పేదవాడి భవిష్యత్‌ కోసం రెండు బటన్లు ఫ్యాన్‌ గుర్తుకే నొక్కాలి

న‌ర‌సాపురం ఎన్నిక‌ల ప్ర‌చారంలో  సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌

పథకాల కొనసాగింపును నిర్ణయించబోయే ఎన్నికలు. 

చంద్రబాబుకు ఓటేస్తే పథకాల ముగింపే. 

చంద్రబాబుకు ఓటేస్తే చంద్రముఖిని తలుపు తట్టి లేపడమే. 

14 ఏళ్లు సీఎంగా ఉండి చంద్రబాబు ఒక్క మంచి పని అయినా చేశారా?. 

టీడీపీ పాలనలో ఏనాడైనా ఇలాంటి పథకాలు అమలు చేశాడా?. 

చంద్రబాబును నమ్మడమంటే కొండ చిలువ నోట్లు తలపెట్టినట్టే.

మీ బిడ్డ పాలనలో అవ్వాతాతలకు ఇంటికే రూ.3వేల పెన్షన్‌. 

బాబు పాలనలో ఇంటికే పెన్షన్‌ వచ్చే పరిస్థితి ఏనాడైనా కనబడిందా?.

ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్‌ మీడియం, బైజూస్‌ కంటెంట్‌. 

ఇంగ్లీష్‌ మీడియంతో అడుగులు సీబీఎస్‌సీ నుంచి ఐబీ వరకు కనపడుతుంది. 

రాష్ట్రంలో ఉన్న 93 శాతం పిల్లలకు పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంట్‌. 

ప్రభుత్వ కాలేజీల్లో అంతర్జాతీయ విద్యా కోర్సులు తెచ్చాం.

 మీ బిడ్డ జగన్‌.. అక్కాచెల్లెమ్మలకు తోడుగా నిలబడ్డాడు. 

ఆసరా, సున్నావడ్డీ, చేయూతతో అక్కాచెల్లెమ్మలను ఆదుకున్నాం. 

31లక్షల ఇళ్లపట్టాలు అక్కాచెల్లెమ్మలకు ఇచ్చాం. 
 
రైతులకు పగటిపూటే తొమ్మిది గంటల ఉచిత విద్యుత్‌ ఇస్తున్నాం. 

విత్తనం నుంచి పంట కొనుగోలు వరకు రైతన్నకు తోడుగా నిలిచాం. 

ప్రతీ రంగంలోనూ విప్లవం తీసుకువచ్చాం.

 పేదవాడి వైద్యం కోసం రూ.25లక్షల వరకు ఆరోగ్యశ్రీని విస్తరించాం. 

జగనన్న తోడు, జగనన్న చేదోడు ద్వారా చిరు వ్యాపారులకు సాయం అందించాం. 

గ్రామ సచివాలయాల ద్వారా గ్రామ స్వరాజ్యం తెచ్చాం. 

రూ.2లక్షల 70వేల కోట్లు నేరుగా పేదల ఖాతాల్లో వేశాం. 

రెండు లక్షల 31వేల ఉద్యోగాలిచ్చాం. 
 
చంద్రబాబు పేరు చెబితే ఒక్క పథకమైనా గుర్తుకొస్తుందా?. 

175కు 175 అసెంబ్లీ, 25కు 25 ఎంపీ సీట్లు గెలవాల్సిందే:  సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌

న‌ర‌సాపురం: పేదవాడి భవిష్యత్‌ కోసం ఈ ఎన్నిక‌ల్లో రెండు బటన్లు ఫ్యాన్‌ గుర్తుకే నొక్కాల‌ని వైయ‌స్ఆర్‌సీపీ అధినేత‌, సీఎం వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి విజ్ఞ‌ప్తి చేశారు.  చంద్రబాబు 14 ఏళ్లు సీఎంగా ఉండి ఒక్క మంచి పనైనా చేశారా అని ప్రశ్నించారు  చంద్రబాబు పేరు చెబితే ఒక్క మంచి పథకమైనా గుర్తుకు వస్తుందా?. రాష్ట్రంలో జరుగుతున్నది కులాల మధ్య యుద్ధం కాదు.. క్లాస్‌ వార్‌ అని అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా సీఎం వైయ‌స్ జగన్‌ నరసాపురంలో రోడ్‌ షో పాల్గొన్నారు. 

ఈ సందర్బంగా వైయస్.జగన్ ఏమన్నారంటే...

