Ysrcpnettv
YSR Congress Party Twitter YS Jagna Twitter

YSR Congress

Flash News >>>>
             ఆంధ్రప్రదేశ్‌కి ప్రత్యేక హోదా కల్పించాలని కోరుతూ పార్లమెంట్ వద్ద వైయ‌స్ఆర్‌ సీపీ ఎంపీలు ధర్నా                               క్రిష్ణాపురం నుంచి వైయ‌స్ జ‌గ‌న్ 320వ రోజు ప్రజాసంకల్పయాత్ర ప్రారంభం                               ప్రజలకు ఎన్ని అబద్దాల చెప్పినా వింటారనే నాయకులకు తెలంగాణ ప్రజలు గట్టిగా బుద్ది చెప్పారు : వైయ‌స్ జ‌గ‌న్‌                               లగడపాటి రాజకీయ విశ్లేషకుడు ఎప్పుడు అయ్యాడా? అని ఆశ్చర్యం వేసింది: వైయ‌స్ జ‌గ‌న్‌                               కాంగ్రెస్‌, టీడీపీ జిమ్మిక్కులను ప్రజలను తిప్పికొట్టారు: వైయ‌స్ జ‌గ‌న్‌                               చంద్రబాబు, కాంగ్రెస్ అనైతిక పొత్తుకు ప్రజలు వ్యతిరేకంగా తీర్పు ఇచ్చారు: వైయ‌స్ జ‌గ‌న్                                భస్మాసురుడు చేయి పెట్టినా.. చంద్రబాబు కాలు పెట్టినా అంతా బుడిదే: వైయ‌స్ జ‌గ‌న్‌                               హిందూపురం టీడీపీ మాజీ ఎమ్మెల్యే అబ్దుల్‌ గని వైయ‌స్ఆర్‌సీపీలో చేరిక‌                               ప‌వ‌న్‌కు చిత్త‌శుద్ది ఉంటే చంద్ర‌బాబు అవినీతిపై నిల‌దీయాలి: ఎమ్మెల్యే ఆదిమూల‌పు సురేష్‌                 
    Show Latest News
రాహుల్‌... చంద్రబాబును ప్రశ్నించలేదే..?

Published on : 19-Sep-2018 | 16:14
 

– రాజకీయ లబ్ధి కోసం రాష్ట్ర ప్రయోజనాలు వదిలేస్తారా
– చంద్రబాబు అవినీతిపై ఎందుకు నోరు మెదపలేదు
– మీ పార్టీ వాళ్లు తయారు చేసిన సీడీ చూడలేదా..?
– పార్లమెంట్‌లో ఎన్నిసార్లు ప్రత్యేక హోదాపై పోరాడారు


