10న ఎమ్మెల్యే బాల‌నాగిరెడ్డి ఆధ్వ‌ర్యంలో వైద్యశిబిరం

క‌ర్నూలు:   వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే బాల‌నాగిరెడ్డి ఆధ్వ‌ర్యంలో ఈ నెల 10న  కౌతాళం మండల పరిధిలోని హాల్వి గ్రామంలో  మెగా  వైద్యశిబిరం ఏర్పాటు చేసినట్లు గ్రామ సర్పంచ్‌ చిన్నఈరన్న, సాగునీటి టీసీ–2 మాజీ అధ్యక్షుడు వీరుపాక్షప్ప తెలిపారు. శనివారం ఏర్పాటు చేసిన విలేక‌రుల సమావేశంలో వారు మాట్లాడుతూ మంత్రాలయం మాజీ ఎంపీపీ సీతారామిరెడ్డి పుట్టిన రోజు సందర్భంగా ఈ క్యాంపును ఏర్పాటు చేసినట్లు తెలిపారు. హైదరాబాదులోని వీరించీ ఆసుపత్రి డాక్టర్లు వైద్యశిబిరంలో పాల్గొని వైద్యసేవలు అందిస్తారని తెలిపారు. డాక్టర్‌ అవినాష్‌దళ్‌ బృందం గెండు సంబంధ‌ రోగులకు పరీక్షలు చేస్తారన్నారు. హాల్వి చుట్టూ ప్రక్కల గ్రామాల ప్రజలు ఈ అవకాశాన్ని స‌ద్వినియోగం చేసుకోవాల‌ని సూచించారు. సమావేశంలో నాయకులు బదినేహల్‌ సింగల్‌ విండో అధ్యక్షుడు అత్రితనయగౌడు, ఉరుకుంద ట్రస్టుబోర్డు మాజీ చైర్మన్‌ దేశాయికృష్ణ, మండల కన్వీనర్‌ నాగరాజ్‌గౌడు, మాబుసాబ్‌లు పాల్గొన్నారు.

Back to Top