ఇచ్చిన హామీలను పక్కాగా అమలు

మాజీ మంత్రి పేర్ని నాని

తాడేప‌ల్లి: మరోసారి కూటమి మోసం చేసే ప్రయత్నం చేస్తోందని మాజీ మంత్రి పేర్ని నాని మండిపడ్డారు. సూపర్‌-6, సూపర్‌-10 పేరుతో మరోసారి మోసానికి తెరలేపారన్నారు. శనివారం ఆయన తాడేపల్లిలోని వైయ‌స్ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మాట్లాడుతూ, 2014లో చంద్రబాబు మాయమాటలు చెప్పారు.. ప్రజల్ని నమ్మించి టీడీపీ అధికారంలోకి వచ్చింది. 2019లో ఇచ్చిన హామీలను సీఎం వైయ‌స్ జగన్‌ అమలు చేశారు. మరోసారి ఇచ్చిన హామీలను పక్కాగా అమలు చేస్తామన్నారు.

2019లో ఇచ్చిన మేనిఫెస్టోను 99 శాతం అమలు చేశాం: మంత్రి ధర్మాన
శ్రీకాకుళం: మంత్రి ధర్మాన ప్రసాదరావు మాట్లాడుతూ మేనిఫెస్టో ను భగవద్గీత, ఖురాన్, బైబిల్‌గా భావిస్తామన్నారు. 2019లో ఇచ్చిన మేనిఫెస్టోను 99 శాతం అమలు చేశాం. మేనిఫెస్టోను చంద్రబాబు హేళనగా తీసుకుంటారు. 20 లక్షల ఉద్యోగాలు అని చెప్పి 20 వేలు కూడా ఇవ్వలేదు. 2014లో చంద్రబాబు మహిళల రుణాలు రద్దు చేస్తామన్నారు. నమ్మి ఓటేసిన మహిళలను చంద్రబాబు మోసం చేశారు’’ అని మంత్రి ధర్మాన మండిపడ్డారు.

మోసం చేయకుండా చేసేవి మాత్రమే మేనిఫెస్టోలో పెట్టాం: మంత్రి బొత్స
విశాఖపట్నం: అన్ని వర్గాలకు మంచి జరిగేలా వైయ‌స్ఆర్‌సీపీ మేనిఫెస్టో ఉందని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. ‘‘మోసం చేయకుండా చేసేవి మాత్రమే మేనిఫెస్టోలో పెట్టాం. గత మేనిఫెస్టోలోని 99 శాతం హామీలను నెరవేర్చారు. విద్యా, వైద్యం, వ్యవసాయంపై ప్రత్యేక దృష్టి పెట్టాం. పేద ఆత్మ గౌరవాన్ని పెంపొందించేలా పథకాలు ఉన్నాయి. లంచాలు, వివక్ష లేకుండా డీబీటీ ద్వారా నగదు జమ చేశాం. గతంలో చంద్రబాబు రుణమాఫీ చేస్తానని చెప్పి మోసం చేశారు. చంద్రబాబు మాయ మాటలను ప్రజలు నమ్మే పరిస్థితి లేదు.. ఇచ్చిన ప్రతి మాటలను సీఎం జగన్‌ నిలబెట్టుకున్నారు. సీఎం వైయ‌స్ జగన్‌ మేనిఫెస్టోలో పెట్టని అంశాలు కూడా అమలు చేశార‌ని మంత్రి బొత్స అన్నారు. 

 

Back to Top