మీ జగన్‌ భూములిచ్చేవాడే కానీ.. లాక్కునే వాడు కాదు 

పాయ‌క‌రావుపేట ఎన్నిక‌ల ప్ర‌చారంలో సీఎం వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌పై చంద్ర‌బాబు దుష్ప్ర‌చారం

ప్రతి ఒక్కరి భూమి మీద సంపూర్ణ హక్కు ఇవ్వాలని ప్రతి గ్రామంలో రీ సర్వే చేయించాం

చంద్రబాబుకు ఓటేస్తే మళ్లీ మోసపోవడమే..

అవ్వాతాతలకు  ఇంటివద్దే పెన్షన్‌ ఇవ్వడం విప్లవం కాదా?

 ప్రభుత్వ బడుల్లో ఇంగ్లీష్‌ మీడియం విప్లవాత్మక మార్పు కాదా?

రైతన్నకు తోడుగా పెట్టుబడి సాయం విప్లవాత్మక మార్పు కాదా?

రూ.2 లక్షల 70 వేల కోట్లు పేదల ఖాతాల్లో వేయడం ఓ విప్లవం

బాబును నమ్మడమంటే కొండ చిలువ నోట్లో తల పెట్టడమే

అనకాపల్లి జిల్లా : ల్యాండ్‌ టైట్లింగ్‌ యాక్ట్‌పై కూడా చంద్రబాబు దుష్ప్రచారం చేస్తున్నాడని ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి మండిపడ్డారు. అనకాపల్లి జిల్లా పాయకరావుపేటలో ఎన్నికల ప్రచార సభలో ఆయన మాట్లాడుతూ, జగన్‌ ఎలాంటి వాడో రాష్ట్ర ప్రజలందరికి తెలుసు. జగన్‌ భూములు ఇచ్చేవాడే కానీ.. భూములు తీసుకునే వాడు కాదు. భూములపై సర్వహక్కులు కల్పించడమే ల్యాండ్‌ టైట్లింగ్‌ యాక్ట్‌.. భూములపై సమగ్ర సర్వే చేయించి.. వారికే హక్కులు కల్పిస్తున్నామని సీఎం వైయ‌స్‌ జగన్‌ అన్నారు.  100 సంవత్సరాల క్రితం బ్రిటిషర్లు ఉన్నప్పుడు సర్వే జరిగింది. ఆ తర్వాత సర్వే జరగలేదు. గ్రామ సచివాలయాల్లో 15 వేల సర్వేయర్లను పెట్టించి ఇలా సర్వే గతంలో ఎవ్వరూ చేయించలేదు. ఆ సర్వే లేక భూములన్నీ సబ్‌ డివిజన్‌ జరక్క, భూముల కొలతలు సరిగ్గా లేక అమ్ముకోడానికి కొనుక్కోడానికి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. కోర్టుల చుట్టూ, రెవెన్యూ అధికారుల చుట్టు తిరుగుతూ, డబ్బులు ఇచ్చుకుంటూ ఇబ్బందులు పడుతున్నారు.  ఈ పరిస్థితి మార్చాలి అని ప్రతి ఒక్కరి భూమి మీద సంపూర్ణ హక్కు ఇవ్వాలని ప్రతి గ్రామంలో రీ సర్వే చేయించామ‌ని సీఎం వివరించారు.  59 నెలల్లో విప్లవాత్మక పాలన చేయడంతో చంద్రబాబుకు మన మీద పిచ్చి కోపం వస్తోంది. మీ వైయ‌స్‌ జగన్‌ మంచి చేశాడని చంద్రబాబుకు కోపమొస్తుంది’’ అని సీఎం వైయ‌స్ జగన్‌  ధ్వజమెత్తారు. అనకాపల్లి జిల్లా పాయకరావుపేటలో నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో  సీఎం వైయస్.జగన్ పాల్గొని ప్ర‌సంగించారు.

ఈ సందర్భంగా సీఎం వైయస్.జగన్ ఏమన్నారంటే..:

పాయకరావుపేట సిద్ధమా.? రెండున్నర కావస్తోంది. ఎండలు చూస్తే తీక్షణంగా ఉన్నాయ్. అయినా కూడా ఏఒక్కరూ ఖాతరు చేయడం లేదు. చిక్కటి చిరునవ్వులతో ఇంతటి ఆప్యాయతలు, ఇంతటి ప్రేమానురాగాలు చూపిస్తున్న నా ప్రతి అక్కకూ, ప్రతి చెల్లెమ్మకూ, నా ప్రతి అవ్వకూ,తాతకూ, నా ప్రతి సోదరుడికీ, స్నేహితుడికీ ముందుగా మీ జగన్ మీ బిడ్డ రెండు చేతులు జోడించి పేరు పేరునా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాడు.
 
