Printed on 20-01-2018 22:31:04 PM

వల్లభాపురంలో గడపగడపకు వైయస్సార్‌ కార్యక్రమం
కొల్లిపర(తెనాలిఅర్బన్‌):మండల పరిధిలో వల్లభాపురం పేరంటాళ్ళమ్మ గుడి, వైయస్సార్‌ విగ్రహాం నుండి గడపగడపకు వైయస్సార్‌ కార్యక్రమం బుధవారం నిర్వహించనున్నట్లు వైయస్సార్‌ కాంగ్రెస్‌పార్టీ జిల్లా కార్యదర్శులు భీమవరపు సంజీవరెడ్డి, ఆరగ చంద్రశేఖరరెడ్డిలు తెలిపారు. కార్యక్రమంలో వైయస్సార్‌సీపీ తెనాలి నియోజకవర్గ సమన్వయకర్త అన్నాబత్తుని శివకుమార్‌ గడపగడపకు వెళ్ళి ప్రజాసమస్యలు తెలుసుకొని, పరిష్కారం లక్ష్యంగా పనిచేస్తారన్నారు. కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర, జిల్లా, మండల స్థాయి నాయకులు, పార్టీ శ్రేణులు పాల్గొనాలని ఆయన కోరారు.