ఆంధ్రప్రదేశ్‌లో గడపగడపకూ, పేదకూ, కూలీకీ, సమాజంలో ప్రతి ఒక్క మనిషికీ ప్రభుత్వం నుంచి అడగక ముందే లెక్కలేనన్ని మేళ్లు అందించిన 'రాజన్న రాజ్యాన్ని' మళ్లీ తీసుకురావడానికి సాగుతున్న పాదయాత్ర.
- ఇది ఇడుపులపాయలోని వైయస్‌ఆర్ స్మారకం సాక్షిగా జగన్మోహన్ రెడ్డి ప్రజల కోసం ఇచ్చిన వాగ్దానాలన్నీ అతి త్వరలోనే రాబోయే జగన్మోహన్ రెడ్డి పాలనలో అమలు చేస్తామని, ఈ కష్టాలలో ఉన్న ప్రజలకు భరోసా ఇచ్చేందుకు సాగుతున్న పాదయాత్ర.
- ఇది రెండు వాగ్దానాలే ఇచ్చి ఆ రెండింటినీ కూడా అధికారంలోకి రాగానే తుంగలో తొక్కిన చంద్రబాబు నైజాన్ని ప్రజలకు గుర్తు చేసే పాదయాత్ర.
- ఇది రెండు వాగ్దానాలే ఇచ్చి వాటితో పాటు రెండొందల పథకాలను చనిపోయేరోజు వరకు అమలు చేసిన వైయస్ఆర్ వారసుల పాదయాత్ర.
- ఇది మాట ఇస్తే మడమ తిప్పని వైయస్ఆర్ వారసుల పాదయాత్ర.
- ఇది ప్రజల కోసం, ప్రజలు సాగించే పాదయాత్ర.
- రేపటి వేకువ కోసం...' రాజన్న రాజ్యం' కోసం...మీ కోసం...మీ బిడ్డల భవిష్యత్తు కోసం కలిసి నడుద్దాం రండి!