పేదలకు చంద్రబాబు మోసాలకు మధ్య యుద్ధం.
మే 13వ తారీఖున కురుక్షేత్ర యుద్ధం మళ్లీ జరగబోతోంది. ఈ యుద్ధం జగన్‌కు, చంద్రబాబుకు మధ్య కాదు. ఈ యుద్ధం పేదలకు, చంద్రబాబు మోసాలకు మధ్య జరగబోతున్న యుద్ధం. ఈ యుద్ధంలో జగన్‌ గెలుపునకు అర్థం.. పథకాలన్నీ కూడా కొనసాగింపు, మరింతగా ఇంటింటి అభివృద్ధి. అదే పొరపాటున చంద్రబాబుకు ఓటేస్తే దాని అర్థం.. పథకాలన్నీ కూడా ముగింపు, మళ్లీ మోసపోవడమే. ఇది ప్రతిఒక్కరూ కూడా గుర్తుపెట్టుకోమని కోరుతున్నాను.

బాబుకు ఓటేస్తే కొండ చిలువ నోట్లో తలపెట్టడమే.
ఈరోజు జరగబోతున్న ఎన్నికలు కేవలం ఎమ్మెల్యేలను, ఎంపీలను ఎన్నుకునే ఎన్నికలు మాత్రమే కావు. ఈ ఎన్నికల్లో మీ ఓటు వచ్చే 5 ఏళ్లలో ప్రతి పేదవాడి ఇంటింటి అభివృద్ధిని, ఆ ప్రతి పేదవాడి కుటుంబం భవిష్యత్తును నిర్ణయించబోయే ఎన్నికలు అని మీ అందరూ కూడా గుర్తుపెట్టుకోమని కోరుతున్నాను. పొరపాటున చంద్రబాబుకు ఓటు వేయడం అంటే దాని అర్థం.. కొండచిలువ నోట్లో తలకాయ పెట్టడమే. బాబును ఓడించడానికి, పేదలను గెలిపించడానికి.. విలువలకు, విశ్వసనీయతకు మరోసారి ఓటు వేయడానికి మీరంతా సిద్ధమేనా?. మంచి చేసి మనం, వంచన చేసి వారు ఎన్నికలకు వెళ్తున్నాం. 

మన స్కీములు చెప్తుంటే చంద్రబాబుకు కోపం వస్తోంది.
నేను వరుసబెట్టి మనందరి ప్రభుత్వం అమలు చేస్తున్న స్కీముల లిస్టు చదువుతుంటే చంద్రబాబు నాయుడికి పిచ్చికోపం వస్తోంది. మీరంతా చూస్తున్నారు కదా ఆ కోపాన్ని. ఆలోచన చేయమని అడుగుతున్నాను. ఆయనకు మనమీద ఎందుకింత పిచ్చికోపం ఎందుకు వస్తోందంటే దానికి కారణం గతంలో ఎప్పుడూ జరగనివిధంగా, గతంలో చూడనివిధంగా ఈ 59 నెలల్లో మీ బిడ్డ విప్లవాలు తీసుకొచ్చాడు కాబట్టే ఆయనకు మనమీద పిచ్చికోపం వస్తోంది. 

మీరందరూ ఆలోచన చేయమని కోరుతున్నాను. గతంలో ఎప్పుడూ చూడనివిధంగా నేను చెప్పబోతున్న అంశాలు గతంలో ఎప్పుడూ చూడనివిధంగా జరిగాయా? లేదా? అన్నది ప్రతిఒక్కరూ ఆలోచన చేయమని కోరుతున్నాను. ఇవన్నీ విప్లవాలు అవునా? కాదా? అన్నది మీరందరూ ఆలోచన చేయమని కోరుతున్నాను. 

