మ‌భ్య పెట్టేందుకే బాబుదీక్ష‌.. న‌ల్ల‌పురెడ్డి

ఇందుకూరుపేట‌) ప్ర‌జ‌ల్ని మ‌భ్య పెట్టేందుకే చంద్ర‌బాబు న‌వనిర్మాణ దీక్ష‌లు చేప‌డుతున్నార‌ని వైయ‌స్సార్సీపీ ప్ర‌ధాన‌కార్య‌ద‌ర్శి న‌ల్ల‌పురెడ్డి ప్ర‌స‌న్న‌కుమార్ రెడ్డి ధ్వ‌జ‌మెత్తారు. ఢిల్లీ లో దీక్ష చేప‌డితే కేంద్రం దిగివ‌స్తుంద‌ని ౠయ‌న హిత‌వు ప‌లికారు. ఇందుకు వైఎస్సార్‌సీపీ కూడా మద్దతు ఇస్తుందన్నారు. గంగపట్నంలో గురువారం ఆయన విలేకరుల సమావేశం నిర్వహించారు. తెలంగాణ ఇస్తే అభ్యంతరం లేదని చంద్రబాబు లేఖ ఇవ్వడం వల్లే సోనియా విభజనకు సాహసించారని,  అయితే ఇపుడు విభజనలో వైఎస్సార్‌సీపీ ప్రధాన పాత్ర పోషించిందని చెప్పడం ఆయన దిగజారుడుతనానికి నిదర్శనమన్నారు. విభజనకు వ్యతిరేకంగా చివరి వరకు పోరాడింది వెఎస్సార్ కాంగ్రెస్‌పార్టీయేనని స్పష్టంచేశారు.
ఎన్నికల మెనిఫెస్టోలో దాదాపు 400 వాగ్దానాలు చేసి అధికారంలోకి వచ్చిన బాబు వాటిని బంగాళాఖాతంలో తొక్కేశారని ప్రసన్నకుమార్‌రెడ్డి దుయ్యబట్టారు. ఆయన పానలో రాష్ట్రాభివృద్ధి ఇసుమంతైనా లేదన్నారు.అబద్ధపు హామీల గురించి ఈ నెల 8న చంద్రబాబుపై కోవూరు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయనున్నట్లు ప్రసన్న తెలిపారు.
Back to Top