ప్రీ ప్లాన్డ్‌గా రోజా కిడ్నాప్‌

విజయవాడ: ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఎమ్మెల్యే రోజాపై ఉన్న భయంతోనే కిడ్నాప్‌ చేయించారని వైయస్‌ఆర్‌ సీపీ మహిళా నేత, విజయవాడ కార్పొరేటర్‌ పుణ్యశీల విమర్శించారు. రాష్ట్రంలో మహిళలపై జరుగుతున్న దాడులపై రోజా నోరు విప్పుతే మహిళ సదస్సు నాశనమై తమ బండారం ఎక్కడ బయటపడుతుందోనని చంద్రబాబు ప్రీ ప్లాన్డ్‌గా పోలీసులతో డ్రామా చేయించారన్నారు. ఎక్కడెక్కడ నుంచో మహిళామణులను పిలుస్తామని చెప్పిన చంద్రబాబు సొంత రాష్ట్ర మహిళా ప్రజాప్రతినిధులను అవమానించడం సిగ్గుచేటని ధ్వజమెత్తారు.  విజయవాడ నగర పాలక కార్పొరేటర్లకు సదస్సుకు ముందు రోజు రాత్రి 10.30 గంటలకు ఆహ్వానపత్రిక ఇచ్చారంటే మహిళలపై చంద్రబాబుకు ఎంత గౌరవం ఉందో ఇక్కడే తేట తెల్ల‌మవుతోందన్నారు. ఇలాంటి ప్రభుత్వం జాతీయ మహిళా సదస్సు పెట్టినందుకు సిగ్గుచేటుగా భావిస్తున్నామని చురకంటించారు. ఎమ్మెల్యే రోజా ఆచూకీ వెంటనే మీడియా ద్వారా తెలియజేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు.

Back to Top