అవ్వాతాతలకు ఇంటికే వచ్చే రూ.3వేల పెన్షన్ కానుక..విప్లవమా? కాదా అన్నది ఆలోచన చేయమని కోరుతున్నాను. పిల్లలకు గవర్నమెంట్ బడుల్లో నాడు-నేడు, బడి తెరిచే సమయానికే విద్యాకానుక, బడిలో ఇంగ్లీష్ మీడియం, బైజూస్ కంటెంట్, 3 తరగతి నుంచే టోఫెల్ క్లాసులు, 3వ తరగతి నుంచే సబ్జెక్ట్ టీచర్లు, సీబీఎస్ఈ నుంచి ఐబీ దాకా ప్రయాణం, పిల్లల చేతుల్లో 8వ తరగతికి వచ్చేసరికి ట్యాబ్లు, 6వ తరగతి వచ్చేసరికి గవర్నమెంట్ బడుల క్లాస్ రూముల్లో డిజిటల్ బోర్డులు, డిజిటల్ బోధన, మొట్టమొదటిసారిగా పిల్లల చేతుల్లో బైలింగువల్ టెక్స్ట్ బుక్స్ ఒక పేజీ తెలుగు ఒకపేజీ ఇంగ్లీష్, పూర్తి ఫీజులు చెల్లిస్తూ ఇంజినీరింగ్, డాక్టర్, డిగ్రీలు వంటి పెద్ద చదువులు చదువుతున్న పిల్లలు ఏకంగా 93 శాతం మందికి జగనన్న విద్యాదీవెన, జగనన్న వసతిదీవెన క్రింద పూర్తి ఫీజులు కడుతున్న పరిస్థితులు, పెద్ద చదువుల కోసం అంతర్జాతీయ విశ్వవిద్యాలయాల కోర్సులు మన కరిక్యులమ్ లో ఆన్ లైన్ సర్టిఫైడ్ కోర్సులు భాగాలు చేశాం. ఇవన్నీ కూడా మీ బిడ్డ వచ్చిన ఈ 59 నెలలో జరిగిన విప్లవాలు అవునా కాదా అన్నది మీరంతా కూడా ఆలోచన చేయమని కోరుతున్నాను. 

అక్కచెల్లెమ్మలకు అండగా విప్లవంలా సంస్కరణలు.
మొట్టమొదటిసారిగా ఈ 59 నెలల్లో ఇంతకుముందెప్పుడూ జరగనివిధంగా బడులకు పిల్లలను పంపే తల్లులను ప్రోత్సహిస్తూ మీ పిల్లలను బడికి పంపించండమ్మా మీకు తోడుగా, మీ పిల్లలకు తోడుగా మీబిడ్డ ఉన్నాడు అని చెప్పి అమ్మఒడి ఇచ్చే కార్యక్రమం గతంలో ఎప్పుడైనా జరిగిందా? అని అడుగుతున్నా, ఆలోచన చేయమని కోరుతున్నాను. అక్కచెల్లెమ్మలు తమ కాళ్ల మీద తాము నిలబెడుతూ అండగా ఉంటూ ఆ అక్కచెల్లెమ్మలకు ఓ చేయూత, ఓ కాపునేస్తం, ఓ ఈబీసీ నేస్తం, ఓ వైఎస్సార్ ఆసరా, ఒక సున్నావడ్డీతో పాటు, ఆ అక్కచెల్లెమ్మల పేరిట 31 లక్షల ఇళ్ల పట్టాలు రిజిస్ట్రేషన్ చేసి మరీ ఇవ్వడం.. అందులో ఏకంగా 22 లక్షల ఇళ్లు నిర్మాణం, మొట్టమొదటిసారిగా అక్కచెల్లెమ్మల రక్షణ కోసం మీగ్రామంలోనే మహిళా పోలీస్, మొట్టమొదటిసారి అక్కచెల్లెమ్మల రక్షణ కోసం మీ ఫోన్లోనే దిశ యాప్, మొట్టమొదటిసారిగా అక్కచెల్లెమ్మలకు ఏకంగా 50 శాతం రిజర్వేషన్లు నామినేటెడ్ పదవుల్లోనూ, నామినేటెడ్ కాంట్రాక్టుల్లోనూ ఏకంగా చట్టం చేసి మరీ ఇచ్చినది ఈ 59 నెలలకాలంలోనే కాదా అని అడుగుతున్నాను. ఇవన్నీ విప్లవాలు అవునా? కాదా? అని నా ప్రతి అక్కచెల్లెమ్మ ఆలోచన చేయమని కోరుతున్నాను. 

రైతన్నలకు మొట్టమొదటిసారిగా, ఎప్పుడూ రాష్ట్రంలో జరగనివిధంగా రైతన్న పంట వేసుకొనేటప్పుడు తోడుగా పెట్టుబడికి సహాయంగా రైతుభరోసా, మొట్టమొదటిసారిగా గ్రామాలల్లోనే ఆర్బీకే వ్యవస్థ రైతన్నను చేయిపట్టుకుని నడిపిస్తూ, మొట్టమొదటిసారిగా ఆర్బీకే వ్యవస్థ దాని ద్వారా ఈ-క్రాప్, ఉచిత పంటలబీమా, మొట్టమొదటిసారిగా రైతన్నలకు పగటిపూట 9 గంటలపాటు నాణ్యమైన ఉచిత విద్యుత్, మొట్టమొదటిసారిగా రైతన్నలకు సీజన్ ముగిసేలోగానే సమయానికే ఇన్‌పుట్ సబ్సిడీ.. ఇవన్నీ కూడా ఎప్పుడు జరుగుతున్నాయంటే ఈ 59 నెలల మీ బిడ్డ పాలనలోనే కాదా అని ఒక్కసారి ఆలోచన చేయమని కోరుతున్నా, ఇవన్నీ విప్లవాలు అవునా కాదా అని అడుగుతున్నాను. 

