దేవాలయం నిర్మాణానికి భూమిపూజ

ధర్మవరం అర్బన్ః   శారదానగర్‌లోని శ్రీ మారెమ్మతల్లి దేవాలయంలో శుక్రవారం మాజీ ఎమ్మెల్యే, వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం దేవాలయం ముందుభాగం నిర్మాణానికి భూమిపూజ చేశారు. వైయ‌స్ఆర్ సీపీ నాయ‌కులు రాందాసునాయక్‌ తన సొంత ఖర్చుతో నిర్మించనున్న దేవాలయం ముందుభాగం టాప్‌ నిర్మాణానికి భూమిపూజ చేశారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు లాలేనాయక్, చిన్నతిమ్మన్న, నాయకులు సామేనాయక్, రంగేనాయక్, గనేనాయక్, డి.గనేనాయక్, కామిరెడ్డిపల్లి సుధాకర్‌రెడ్డి, రావులచెరువు ప్రతాప్‌రెడ్డి, జయరామిరెడ్డి, సానె నరసింహారెడ్డి, కోళ్లమొరం చంద్రశేఖర్‌రెడ్డి, కేశవరెడ్డి, జేసీబీరమణ, బాలిరెడ్డి, పాలబావిశీనా, దేవరకొండ రమేష్, చౌడప్ప, రమణ, పెద్దన్న, శివారెడ్డి, సానె రమణారెడ్డి, ఓబిరెడ్డి, తుమ్మల ప్రభాకర్‌ తదితరులు పాల్గొన్నారు. 

Back to Top