చార్జీలు తగ్గించే వరకూ ఆందోళన కొనసాగిస్తాం

హైదరాబాద్, 7 ఏప్రిల్‌ 2013:

'కరెంట్‌ సత్యగ్రహం' దీక్షను తాము విరమించినా చార్జీలు తగ్గించే వరకూ తమ ఆందోళన కొనసాగుతుందని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ గౌరవ అధ్యక్షురాలు శ్రీమతి విజయమ్మ స్పష్టం చేశారు. ప్రజలకు పెను భారంగా మారిన పెంచిన విద్యుత్ చార్జీలను తగ్గించాల‌న్న డిమాండ్‌తో శ్రీమతి విజయమ్మ ఐదు రోజుల క్రితం హైదరాబాద్ ఆదర్శనగ‌ర్ న్యూ ఎమ్మెల్యే క్వార్ట‌ర్సు ప్రాంగణంలో కరెంట్ సత్యాగ్రహ‌ం దీక్ష చేపట్టారు. శ్రీమతి విజయమ్మతో పాటు పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కూడా దీక్షలో పాల్గొన్నారు. అయితే, శనివారం అర్ధరాత్రి 12.20 గంటలకు వారి దీక్షను పోలీసులు భగ్నం చేశారు. దీక్షాపరులను నిమ్సు ఆస్పత్రికి తరలించారు.

ఈ నేపథ్యంలో ఆదివారం ఉదయం సీనియర్ జర్నలిస్టు పొత్తూరి వెంకటేశ్వరరావు, రైల్వే కోడూరుకు చెందిన రైతు వెంకట్రామయ్య వారికి నిమ్మరసం ఇచ్చి దీక్ష విరమింపజేశారు. ‌దీక్ష విరమించిన అనంతరం శ్రీమతి విజయమ్మ మాట్లాడుతూ.. తాము దీక్ష విరమించినా విద్యుత్ చార్జీలు తగ్గించేవరకు ఆందోళన కొనసాగిస్తామని చెప్పారు.
Back to Top