ఇడుపులపాయలో మహానేతకు అభిషేకం

ఇడుపులపాయ:

కార్తీక పౌర్ణమిని పురస్కరించుకుని వైయస్ఆర్ జిల్లా ఇడుపులపాయలోని దివంగత మహానేత డాక్టర్ వైయస్ఆర్ సమాధికి ఆయన అభిమానులు అభిషేకం చేశారు. వందలాదిమంది వివిధ ప్రాంతాలనుంచి పాదయాత్రగా తరలి వచ్చారు. వైయస్ఆర్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కాపు రామచంద్రారెడ్డి, గురునాథరెడ్డి, తదితరులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. మహిళలు పెద్ద సంఖ్యలో విచ్చేసి అపర భగీరథునికి నివాళులర్పించారు. జగన్ అధికారంలోకి వస్తేనే రాష్ట్రం సుభిక్షంగా ఉంటుందని వారు చెప్పారు. ఆయనను అన్యాయంగా జైలులో ఉంచారని పేర్కొన్నారు.

మరోవంక, శ్రీమతి షర్మిల చేపట్టిన మరో ప్రజాప్రస్థానానికి తరలి వస్తున్న వారి సంఖ్య నానాటికీ పెరుగుతోంది. ఇడుపులపాయనుంచి ఇచ్చాపురం దాకా వందలాది మంది నడిచి వస్తున్నారు. వారిలో వృద్ధులు సైతం ఉన్నారు. యువకుల కోలాహలం సరేసరి. మహిళలు కూడా ఉత్సాహంగా పాల్గొంటున్నారు. పెద్ద వయసులో ఉండీ ఇచ్ఛాపురం వరకూ ఎలా నడుస్తారని ఓ వృద్ధుడిని ప్రశ్నించగా.. నడిస్తేనే జగన్ సీఎం అవుతాడనీ, ఆయన వస్తేనే నీళ్ళు వస్తాయనీ వివరించారు.

Back to Top