రైతులు,కూలీల ఆందోళనలుకౌలు డీడ్లు, పింఛన్లు అందక ఆర్తనాదాలుఇప్పుడే పరిస్థితి ఇలా ఉంటే భవిష్యత్ ఏమిటని ఆందోళనలుసీఆర్డీఏ కార్యాలయాన్ని ముట్టడించిన కూలీలు గుంటూరు: కొత్త రాజధాని ప్రాంతంలో రైతులు, రైతు కూలీల ఆందోళనలు మిన్నంటుతున్నాయి. తడి గుడ్డతో గొంతు కోసేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తుండటంతో సామాన్యులు అల్లాడిపోతున్నారు. చెప్పిన మాటలకు, చేతలకు పొంతన లేకపోవటంతో జనం బెంబేలెత్తిపోతున్నారు. సామాన్యుడి ఆగ్రహాన్ని గమనించిన ప్రజా ప్రతినిధులు అటు వైపు తొంగి చూడటం లేదు. భూ సేకరణ పేరుతో రైతుకు ద్రోహంఅమరావతి నిర్మాణం పేరుతో రాష్ట్ర ప్రభుత్వం రైతుల నుంచి అడ్డగోలుగా 34 వేల ఎకరాలు సేకరించిన సంగతి తెలిిసిందే.రాజధాని నిర్మాణానికి అన్ని వేల ఎకరాలు ఎందుకని ప్రతిపక్షాలు ప్రశ్నిస్తే...ప్రపంచ స్థాయి రాజధాని నిర్మించాలన్న విజన్తో తాము ముందుకుపోతున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు బుకాయించారు.రాజధాని నిర్మాణానికి రాక్షసుల్లా అడ్డుపడుతున్నారని విమర్శించారు. కానీ నూతన రాజదానిలో ప్రభుత్వ కార్యాలయాలకు 2వేల ఎకరాలు సరిపోతుందని మహానాడులో ఆమోదించిన తీర్మానంలో స్పష్టంగా పేర్కొన్నారు.ై రెతుల నుంచి సమీకరించిన 34వేల ఎకరాల్లో రోడ్లు,పార్కులు, సామాజిక సదుపాయాలకు కేటాయించగా మిగిలేది 7,200 ఎకరాలు మాత్రమేనని తెలిపారు.అయితే అందులో 2వేల ఎకరాలు ప్రభుత్వ కార్యాలయాలకోసం ఉపయోగించి మిగిలిన 5,200 ఎకరాలను ప్రైవేటు సంస్థలకు లీజుకు ఇచ్చేస్తారట.కార్పొరేటు సంస్థలకు మేలు చేసేందుకు ప్రభుత్వం భూసమీకరణ పేరుతో పచ్చని పంట పొలాలను లాక్కొందన్న మాట. రాజధాని ప్రాంతంలో భూములు కావాలంటే ప్రైవేటు సంస్థలే కొనుగోలు చేసుకోవచ్చు.కానీ అందుకోసం రైతులకు అధిక ధరలు చెల్లించాల్సి ఉంటుంది.అలా కాకుండా ప్రభుత్వం చవకగా రైతుల నుంచి భూములను సమీకరించి ప్రైవేటు సంస్థలకు కట్టబెట్టడం వెనుక పెద్ద మతలబే ఉందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.రైతులకు దక్కాల్సిన సొమ్మును తాము దక్కించుకునేందుకు సర్కారు పెద్దలు ఈ తతంగం నడిపించారన్న వాదనలు బలంగా వినిపిస్తున్నాయి. రైతులకు అందని కౌలు డీడ్లుఇంత తతాంగాన్ని నడిపించిన ప్రభుత్వం రైతుల్ని పట్టించుకోవటం మానేసింది. ఇప్పటికే అంగీకార పత్రాలు లాక్కొన్న సర్కారు వీటి ఆధారంగా కథ నడిపించేస్తోంది. వీటికి సంబంధించి రైతులు ఇచ్చిన అభ్యంతర పత్రాల గురించి ఎవరూ నోరు మెదపడం