ప్రతి పేదకు కూడా అండగా నిలుస్తూ ఏ పేదవాడు కూడా వైద్యం కోసం అప్పుల పాలయ్యే పరిస్థితి రాకూడదని మొట్టమొదటిసారిగా ఆరోగ్యశ్రీని విస్తరించాం. ఏకంగా రూ.25 లక్షలదాకా ప్రతి పేదవాడికి కూడా ఉచితంగా వైద్యం అందేట్టుగా ఆరోగ్యశ్రీని విస్తరించిన పరిస్థితులు ఈ 59 నెలలకాలంలోనే అవునా? కాదా? అని అడుగుతున్నాను. ప్రతి పేదవాడికి అండగా ఉంటూ.. ఆపరేషన్ అయిన తర్వాత డాక్టర్లు ఆ పేదవాడిని రెస్ట్ తీసుకోమని చెబితే ఆ రెస్ట్ పీరియడ్ లో కూడా ఆదుకుంటూ ఆరోగ్య ఆసరాఅందిస్తున్నాం. 
మొట్టమొదటిసారిగా మన గ్రామంలోనే ఈరోజు విలేజ్ క్లినిక్ కనిపిస్తోంది, మొట్టమొదటిసారిగా మన గ్రామానికే ఫ్యామిలీ డాక్టర్ వస్తున్నాడు, మొట్టమొదటిసారిగా మన ఇంటికే జల్లెడపడుతూ ఆరోగ్య సురక్ష కార్యక్రమంతో మీఇంటి దాకా కూడా వైద్యం అందుతోందంటే ఇవి జరిగింది ఈ 59 నెలల మీ బిడ్డ పాలనలోనే కాదా అని అడుగుతున్నాను. ఇవన్నీ విప్లవాలు అవునా? కాదా? అని అడుగుతున్నాను. 

మొట్టమొదటిసారిగా స్వయం ఉపాధి రంగాన్ని ప్రోత్సహిస్తూ, స్వయం ఉపాధి రంగం ద్వారా చిన్నచితకా జీవితాలతో గడుపుతున్న వాళ్లందరినీ కూడా ఆదుకుంటూ లా నేస్తం అంటూ లాయర్లను, మత్స్యకారభరోసాతో మత్స్యకారులను, నేతన్న నేస్తంతో నేతన్నలను, వాహనమిత్ర, చేదోడు, తోడు, ఎంఎస్ఎంఈలకు సైతం గతంలో ఎప్పుడూ కూడా చూడనివిధంగా మద్దతు, అక్కచెల్లెమ్మలకు ఆసరా, సున్నావడ్డీ, అక్కచెల్లెమ్మలకు చేయూత, ఈబీసీ నేస్తం, కాపునేస్తం ఇవన్నీ కూడా స్వయం ఉపాధిని ప్రోత్సహిస్తూ జరుగుతున్నవి ఈ 59 నెలలకాలంలోనే అవునా? కాదా? అని అడుగుతున్నాను. ఇవన్నీ గతంలో ఎప్పుడూ కూడా చూడనివిధంగా విప్లవాలు అవునా? కాదా? అడుగుతున్నాను. ఆలోచన చేయమని కోరుతున్నాను. 

