జగన్ విడుదలకోసం ప్రభం'జనం'

అద్దంకి: వైయస్‌ఆర్ సీపీ అధినేత వైయస్ జగన్‌ మోహన్‌ రెడ్డి జైలు నుంచి బయటకు రావాలని..రాష్ట్రానికి మంచి పాలన అందించాలని ఆకాంక్షిస్తూ ఆ పార్టీ జిల్లా నాయకుడు వైవీ భద్రారెడ్డి శింగరకొండ వరకు చేపట్టిన పాదయాత్రకు అద్దంకిలో అపూర్వ స్పందన లభించింది. మద్దిపాడు మండలం గుండ్లాపల్లి నుంచి ప్రారంభమైన రెండోరోజు పాదయాత్ర సాయంత్రం 4 గంటలకు అద్దంకి పట్టణానికి చేరుకుంది. రామ్‌నగర్ వద్ద పార్టీ పట్టణ కన్వీనర్ కాకాని రాధాకృష్ణమూర్తి ఆధ్వర్యంలో కార్యకర్తలు, అభిమానులు ఎదురేగి పాదయాత్రలో పాల్గొన్న నేతలకు ఘన స్వాగతం పలికారు. భద్రారెడ్డికి మహిళలు హారతులిచ్చి ఆశీర్వదించారు. పట్టణంలోని బంగ్లారోడ్డులో అంబేద్కర్ విగ్రహానికి, ఎన్టీఆర్ నగర్‌లోని వైఎస్‌ఆర్ విగ్రహానికి భద్రారెడ్డి పూలమాలలు వేసి నివాళులర్పించారు. పాదయాత్ర శింగరకొండకు కిలోమీటరు దూరంలో ఉండగా జోరుగా వర్షం మొదలైంది. అంతటి జోరు వర్షాన్ని కూడా లెక్క చేయకుండా పాదయాత్రను కొనసాగించారు. వైయస్‌ఆర్ సీపీ కేంద్ర పాలకమండలి సభ్యుడు వైవీ సుబ్బారెడ్డి పాదయాత్ర ముగింపు కార్యక్రమానికి హాజరయ్యారు. శింగరకొండలోని ప్రసన్నాంజనేయస్వామి దేవాలయంలో వైవీ సుబ్బారెడ్డి, వైవీ భద్రారెడ్డి తదితరులు ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు.

వేలాది మంది కార్యకర్తలు వెంటరాగా..
పాదయాత్రలో 15 వేల మందికిపైగా కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. యువకుల కేరింతలు, డ ప్పు విన్యాసాలు, బాణసంచాతో పాదయాత్ర పట్టణం దాటడానికి దాదాపు 3 గంటలు పైగా సమయం పట్టింది. శింగరకొండలో పాదయాత్ర బృందానికి వైయస్‌ఆర్ సీపీ నాయకులు బాచిన చెంచుగరటయ్య, అద్దంకి మండల కన్వీనర్ జ్యోతి హనుమంతరావు, రావూరి సుందర్‌బాబు తదితరులు స్వాగతం పలికారు. పలు చోట్ల వినాయక విగ్రహాల వద్ద పూజలు చేశారు. పాదయాత్రలో పార్టీ సేవాదళం రాష్ట్ర అడ్‌హాక్ కమిటీ సభ్యులు ఈదా శ్రీనివాసరెడ్డి, పార్టీ నాయకులు జజ్జర ఆనందరావు, బొమ్మిరెడ్డి శేషిరెడ్డి, మలినేని గోవిందరావు, సమరసింహారెడ్డి, నుసుం శ్రీనివాసరెడ్డి, ధూళిపాళ్ల నాగేశ్వరరావు, గడ్డం చిన వెంకటరెడ్డి, స్వయింపు హనుమంతరావు, జాగర్లమూడి శ్రీనివాసరావు, జువ్విరాము, దిల్ శ్రీను, యమహా రాజు, ఏల్చూరి కోటిరెడ్డి, సోము పరమేశ్వరరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Back to Top