లేదు. పైగా భూములు త్వర త్వరగా స్వాధీనం అయిపోతున్నాయని మంత్రులు ప్రకటనల చేస్తున్నారు. అటు వ్యవసాయ దారులకు ఇవ్వాల్సిన కౌలు చెక్కులు మ్తాత్రం విడుదల కావటం లేదు. ఇప్పటిక వరకు 23 వేల మంది రైతుల నుంచి భూములు లాక్కొంటే కేవలం 13న్నర వేల మంది రైతులకు మాత్రమే కౌలు చెక్కులు అందాయి. అది కూడా అర కొరగానే అందాయి. మిగిలిన వారికి ఏమాత్రం అందే పరిస్థితి కనిపించటం లేదు. దీంతో రైతులు గగ్గోలు పెడుతున్నారు. ఒక వైపు పిల్లల స్కూల్ ఫీజులు, ఇతర ఖర్చులు మిన్నంటుతున్నాయి. పింఛన్ హామీలకే పరిమితమా..!ఈ నెల ఒకటి నుంచి వ్యవసాయ కూలీలకు రూ. 2,500చొప్పున పింఛన్ ఇస్తామని ప్రభుత్వం ఘనంగా ప్రకటించింది. అయితే ఆచరణలో మాత్రం ప్రభుత్వం శ్రద్ధ కనబర్చడం లేదు. పైగా కుటుంబంలో ఎంత మంది కూలీ చేసుకుని జీవిస్తున్నా - పింఛన్ పేరుతో ఒక్కరికే రూ. 2,500 ఇస్తారని తెలుస్తోంది. అంటే మిగిలిన కుటుంబ సభ్యులకు ఏమీ దక్కదన్న మాట. అంతేకాకుండా ఇస్తామన్న పింఛన్కు సంబంధించిన పూర్తి స్థాయిలో మార్గదర్శకాలు కూడా ఇప్పటి వరకు విడుదల చేయలేదు. గపూర్ మాస్టర్ ప్లాన్తో ముడిపెడుతూ కాలయాపన చేస్తోంది. దీంతో వ్యవసాయ కూలీలు దఫ దఫాలుగా ఆందోళన చేస్తున్నారు. ఒళ్లు మండిన కూలీలు పెద్ద ఎత్తున సీఆర్డీఏ కార్యాలయం దగ్గరకు చేరుకొని ఆందోళన చేపట్టారు. ఒక దశలో పెద్ద ఎత్తున కార్యాలయం లోపలకు ప్రవేశించేందుకు ప్రయత్నించారు. బతికేదెలా..!ప్రస్తుతం రాజధాని ప్రాంతంలో వేల సంఖ్యలో రైతులు ఉన్నారు. వీరిలో 2,356 మంది ఎస్సీ రైతులు ఉండగా, ఎస్టీ రైతులు 174 మంది ఉన్నారు. ఆయా గ్రామాల పరిధిలో 39,509 మంది వ్యవసాయ కూలీలు ఉన్నారు. ఇతర పనులు చేసుకునేవారు మరో 16,654 మంది ఉన్నారు. ఇళ్లు లేని వారు 6,426 మంది ఉన్నారు. ప్రతి కుటుంబంలో నలుగురు లేదా ఐదుగురు ఉంటారు. భూమిలేని కుటుంబాల్లో ప్రతి ఒక్కరూ కూలీ చేసుకోనిదే పూట గడవని పరిస్థితి. రాజధాని ప్రతిపాదిత గ్రామాల్లో ఏడాది పొడువునా వ్యవసాయ పనులు ఉంటాయి. కుటుంబంలో భార్య, భర్తలిద్దరూ పనికి వెళితే రోజుకు రూ. 600 వస్తాయి. ఇద్దరు కలసి నెలకు సుమారుగా రూ. 18 వేలు సంపాదిస్తారు. ఇదే నలుగురు ఉన్న కుటుంబంలో అయితే రెట్టింపు. ఇలాంటి పరిస్థితుల్లో ఫించన్ పేరుతో ఇచ్చే రూ. 2,500 ఒక్కరికే పరిమితం చేస్తే మిగిలిన వారు బతికేదెట్టాగని ఆయా కుటుంబాల వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇటు కౌలు అందక, అటు పింఛన్ అందక బతికేదెట్లా అని వాపోతున్నారు.