మన పాలనలో గ్రామ స్వరాజ్యానికి అర్ధం చెబుతూ...
మొట్టమొదటిసారిగా గతంలో ఎప్పుడూ కూడా చూడనివిధంగా గ్రామ స్వరాజ్యానికి అర్థం చెబుతూ ఈరోజు ఎవరైనా కూడా గ్రామంలోకి అడుగుపెట్టిన వెంటనే ఒక నాలుగు అడుగులు ఆ గ్రామంలో వేస్తే చాలు ఒక గ్రామ సచివాలయం కనిపిస్తోంది. ఏకంగా 600 రకాల సేవలు మన ఇంటివద్దనే అవన్నీ కూడా అందుబాటులోకి వచ్చాయి.  ఎప్పుడూ జరగనివిధంగా 60-70 ఇళ్లకు ఈరోజు వాలంటీర్ వ్యవస్థ వచ్చి నేరుగా మీ ఇంటి దగ్గరికే వచ్చి అవ్వాతాతలకు ఇంటికే అందించే పెన్షన్ దగ్గర్నుంచి పౌరసేవలు, పథకాల వరకు కూడా మీ ఇంటికే వచ్చి చిరునవ్వుతో గుడ్ మార్నింగ్ చెబుతూ చిక్కటి చిరునవ్వుతో చెల్లెమ్మా బాగున్నావా? అక్కా బాగున్నావా? అవ్వా బాగున్నావా? తాత బాగున్నావా? రైతన్నా బాగున్నావా? అని మొట్టమొదటిసారిగా ఈమాదిరి గ్రామం మారిందంటే.. అదే గ్రామంలో నాలుగు అడుగులు ముందుకేస్తే అక్కడే కనిపిస్తోంది విలేజ్ క్లినిక్, అదే గ్రామంలో నాలుగు అడుగులు ముందుకేస్తే నాడు-నేడుతో మారిన ఇంగ్లీష్ మీడియం బడులు కూడా కనిపిస్తాయి. ఆలోచన చేయమని అడుగుతున్నాను ఇవన్నీ కూడా మన గ్రామంలో ఇంతకుముందు ఉండేవా? ఈమాదిరిగా జరిగేదా? అని ఒక్కసారి అందరూ ఆలోచన చేయమని కోరుతున్నాను. 

గ్రామాల్లో డిజిటలైజేషన్....
ఈరోజు గ్రామానికే ఫైబర్ గ్రిడ్, గ్రామంలోనే నిర్మాణంలో ఉన్న డిజిటల్ లైబ్రరీలు.. ఇవన్నీ కూడా విప్లవాలు అవునా? కాదా? అని అడుగుతున్నా. గతంలో ఎప్పుడూ కూడా చూడనివిధంగా, జరగనివిధంగా ఇంతకుముందు రోజుల్లో మీబిడ్డ ప్రభుత్వం రాకముందు మీలో ఎవరికైనా కూడా ఎవరైనా వచ్చి గవర్నమెంట్ ఏదైనా డబ్బు ఇస్తుంది, ఆ డబ్బు ఇచ్చేది నేరుగా మీ చేతికి వస్తుంది, ఆ డబ్బు కోసం ఎవరికీ లంచాలు ఇవ్వాల్సిన పనిలేదు, ఎవరిచుట్టూ తిరగాల్సిన పనిలేదని ఎవరైనా మీకు చెబితే మీలో ఎవరైనా నమ్మి ఉండేవారా? అని మీ అందరి సమక్షంలో అడుగుతున్నాను. ఈరోజు ఈ 59 నెలల మీబిడ్డ కాలంలో మీ బిడ్డ నేరుగా బటన్ నొక్కుతున్నాడు, రూ.2.70 లక్షల కోట్లు మళ్లీ చెబుతున్నా రెండు లక్షల 70 వేల కోట్ల రూపాయలు నేరుగా మీబిడ్డ బటన్ నొక్కిన వెంటనే నా అక్కచెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి వివిధ పథకాల ద్వారా నేరుగా పోతున్నాయి. ఎక్కడా లంచాలు లేవు, ఎక్కడా వివక్ష లేదు. మీబిడ్డ బటన్ నొక్కుతున్నాడు ఏకంగా నా అక్కచెల్లెమ్మల కుటుంబాల కోసం ఏకంగా 130 సార్లు బటన్ నొక్కాడు. నా అక్కచెల్లెమ్మలు, వాళ్లు కుటుంబాలు, వాళ్ల పిల్లలు బాగుండాలని మీ బిడ్డ 130 సార్లు బటన్ నొక్కి నా అక్కచెల్లెమ్మలకు నేరుగా పంపించింది, వాళ్ల కుటుంబాలకు పంపించింది, నేరుగా వాళ్ల చేతికే ఇచ్చింది ఏకంగా రూ.2.70 లక్షల కోట్లు అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా ఇదొక విప్లవం అవునా? కాదా?.

