జెన్‌కో కార్మికుల ఆందోళ‌న‌కు కాకాణి మ‌ద్ద‌తు

నెల్లూరు: ముత్తుకూరు మండలం నెలటూరులో ఏపీ జెన్కో కాంట్రాక్ట్ లేబర్ చేప‌ట్టిన ఆందోళ‌న‌కు వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్య‌క్షుడు, ఎమ్మెల్యే కాకాణి గోవ‌ర్థ‌న్‌రెడ్డి మ‌ద్ద‌తు తెలిపారు. కార్మికులు చేప‌ట్టిన దీక్షా శిబిరాన్ని శ‌నివారం కాకాణి సంద‌ర్శించారు. వారి స‌మ‌స్య‌లు అడిగి తెలుసుకొని, ధ‌ర్నాకు సంఘీభావం తెలిపారు. అనంత‌రం ఆయ‌న మాట్లాడుతూ..కార్మికుల డిమాండ్లు న్యాయ‌మైన‌వే అని చెప్పారు. యాజ‌మాన్యం కార్మికుల స‌మ‌స్య‌ల ప‌రిష్కారానికి కృషి చేయాల‌ని కోరారు. 


తాజా ఫోటోలు

Back to Top