మృతుల కుటుంబాలకు పరామర్శ

ఎమ్మిగనూరు:

షర్మిల పాదయాత్రలో పాల్గొని తిరుగు ప్రయాణంలో రోడ్డు ప్రమాదానికి గురై మరణించిన వారి కుటుంబీకులను శనివారం వైయస్ఆర్ కాంగ్రెస్ నేతలు పరామర్శించారు. బనవాసికి చెందిన చాకలి నాగరాజు, వడ్డె రాముడు శుక్రవారం ఎమ్మిగనూరులో జరిగిన షర్మిల పాదయాత్రలో పాల్గొని తిరుగు ప్రయాణంలో బనవాసి ఫారం వద్ద రోడ్డు ప్రమాదంలో మరణించిన విషయం తెలిసిందే.  పార్టీ జిల్లా కన్వీనర్ గౌరు వెంకటరెడ్డి, ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డి శనివారం స్థానిక వైద్యవిధాన్ పరిషత్ ఆసుపత్రి ఆవరణలో బాధిత కుటుంబీకులను కలిశారు. పార్టీ తరఫున ఆర్థిక సాయం చేస్తామని హామీ ఇచ్చారు. అంత్యక్రియల నిమిత్తం ఎమ్మెల్యే రూ. 5వేల చొప్పున అందజేశారు. వారి వెంట పార్టీ డోన్ ఇంఛార్జ్ బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి, నాయకులు నరవ రమాకాంతరెడ్డి, బీఆర్ బసిరెడ్డి, ధర్మకారి నాగేశ్వరరావు, భీమిరెడ్డి, ప్రతాప్‌రెడ్డి ఉన్నారు.

Back to Top