Ysrcpnettv
YSR Congress Party Twitter YS Jagna Twitter

YSR Congress

Flash News >>>>
             35వ రోజు ప్ర‌జా సంక‌ల్ప యాత్ర ప్రారంభం                               నాటా మహాసభలకు వైయ‌స్‌ జగన్‌కు ఆహ్వానం                               వైయస్‌ జగన్‌ను కలిసిన కీలు గుర్రం కళాకారులు                               ఇమామ్‌లకు నెలకు రూ.10 వేలు ఇస్తాం- వైయస్ జగన్ మోహన్ రెడ్డి                               రాష్ట్ర విభజన జరుగకూడదని చంద్రబాబు ఎప్పుడైనా అన్నారా? - బొత్స సత్యనారాయణ                               చ‌ంద్ర‌బాబు జీవితం అంతా వెన్నుపోటు రాజకీయమే- తమ్మినేని సీతాారాం                               ప్రజా సంకల్ప యాత్ర నుంచి దృష్టి మళ్లించడానికి అధికార పార్టీ కుయుక్తులు- వాసిరెడ్డి పద్మ                               సంక్షేమ హాస్టళ్లను మూసి వేస్తున్నారు-వైయస్ జగన్                               బాబును సీఎం కుర్చీ నుంచి దించితేనే మంచి రోజులు-వైయస్ జగన్                 
    Show Latest News
ప్రాజెక్ట్ లపై శ్వేతపత్రం విడుదల చేయాలి

Published on : 25-Sep-2017 | 17:28
 

హైదారాబాద్ః  పోతిరెడ్డిపాడుపై  వైయస్సార్సీపీ ఎమ్మెల్యే  విశ్వేశ్వర రెడ్డి టీడీపీ వైఖరిని ఎండగడ్డారు.  నీళ్లకోసం కేంద్రంతో, తెలంగాణ రాష్ట్రంతో కోట్లాడే ధైర్యం చంద్రబాబుకు లేదని ఎద్దేవా చేశారు. వైయస్ఆర్ పోతిరెడ్డిపాడు సామర్థ్యాన్ని పెంచేందుకు వేల కోట్లు ఖర్చు పెట్టారు. వైయస్ఆర్ ఆరోజు ఆ పనిచేయకుంటే రాయలసీమకు భవిష్యత్తు ఉండేది కాదన్నారు. బాబు నీవు వచ్చి మూడున్నరేళ్లయ్యింది. పోతిరెడ్డిపాడు ద్వారా అదనంగా నీళ్లు తెచ్చేందుకు మీరు ప్రయత్నించారా...దానికి ఎంత ఖర్చు చేశారో చెప్పే ధైర్యముందా అని నిప్పులు చెరిగారు. హైదరాబాద్ లో పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో విశ్వేశ్వర్ రెడ్డి మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన ఏమన్నారంటే.....

 • రాయలసీమ ప్రాజెక్టులపై మాట్లాడే అర్హత టీడీపీకి లేదు
 • చంద్రబాబు మొదటిసారి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏం చేశారు?
 • బాబు హయాంలోనే కర్నాటక నీటి ప్రాజెక్టులు పూర్తి చేసింది. 
 • పొరుగు రాష్ట్రం ప్రాజెక్టులు కడుతున్నా బాబు చోద్యం చూశారు
 • దీనివల్ల క్రిష్ణాపై నీటిహక్కులు కోల్పోవటానికి చంద్రబాబే కారకుడు
 • కర్నాటక ప్రాజెక్టులను అడ్డుకోకపోగా పోతిరెడ్డిపాడు ప్రాజెక్టు సామర్థ్యాన్ని కుదించటానికి చంద్రబాబు ప్రయత్నించారు.
 • పైగా ఇప్పుడు చంద్రబాబు గొప్పులు చెప్పుకోవటం హాస్యాస్పదం
 • హంద్రీనీవాకు చంద్రబాబు చేసింది ఏమీ లేదు
 • చంద్రబాబు హయాంలో కనీసం 300 ఎకరాలకు అయినా నీరు ఇచ్చారా?
 • 40 టీఎంసీల నుంచి 15 టీఎంసీలకు కుదించటానికి ప్రయత్నించారు.
 • ఇప్పుడు కూడా 5 టీఎంసీలుగా హంద్రీనీవా ప్రాజెక్టు మార్చాలని ప్రయత్నిస్తున్నారు
 • రాయలసీమపై చంద్రబాబు కపట ప్రేమను చూపిస్తున్నారు
 • పోలవరంపైనా అసత్యాలు ప్రచారం చేస్తున్నారు
 • చంద్రబాబు వల్లే పోలవరం అంచనాలు ఏటేటా పెరుగుతున్నాయి
 • పట్టిసీమ ద్వారా డెల్టాకు నీళ్లు ఇచ్చామంటున్నారు
 • ధవళేశ్వరం వద్ద సముద్రంలో ఎన్ని నీళ్లు కలిసాయో చెప్పాలి
 • చంద్రబాబు మాటలు నమ్మటానికి ఎవ్వరూ సిద్ధంగా లేరు
 • వైయస్ అధికారంలోకి వచ్చాక పోతిరెడ్డిపాడు కెపాసిటీని పెంచారు. దీనికోసం జీఓలు విడుదల చేశారు. 
 • హంద్రీదశ రెండోదశలో 2012 నాటికే జీడిపల్లి రిజర్వాయర్ కు నీళ్లు ఇచ్చారు. 
 • వైయస్ హయాంలోనే 80% డిస్ట్రిబ్యూటరీలు, పిల్లకాల్వల వ్యవస్థ పూర్తైంది.
 • వైయస్ హయాంలో హంద్రీనీవా కోసం ఆరున్నర వేల కోట్లు ఖర్చు చేశారు. 
 • జలయజ్ఞంలో 75 శాతం పనులు పూర్తయ్యాయి. రాయలసీమలో దాదాపుగా పనులు పూర్తి అయ్యాయి
 • కోస్తాలో జలయజ్ఞంలో భాగంగా 45వేల కోట్ల పనులయ్యాయి
 • ప్రచారం కోసం నీటిని విడుదల చేస్తున్నామంటూ టీడీపీ హడావుడి  చేస్తున్నారు.
 • సాగునీటి ప్రాజెక్ట్ లపై శ్వేతపత్రం విడుదల చేయాలి

సంబంధిత వార్తలు

Home  |  News  |  Downloads  |  Gallery  |  Contact Us  |   Sitemap  

Official Website of YSR Congress Party
Copyright © 2011 ysrcongress.com