కుట్రలు భయటపడాలి అంటే ముందు జేడి లక్ష్మినారాయణకు నార్కోటెస్ట్చేయాలిఈ రోజు జగన్‌మోహన్‌రెడ్డి గారి పట్ల సీబీఐ అధికారులు కనపరిచిన తీరు అత్యంత దుర్మార్గంగాఉన్నది. దీనిని వైయస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖండిస్తుంది. జైలు దగ్గర జగన్‌మోహన్‌రెడ్డి గారు అభ్యంతరం వ్యక్తంచేసిన, అధికారులు కనబరిచిన తీరు ప్రభుత్వ శాడిజంగా కనిసిస్తుంది. ఎన్నికలముందు ప్రజలను, ఓటర్లను భయకంపితులుగా చేయడానికి జరిగిన కుట్రలో ఒక బాగం మాత్రమే. ఎవరి అదేశాలమేరకు పోలీసులు అలా ప్రవర్తించారు చెప్పవలసిన భాద్యత పోలీసుల మీద ఉంది. రోజు బుల్లెట్ ప్రూప్ వాహనంలో తీసుకువెళ్ళే అధికారులు, ఈ రోజు ఎందుకు వాహనం మార్చి ఓ సాధారణ ఖైదిగా జగన్‌మోహన్‌రెడ్డి గారిని తీసుకువెళ్ళవలసి వచ్చింది, ఇందులో ప్రభుత్వ కుట్ర ఉంది. రాజశేఖరరెడ్డి గారు ప్రయాణానికి ముందు ఒక చెడిపోయిన హెలికాప్టర్ పెట్టి కొత్త హెలికాఫ్టర్ ఉండగా అది గంటలో తిరిగివచ్చే అవకాశం ఉన్నా పాత హెలికాఫ్టర్ లో పంపించిన తీరు అనుమానాలను రేకెత్తించిందో అదే విధంగా ఈ రోజు జగన్‌మోహన్‌రెడ్డి గారిని రోజు కారులో తీసుకోచ్చే వారు ఈరోజు సాధరణ వ్యానులో తీసుకురావడం అనుమానాలను కలుగజేస్తుంది. జగన్‌మోహన్‌రెడ్డిగారు అరోపణలు ఎదుర్కోంటున్న వ్యక్తే కాని ఆరోపణలు రుజువుఅయిన వ్యక్తి కాదు.సీబీఐ ఈ రోజు జగన్‌మోహన్‌రెడ్డికి నార్కోటెస్ట్‌కి అనుమతి కోరింది.అసలు కేసు ఏంటి సీబీఐ చేస్తున్న పని ఏంటి. కోర్టు తీర్పులను సీబీఐ పట్టించుకోవడంలేదు. ఒక వేళ నార్కోటెస్ట్ చేయవలసి వస్తే క్యాబినెట్‌కి, ప్రభుత్వానికి లేదా ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డికి చేయాలి. ఈకేసు మోత్తం కుట్రలో మునిగిఉంది కాబట్టి నాన్కోటెస్ట్ జేడి లక్ష్మినారాయణకి చేయాలి అప్పుడు ఈ కేసులో కుట్రలు అన్ని భయటికివస్తాయి. మొన్న ఈనాడు లో వచ్చిన వార్తలను ఈరోజు సీబీఐ కోర్టులో అడుగుతుంది. సీబీఐ కక్ష్య కట్టి ఎన్నికల ముందు జగన్‌మోహన్‌రెడ్డిని అరెస్ట్‌చేసింది.ఈ రోజు చంద్రబాబునాయుడుని యోగ గురువు రాందేవ్‌బాబా కలిసి మద్దతు అడిగాడు. కాని విచిత్రం ఎమిటంటే అన్ని సంస్ధలని మేనేజ్ చేయగలడని. ప్రపంచంలోఅత్యంత అవినీతిచక్రవర్తి అని ప్రపంచంకొడైకూస్తుంటే రాందేవ్‌బాబా గారు చంద్రబాబు మద్దతుకోరుతున్నారు.ఒక పక్క పార్లమెంట్ సీటుకోసం 5 కోట్లు ఇచ్చాను అని సింగపూర్‌లో చంద్రబాబునాయుడి సీ నాయుడు నారా అనే అకౌంట్‌కి డబ్బు పంపాను అని కోలా కృష్టమోహన్ అంటుంటే . చంద్రబాబు మాట్లాడుతూ కోలా కృష్టమోహన్ 420 అంటున్నారు. మేము అడుగుతున్నాం కోలా కృష్టమోహన్ మీ పార్టీలో చేరలేదా........ చంద్రబాబుని తెలుగువాళ్ళు నిజాయితిగల నాయకుడిగా గుర్తించకపోతే పక్క దేశాల బిట్‌క్లింటన్, టోనిబ్లేయర్ మోదలైన నాయకులని పిలిపించి తన నిజాయితిగురించి చెప్పించుకుంటున్నారు.మేము ఒక్కటే రాందేవ్‌బాబాకి అప్పీలు చేస్తున్నాం చంద్రబాబుఅవినీతి గురించి, అతని రాజకీయ హత్యలు తెలుసుకుని మద్దతు కోరమంటున్నాం. కోలా కృష్టమోహన్ చంద్రబాబు కి డబ్బు ఇచ్చానుఅని మీడియా ముందు చెబితే ఆ విషయాన్ని కొన్ని మీడియాలు అసలు పట్టించుకోలేదు . అదే జగన్‌మోహన్‌రెడ్డికి ఇచ్చాను అనిచెబితే కొన్ని మీడియా సంస్దలు నానాయాగిచేసేవి... తర్వాత అయిన కొన్ని మీడియా సంస్ధలు ఆత్మవిమర్శచేసుకోవలసిన రోజు వస్తుంది.