మరి ఇదే సందర్భంగా మీ బిడ్డ చంద్రబాబును అడుగుతున్నాడు. అయ్యా చంద్రబాబు 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా పరిపాలన చేశానని చెబుతావు, 3 సార్లు ముఖ్యమంత్రి అయ్యానని నువ్వు చెప్పుకుంటావు.. మరి నీ పేరు చెబితే ఏ పేదవాడికైనా ఒక్కటైనా మంచి గుర్తుకు వస్తుందా అని అడుగుతున్నాను. 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా చేశానంటాడు, 3 సార్లు ముఖ్యమంత్రి అంటాడు.. మరి ఆ చంద్రబాబు పేరు చెబితే ఏ పేదవాడికైనా కూడా ఒక్కటంటే ఒక్క స్కీమ్ అయినా గుర్తుకు వస్తుందా? అని అడుగుతున్నాను. ఇలాంటి మనిషి ఇవాళ ఎంతకు దిగజారిపోయాడో మీరే చూస్తున్నారు. ఈరోజు మీ బిడ్డ యుద్ధం చేస్తోంది ఒక్క చంద్రబాబుతోనే కాదు.. ఈరోజు మీ బిడ్డ ఒక్కడే ఒక్కడు ఇటువైపున నిలబడి ఉన్నాడు.. పేదలపక్షాలన నిలబడి ఉన్నాడు, మంచిచేసి మీఅందరికీ తోడుగా మీబిడ్డ ఒక్కడే నిలబడి ఉన్నాడు. అటువైపున చూస్తే.. చంద్రబాబు కనిపిస్తాడు, ఓ ఈనాడు కనిపిస్తుంది, ఓ ఆంధ్రజ్యోతి కనిపిస్తుంది, టీవీ5 కనిపిస్తుంది, ఓ దత్తపుత్రుడు కనిపిస్తాడు, వీళ్లందరికీ తోడు ఓ బీజేపీ, ఓ కాంగ్రెస్.. ఇవి సరిపోవు అన్నట్టుగా కుట్రలు, కుతంత్రాలు, అబద్ధాలు, మోసాలు. 

అబద్ధాలకు రెక్కలు కడుతున్న చంద్రబాబు.
ప్రతిరోజూ కూడా ఇదే జరుగుతోంది గమనించమని మీఅందరినీ కూడా కోరుతున్నాను. ఈ మాటలు చెబుతూ మీ అందరితో కూడా నేను ఒకటే చెబుతున్నాను. చంద్రబాబు నాయుడు తన అబద్ధాలకు, మోసాలకు రెక్కలు కడుతున్నాడు. లేనిపోని అబద్ధాలన్నీ కూడా చెప్తున్నాడు. ఈమధ్య కాలంలోనే చెప్తున్నాడు.. అవ్వాతాతలకు ఇంటికే వచ్చే పెన్షన్ తాను ఆపి మనం ఆపామని చెబుతున్నాడు. నిజంగా ప్రతిఒక్కరూ కూడా ఆలోచన చేయమని అడుగుతున్నా అబద్ధాలు ఏ స్థాయిలో చెప్తున్నాడో అని. ఏరోజైనా 14 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, 3 సార్లు ఆయన ముఖ్యమంత్రిగా చేశానంటాడు ఏఒక్కరోజైనా కూడా అవ్వాతాతల బాధ పట్టించుకున్నాడా? ఏ రోజైనా కూడా అవ్వాతాతల కష్టాన్ని చూశాడా? ఏ ఒక్కరోజైనా కూడా అవ్వాతాతలకు ఇంటికే పెన్షన్ ఇచ్చాడా? అడుగుతున్నాను. ఒక్కరోజు కూడా 14 ఏళ్లు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒక్కరోజు కూడా అవ్వాతాతల బాధను పట్టించుకుని ఇంటికే పెన్షన్ పంపని ఈ వ్యక్తి ఈరోజు ఎన్నికలు వచ్చేసరికి జగన్‌ కు మంచి పేరు వచ్చేస్తోంది, అవ్వాతాతలందరూ కూడా జగన్‌ను గుండెల్లో పెట్టుకున్నారు అని అవ్వాతాతలకు ఇంటికే అందే పెన్షన్ ను దగ్గరుండి ఆయనే తన మనిషి అయిన నిమ్మగడ్డ రమేశ్ తో కేంద్ర ఎన్నికల కమిషన్ కు లేఖ రాయించి ఆపించి తీరా ఆపిన తర్వాత ఆ అవ్వాతాతలు చంద్రబాబు నాయుడి గారిని తిట్టిన తిట్టు తిట్టకుండా తిడుతున్నారని తెలుసుకుని ఆ నెపాన్ని కూడా మీబిడ్డ మీదనే వేస్తున్నాడు అంటే ఇంతకన్నా దారుణమైన రాజకీయాలు ప్రపంచ చరిత్రలో ఎక్కడైనా ఉంటాయా అన్నది ప్రతిఒక్కరూ ఆలోచన చేయమని కోరుతున్నాను. 

