ఏయూ ర్యాగింగ్‌లో టీడీపీ నేతల కుమారులు?

వైయ‌స్ఆర్‌సీపీ ఎంపీ విజయసాయి రెడ్డి ట్వీట్‌
 

ఢిల్లీ: ఏపీలో కూటమి ప్రభుత్వంపై  వైయ‌స్ఆర్‌సీపీ ఎంపీ విజయసాయి రెడ్డి ట్విట్ట‌ర్‌. చంద్రబాబు పాలనలో ఏయూ వర్సిటీలో మళ్లీ ర్యాగింగ్‌ రక్కసి పురుడు పోసుకుంది.. అక్కడ దారుణం జరుగుతున్నా ప్రభుత్వం నిద్రపోతుందా? అని ప్రశ్నించారు. టీడీపీ నాయకుల సుపుత్రులు కూడా ఉన్నట్టు తెలుస్తోందన్నారు.

ఎంపీ విజయసాయి రెడ్డి ట్విట్టర్‌ వేదికగా..‘ఆంధ్ర యూనివర్శిటీలో కొంతకాలంగా లేని  ర్యాగింగ్ రక్కసి మళ్లీ పురుడు పోసుకుని విద్యార్ధినిలు నేరుగా మీడియా ముందుకి రావడంతో బట్టబయలు అయ్యింది. హాస్టల్ రూమ్స్‌లో అసభ్యకరంగా డ్యాన్సులు చేయాలంటూ ఫస్టియర్‌ విద్యార్థినులపై దురుసుగా ప్రవర్తిస్తూ కొంతమంది సీనియర్లు ఇబ్బంది పెట్టి వీడియోలు తీసి వాట్సాప్‌ గ్రూపుల్లో కూడా పెట్టారు.

Back to Top