దళితుల అభివృద్ధికి జగ్జీవన్ కృషి :విజయమ్మ

హైదరాబాద్, 05 ఏప్రిల్ 2013:

మాజీ ఉప ప్రధాన మంత్రి బాబూ జగ్జీవన్ రాం జయంతి వేడుకలను వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దీక్షా శిబిరంలో నిర్వహించింది. శుక్రవారం ఉదయం ఆయన చిత్రపటానికి పార్టీ ఎమ్మెల్యేలు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్బంగా పార్టీ గౌరవాధ్యక్షురాలు శ్రీమతి వైయస్ విజయమ్మ మాట్లాడారు.  జగ్జీవన్ రామ్ దళితుల అభివృద్ధికి ఎనలేని కృషి చేశారని ప్రశంసించారు. అణగారిన వర్గాల కోసం జగ్జీవన్ చేసిన సేవలను కొనియాడారు. బాబూ జగ్జీవన్ రాం అందరికీ చిరస్మరణీయులనీ, ఆయన అడుగుజాడల్లో అందరూ నడవాలనీ సూచించారు. దివంగత మహానేత డాక్టర్ వైయస్ రాజశేఖరరెడ్డి కూడా దళితుల సంక్షేమానికి పాటుపడ్డారని ఆమె చెప్పారు.

Back to Top