కూట‌మి నేత‌లు విడుద‌ల చేసిన ఛార్జ్‌షిట్ అబ‌ద్దాల పుట్ట‌

వైయ‌స్ఆర్‌సీపీ నేత‌, మాజీ మంత్రి రావెల కిషోర్‌బాబు

తాడేపల్లి :   సీఎం వైయ‌స్ జ‌గ‌న్ పాల‌న‌పై తెలుగుదేశం, బిజేపి, జనసేన కూటమి నేత‌లు విడుదల చేసిన ఛార్జ్ షీట్ అబద్దాల పుట్ట అని వైయ‌స్ఆర్‌సీపీ నేత‌, మాజీ మంత్రి రావెల కిషోర్‌బాబు అన్నారు. సీఎం వైయ‌స్‌ జగన్ ఎన్నికలలో తిరిగి గెలవబోతున్నారనే వాస్తవాన్ని జీర్ణించుకోలేక ప్రజలలో అయోమయం సృష్టించేందుకు కూటమి నేతలు ప్రయత్నిస్తున్నార‌ని మండిప‌డ్డారు. శుక్ర‌వారం పార్టీ కేంద్ర కార్యాల‌యంలో ఆయ‌న మీడియాతో మాట్లాడారు.

- రక్తచరిత్ర అంటూ కవర్ పేజి మేకప్ వేశారు.కాని అసలైన రక్తచరిత్ర కారంచేడు,నీరుకొండలలో తెలుగుదేశం పార్టీ చేసిందే.

- ఆ మారణకాండను దళితులు ఎవ్వరూ మరిచిపోలేదు. విజయవాడలో వంగవీటి రంగాను ఘోరంగా హత్య చేయించింది సైతం ప్రజలు మరిచిపోలేరు.

- ఆధారాలు లేని ఆరోపణలు టీడీపీ చేస్తుంది.ప్రజల మభ్యపెట్టాలని చూస్తున్నారు.

- అంబేద్కర్ ఆశయాలు అమలు అయ్యేలా జగన్ పాలన 58నెలలు పాటు జరిగింది.ఎస్సి,ఎస్టి,బిసి,మైనారిటీలు,అగ్రవర్ణాలలోని పేదలందరూ అభివృధ్దిపధంలోకి పయనిస్తున్నారు.

- అధికారంలోకి రావడానికి చంద్రబాబు అన్ని తప్పులు చేస్తున్నారు.

- Sc st సబ్ ప్లాన్ నిధులు కోసం ఆంధ్రప్రదేశ్ చట్టం చేసింది కాబట్టి దాని నిధులు పక్కకు వెళ్లే అవకాశం లేదు.

- చంద్రబాబుకి ఒక రూపాయి దళితుల కోసం ఖర్చు చేయాలంటే మనసు రాదు

- నేను మంత్రిగా టీడీపీలో ఉన్నప్పుడు సబ్ ప్లాన్ నిధులు విషయంలో విభేదించి  నన్ను మంత్రి పదవి నుండి తీసేసారు.

- వైయస్ జగన్ దళిత వాది.మేనిఫెస్టోను ఒక బైబిల్,ఖురాన్,భగవధ్గీతగా భావించి అన్ని హామీలు అమలు చేసారు.మేని ఫెస్టోలో చెప్పని అంశాలు కూడా చాలా అమలు చేశారు.

- అధికారంలోకి రాకముందే రెడ్ బుక్ అని లోకేష్ అధికారులను బెదిరిస్తున్నాడు.అది అరాచకం.లోకేష్ అధికారంలోకి రావడం కల్ల.

- జగన్ ని చంపి సమాధులు చేయండని చంద్రబాబు ప్రజలను రెచ్చగొడుతున్నాడు.

- డిబిటి,నాన్ డిబిటి ద్వారా ప్రజలకు 5లక్షల కోట్లు వెచ్చిస్తే అందులో 2 లక్షల కోట్లకు పైగా దళితుల కోసం జగన్ కేటాయించారు.

- ఇంగ్లీష్ మీడియం వలన దళిత పిల్లలు చదువులో  ముందుకు పోతున్నారు.ఇది జగన్ గారి దూరదృష్టికి నిదర్శనం

- ధనికుల,తమ వర్గం వారి కోసమే చంద్రబాబు తపన..

- గత ప్రభుత్వం విదేశీ విద్యపేరుతో కుంభకోణంకు పాల్పడితే నేడు జగన్ గారు విదేశి విద్య కోసం కోటి 25 లక్షలు రూపాయలు  ఇస్తున్నారు.అది కూడా ప్రపంచంలో టాప్ 200 యూనివర్శిటీలలో చదువుకునే అవకాశం కల్పించారు 

Back to Top