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై దుష్ప్రచారం చేస్తున్నారు.
అదే మాదిరిగా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌ విషయంలో కూడా దుష్ప్రచారం జరుగుతోంది. జగన్‌ మీ భూములు కాజేస్తాడు అని ప్రతి ఒక్కరికీ మెసేజ్‌లు పంపుతున్నారు, ఫోన్లు చేసి చెబుతున్నారు. అయ్యా చంద్రబాబు.. జగన్‌ ఎలాంటివాడో నీకు తెలియదేమో కానీ, ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి పేదకూ తెలుసు. జగన్‌ భూములు ఇచ్చేవాడే కానీ నీలా భూములు లాక్కునేవాడు కాదు. అసలు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అంటే చంద్రబాబుకు తెలుసా? ల్యాండ్ టైటిలింగ్‌ యాక్ట్ అని అంటే దాని అర్థం మీ భూముల మీద సర్వహక్కులూ కల్పించడం. మీ భూములు 100 సంవత్సరాల క్రితం బ్రిటీషర్లు ఉన్నప్పుడు సర్వే జరిగింది. దాని తర్వాత ఏ ఒక్కరూ సర్వే చేయలేదు. 15 వేల గ్రామ సచివాలయాల్లో 15వేల సర్వేయర్లను నియమించి ఇలా సర్వే చేసిన పరిస్థితి గతంలో ఎప్పుడూ లేదు. ఆ పరిస్థితులు లేక, ఆ సర్వేలు లేక, భూముల సబ్‌ డివిజన్ సరిగ్గా జరక్క, భూముల కొలతలు సరిగ్గా లేక అమ్ముకోడానికి కొనుక్కోడానికి ఇబ్బందులు ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. కోర్టుల చుట్టూ, రెవెన్యూ అధికారుల చుట్టూ తిరుగుతూ, డబ్బులు ఖర్చుపెడుతూ ఇబ్బందులు పడుతున్నారు. ఈ పరిస్థితి మార్చాలని, ప్రతి ఒక్కరి భూమిమీద వారికి సంపూర్ణ హక్కు ఇవ్వాలి అని, వందేళ్లక్రితం జరిగిన సర్వేను, మళ్లీ ఇప్పుడు రీ సర్వే చేయించి, బౌండరీస్ నాటించి, రికార్డులను అప్డేట్‌ చేసి, ఆ పత్రాలన్నీ రిజిస్ట్రేషన్ చేసి రైతన్నలకు ఇచ్చే కార్యక్రమం జరుగుతోంది. ఇంత గొప్ప కార్యక్రమానికి చేతనైతే మద్దతు పలకాలే కానీ లేని పోని దుష్ప్రచారాలు చేస్తున్నారు. 

బాబును ప్రపంచంలో ఎవరైనా నమ్ముతారా?.
నిన్ననే చంద్రబాబు మేనిఫెస్టో చూపించాడు. 2014 లో చంద్రబాబు మీ ప్రతి ఇంటికీ మేనిఫెస్టోలో ఏం పంపాడు? ఏం చేసాడు? అని మీకు ఒకసారి చెబుతాను. అది విన్నాక అవునో కాదో మీరే చెప్పండి. చంద్రబాబును ప్రపంచంలో ఎవ్వరైనా నమ్ముతారా అని మీరే నిర్ణయించుకోండి. 2014 లో బాబు ఇచ్చిన ఈ మేనిఫెస్టో గుర్తుందా (టీడీపీ మేనిఫెస్టో ప్రజలకు చూపుతూ) కూటమిగా ఇదే ముగ్గురు...దత్తపుత్రుడు, ఢిల్లీ నించి తెచ్చిన మోడీగారి ఫొటో పెట్టి, కింద చంద్రబాబు సంతకం పెట్టి, ముఖ్యమైన హామీలు అని చెప్పి, ప్రతి ఇంటికీ పాంప్లెట్ పంపాడు చంద్రబాబు. మళ్లీ ప్రజలు మర్చిపోతారేమో అని ఈనాడు, ఈటీవీ, ఏబీఎన్‌, టీవీ5 లో అడ్వర్టైజ్ మెంట్‌లు ఊదరకొట్టాడు. రైతు రుణమాఫీ చేస్తానని రాసాడు. మరి రూ.87,612 కోట్లు రైతులకు సంబంధించిన రుణాలు మాఫీ అయ్యాయా? బాబు చెప్పిన రెండో హామీ పొదుపు సంఘాల రుణాలన్నీ రద్దు చేస్తానన్నాడు. మరి బాబు హయాంలో రూ.14,205 కోట్ల పొదుపు సంఘాల రుణాల్లో ఒక్క రూపాయి అయినా మాఫీ చేసాడా?

