బాలకృష్ణకు సినిమాల్లో.. రాజకీయాల్లో కొనసాగే అర్హత లేదు

వైయ‌స్ఆర్‌సీపీ మ‌హిళా అధ్య‌క్షురాలు, ఎమ్మెల్సీ పోతుల సునీత‌

నంద్యాల‌:  సినీ హీరో, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణకు సినిమాల్లో, రాజ‌కీయాల్లో కొన‌సాగే అర్హ‌త లేద‌ని వైయ‌స్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ పోతుల సునీత అన్నారు. శుక్ర‌వారం నంద్యాలలో ఆమె మీడియాతో మాట్లాడారు. కూతురు వయస్సువున్న హీరోయిన్లతో బాల‌కృష్ణ అసభ్యంగా ప్రవర్తించడం సిగ్గుచేటు అని మండిప‌డ్డారు. బాలకృష్ణ సినిమాల్లో ఒక రకంగా , నిజ జీవతంలో మరో రకంగా వ్యవహరిస్తున్నారని దుయ్యబట్టారు.
 అసెంబ్లీలో కూడా బాలకృష్ణ తీరు చాలా అభ్యంతరకరంగా ఉందన్నారు. ఎమ్మెల్యేగా ఏనాడైనా బాలకృష్ణ ప్రజల సమస్యల పై చర్చించాడా? అని ప్రశ్నించారు. ఎన్టీఆర్‌ను చంద్రబాబు వెన్నుపోటు పొడిచినప్పుడు పౌరుషం ఏమైంది..? మీ నాన్న పై చెప్పులు వేయించినపుడు ఎక్కడికి పోయింది పౌరుషం అంటూ ఎమ్మెల్సీ పోతుల సునీత నిల‌దీశారు.

Back to Top