రాహుల్‌ గాంధీ ఆంధ్రప్రదేశ్‌కు వచ్చాడు. కర్నూల్‌లో బహిరంగ సభ పెట్టాడు. ఢిల్లీ వెళ్లాడు. ఏపీ కాం్రVð స్‌ పార్టీ నాయకుల కోరిక మేరకు ఆంధ్రాలో అడుగుపెట్టిన రాహుల్‌ గాం«ధీ అరవీర గంభీరంగా కొన్ని హామీలు గుప్పించేశాడు. చాలా కాలం తర్వాత ఆంధ్రాలో అగుడుపెట్టిన రాహుల్‌గాంధీ.. స్థానిక రాజకీయాల కంటే దేశ రాజకీయాలే మాట్లాడి జనానికి చిరాకెత్తించేశాడు. ఎంతసేపటికీ నరేంద్ర మోడీ రాఫెల్‌ కుంభకోణం, గబ్బర్‌ సింగ్‌ ట్యాక్సు, నోట్ల రద్దు కుంభకోణం గురించి ప్రస్తావించాడే తప్ప.. చంద్రబాబు నాలుగేళ్ల పాలనపై ఒక్క విమర్శా చేయకపోవడం టీడీపీ, కాంగ్రెస్‌ మైత్రికి నిదర్శనం. రాష్ట్రాన్ని విభజించిన పాపం కాంగ్రెస్‌దైతే... ప్రత్యేక హోదా కోసం కేంద్రాన్ని నిలదీయకుండా యూటర్న్‌లు తీసుకుంటూ ప్రజలను వంచించాడు. విభజన హామీలు నెరవేర్చకపోయినా మాట్లాడలేదు. ఎన్నికలకు ముందు చెప్పిన నిరుద్యోగ భృతి ఏమైంది, రైతు రుణమాఫీ చేశాడా.., డ్వాక్రా మహిళలు లక్షాధికారులయ్యారా.. పేదలకు ఆరోగ్యశ్రీలో కార్పొరేట్‌ వైద్యం అందుతుందా.., విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్‌ జరిగిందా.., కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్య అందుతోందా.. మహిళలు నిర్భయంగా తిరగ గలుగుతున్నారా.. రిషితేశ్వరి తల్లిదండ్రులకు న్యాయం జరిగిందా.. వనజాక్షిని అధికార పార్టీ ఎమ్మెల్యే ఇసుకలో పడేసి కొట్టినప్పుడు సదరు ఎమ్మెల్యేపై ముఖ్యమంత్రి చర్యలు తీసుకున్నాడా.. రాజధాని నిర్మాణం పూర్తయిందా.., హైకోర్టు విభజన జరిగిందా.. న్యాయవాది నారిమన్‌కు గంటకు రూ.33 లక్షలు ప్రభుత్వ సొమ్ము చెల్లించడం సబబేనా.., నోట్ల రద్దు గురించి మోడీని ప్రశ్నించే ముందు.. దానికి నేనే లెటర్‌ ఇచ్చానని చెప్పిన చంద్రబాబు మంచోడెలా అయ్యాడు. విభజన కోసం నేనే లెటర్‌ ఇచ్చానని తెలంగాణలో చెప్పుకున్న చంద్రబాబు.. రాష్ట్ర విభజనకు కారకుడు కాదా.. ఇది రాహుల్‌ గాంధీకి తెలియదా.. లోకల్‌ కాంగ్రెస్‌ పార్టీ నాయకులు చెప్పలేదా. 

హామీలు సరే.. ఎలా గెలుస్తావ్‌ రాహుల్‌
అధికారంలోకి రాగానే మొదటి సంతకం ప్రత్యేక హోదాపై పెడతానని చెప్పే రాహుల్‌ గాంధీ.. అసలు కాంగ్రెస్‌ పార్టీ ఆంధ్రప్రదేశ్‌లో గెలుస్తుందా అనేది తెలుసుకోవాలి. కనీసం ఆ పార్టీకి 175 స్థానాల్లో పోటీ చేయడానికి అభ్యర్థులున్నారా అనేది ఏనాడైనా ఆలోచించారా. కాంగ్రెస్‌ పార్టీ నాయకులు టీడీపీలో చేరుతుంటే ఎందుకు ఆపలేకపోతున్నారు. రుణమాఫీ, ప్రత్యేక హోదా హామీలతో తమ పార్టీ నాయకులను జనాల్లోకి ఎందుకు పంపలేకపోతున్నారు. అవన్నీ పక్కన పెడితే.. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని రాహుల్‌ గాంధీ ఎన్నిసార్లు పార్లమెంట్‌లో మాట్లాడారు. నిజంగా ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలనుకుంటే కాంగ్రెస్‌కు కష్టమా. రాష్ట్రాన్ని విభజించడానికి బీజేపీతో రోజుల తరబడి మంతనాలు చేసి అన్ని పార్టీలను ఒక్కతాటిపైకి తెచ్చిన పార్టీకి ఏపీ గురించి ఆలోచించే టైమ్‌ లేదా. కేవలం తెలంగాణలో, ఆంధ్రాలో ఎన్నికల్లో లబ్ధికోసమే కాంగ్రెస్‌ టీడీపీలు ఒక్కటయ్యాయనేది అందరికీ తెలిసిన నిజం. గడిచిన 30 సంవత్సరాలుగా కత్తులు దూకున్న ఆ రెండు పార్టీలకు నైతికత లేదన్నది ఇక్కడే తెలిసిపోతుంది. వారికి రాష్ట్ర ప్రయోజనాల కన్నా.. పార్టీ ప్రయోజనాలే ముఖ్యమనేది స్పష్టం. 

 

సంబంధిత వార్తలు

Home  |  News  |  Downloads  |  Gallery  |  Contact Us  |   Sitemap  

Official Website of YSR Congress Party
Copyright © 2011 ysrcongress.com