మరో ముఖ్యమైన హామీ.. ఆడబిడ్డ పుడితే మహాలక్ష్మీ పథకం కింద రూ.25,000 బ్యాంక్‌లో వేస్తాను అని చెప్పాడు. మీ అందరి ఇళ్లలో ఆడపిల్లలు పుట్టారు కదా..ఏ ఒక్కరికైనా ఒక్క రూపాయి అయినా వేసాడా? ఇంటింటికీ ఒక ఉద్యోగం, ఉద్యోగం ఇవ్వలేకపోతే నిరుద్యోగభృతి ప్రతి నెలా రూ.2000 అన్నాడు. ఐదేళ్ల చంద్రబాబు పాలన అంటే 60 నెలలు, నెలకు రెండు వేల రూపాయిలు. ప్రతి ఇంటికీ రూ.1,20,000...ఎవరికి ఇచ్చాడు? ముఖ్యమైన హామీలు అంటూ అర్హులందరికీ మూడు సెంట్ల స్థలం, కట్టుకునేందుకు పక్కా ఇల్లు, ఇన్ని వేల మంది ఇక్కడ ఉన్నారు.. మీలో ఏ ఒక్కరికైనా చంద్రబాబు ఒక్క సెంటు స్థలమైనా ఇచ్చాడా?  రూ.పదివేల కోట్లతో బీసీ సబ్‌ ప్లాన్, చేనేత, పవర్‌ లూమ్‌ రుణాల మాఫీ, విమెన్‌ ప్రొటక్షన్‌ ఫోర్సు ఏర్పాటు అన్నాడు, సింగపూర్‌కు మించి అభివృద్ధి అన్నాడు జరిగిందా? ప్రతి నగరంలో ఓ హైటెక్‌ సిటీ నిర్మిస్తా అన్నాడు. జరిగిందా? మన పాయకరావుపేటలో కనిపిస్తోందా? ఇందులో చంద్రబాబు చెప్పినవి, మీ ప్రతి ఇంటికీ పంపించిన ఈ పాంప్లెట్‌లో ఒక్కటంటే ఒక్కటైనా జరిగిందా? మరి ఇలాంటి వాళ్లను నమ్మవచ్చా?

ఇవాళ మళ్లీ ఇదే ముగ్గురు ఏమంటున్నారు. సూపర్ సిక్స్ అంటున్నారు నమ్ముతారా? సూపర్ సెవెన్ అంటున్నారు నమ్ముతారా? ఇంటింటికీ కేజీ బంగారం అంటున్నారు నమ్ముతారా? ఇంటింటికీ బెంజ్‌ కారు అంటున్నారు నమ్ముతారా? ఇలాంటి అబద్ధాలు, మోసాల మధ్య ఎన్నికలు జరుగుతున్నాయి. 

లంచాలు, వివక్ష లేని పాలన కావాలంటే ఫ్యానుకే ఓటేయండి.
వాలంటీర్లు మళ్లీ ఇంటికే రావాలన్నా..పేదవాడి భవిష్యత్ మారాలన్నా.. లంచాలు, వివక్ష లేని పాలన జరగాలన్నా.. పథకాలన్నీ కొనసాగాలన్నా.. మన పిల్లలు, మన బడులు బాగుపడాలన్నా.. మన వ్యవసాయం, మన హాస్పటల్స్ మెరుగు పడాలన్నా రెండు బటన్లు ఫ్యాన్‌ మీద నొక్కాలి.  175 కు 175 అసెంబ్లీ స్థానాలు, 25 కు 25 ఎంపీ స్థానాలు తగ్గేందుకు వీలే లేదు సిద్ధమేనా?..

అక్కడో ఇక్కడో మన గుర్తు తెలియని వాళ్లుంటే...అక్కచెల్లెమ్మలు, అవ్వాతాతలకు చెబుతున్నా...మన గుర్తు ఫ్యాను. మర్చిపోకూడదు. మంచి చేసిన ఈ ఫ్యాను ఇంట్లోనే ఉండాలి, చెడు చేసిన సైకిల్ ఇంటి బయట ఉండాలి, తాగేసిన టీ గ్లాసు సింకులోనే ఉండాలి. మీ అందరి చల్లని దీవెనలు ఆశీస్సులు కోరుతున్నాను.

మన పార్టీ తరపున పోటీ చేస్తున్న ఇద్దరు అభ్యర్ధులపై మీ చల్లని దీవెనలు, ఆశీస్సులు ఉంచమని సవినయంగా ప్రార్థిస్తున్నాను. ఇంతటి ఎండలో కూడా ఏమాత్రం చెరగని చిరునవ్వుతో నామీద ప్రేమాభిమానాలు చూపిస్తున్న మీ అందరికీ మీ బిడ్డ పేరుపేరునా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాడు అని అంటూ సీఎం శ్రీ వైయస్. జగన్ తన ప్రసంగాన్ని ముగించారు.

కార్యక్రమంలో పాయకరావుపేట వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్ధి కంబాల జోగులు, అనకాపల్లి ఎంపీ అభ్యర్ధి బూడి ముత్యాలనాయుడు పాల్గొన్నారు.
 

Back to Top