అనంతపురంలో నామినేషన్ల స్క్రూటినీలో ఉద్రిక్తత

10వ డివిజన్ టీడీపీ అభ్యర్థి నామినేషన్‌పై వైయ‌స్ఆర్‌సీపీ అభ్యంతరం 

అనంతపురం: మున్సిపల్ కార్పొరేషన్‌లో నామినేషన్ల పరిశీలన సందర్భంగా ఉద్రిక్తత చోటుచేసుకుంది. 10వ డివిజన్ టీడీపీ అభ్యర్థి రెడ్డి ఈశ్వరీ నామినేషన్‌పై  వైయ‌స్ఆర్‌సీపీ నేతలు అభ్యంతరం వ్యక్తం చేశారు. అభ్యర్థి కుటుంబ సభ్యులకు రూ.17 వేల హౌస్ ట్యాక్స్ బకాయి ఉన్నప్పటికీ నామినేషన్‌ను అధికారులు ఆమోదించడంపై వైయ‌స్ఆర్‌సీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. నామినేషన్ల పరిశీలన నిబంధనల ప్రకారం పారదర్శకంగా జరగాలని, అభ్యంతరాలపై అధికారులు స్పష్టత ఇవ్వాలని వైయ‌స్ఆర్‌సీపీ నేతలు కోరారు. 

Back to Top