నరసాపురం సిద్ధమా?  
సమయం 12.15 మిట్టమధ్యాహ్నం 
ఇంతటి ఎండలో కూడ ఏమాత్రం కూడా ఎండను ఖాతరు చేయకుండా చిక్కటి చిరునవ్వుల మధ్య ఇంతటి ప్రేమానురాగాలు, ఇంతటి ఆప్యాయతలు, ఆత్మీయతలు పంచిపెడుతున్న నా ప్రతి అక్కకూ, ప్రతి చెల్లెమ్మకూ, ప్రతి అవ్వకూ, ప్రతి తాతకూ, ప్రతి సోదరుడికీ, ప్రతీ స్నేహితుడికీ.. మీ అందరి ఆప్యాయతలకు మీ బిడ్డ, బి జగన్ రెండు చేతులు జోడించి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాడు.

ఈ ఎన్నికలు 5 ఏళ్ల భవిష్యత్తును నిర్ణయించే ఎన్నికలు.
మరో పది రోజుల్లో కురుక్షేత్ర యుద్ధం జరగబోతుంది. జరగబోయే ఈ ఎన్నికలు కేవలం ఎంపీలను, ఎమ్మెల్యేలను ఎన్నుకునేందుకు జరగబోయే ఎన్నికలు కానేకావు. ఈ ఎన్నికలు రాబోయే 5 ఏళ్ల మీ ఇంటింటి భవిష్యత్తును, పథకాల కొనసాగింపును నిర్ణయించబోయే ఎన్నికలని ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోమ్మని మిమ్మల్ని అందరినీ కోరుతున్నాను. ఈ ఎన్నికల్లో జగన్ కు ఓటు వేస్తే పథకాలన్నీ కొనసాగింపు. అదే పొరపాటున చంద్రబాబుకు ఓటేస్తే.. పథకాలన్నింటికీ ముగింపు. మళ్లీ మోసపోవడం.

బాబును నమ్మడం అంటే కొండ చిలువ నోట్లో తలపెట్టడమే.
ప్రతి ఒక్కరూ జ్ఞాపకం చేసుకోవాలని అడుగుతున్నాను. పొరపాటున చంద్రబాబుకు ఓటేస్తే.. మరోసారి మోసం చేసేందుకు సాధ్యం కాని హామీలను ఇస్తున్న చంద్రబాబును నమ్మడం అంటే దానర్ధం కొండచిలువ నోట్లో తలపెట్టడమే.
 
పొరపాటున చంద్రబాబుకు ఓటేస్తే... మళ్లీ చంద్రముఖి తలుపుతట్టి లకలకా అంటూ మళ్లీ 5 ఏళ్లు మీ ఇంటికి మీ రక్తం తాగేందుకు వస్తుంది. ఇవాళ మీ అందరినీ కోరుతున్నాను.. రాష్ట్రానికి 3 సార్లు, 14 సంవత్సరాలు పాటు ముఖ్యమంత్రిగా చేశానని ఈ పెద్దమనిషి చంద్రబాబు అంటాడు. ఈ సందర్భంగా నేను అడుగుతున్నాను... ఈ పెద్దమనిషి చంద్రబాబు పేరు చెబితే..ఈ రాష్ట్రంలో ఉన్న ఏ పేదకైనా తాను చేసిన కనీసం ఒక్కటంటే ఒక్కటైనా మంచి గుర్తుకు వస్తుందా?.
14 ఏళ్లు ముఖ్యమంత్రి అంటాడు, 3 సార్లు సీఎం అంటాడు.. ఆయన పేరు చెబితే తాను పేదలకు చేసిన కనీసం ఒక్కటంటే ఒక్క స్కీం అయినా గుర్తుకు వస్తుందా? 
మరోవంక మీ బిడ్డ.. మీ జగన్ స్కీంలను చూస్తే... మీ వైయస్సార్సీపీ స్కీంలను చూస్తే.. చంద్రబాబు 14 ఏళ్ల పాలనలో ఏనాడైనా ఇలాంటి స్కీంలు ఇచ్చాడా?  అన్నది ప్రతి ఒక్కరూ ఆలోచన చేయండి.
గతంలో ఎప్పుడూ జరగనట్టుగా, గతంలో ఎప్పుడూ చూడనట్టుగా ఈ 59 నెలల కాలంలోనే అవ్వాతాతలకు అంటికే రూ.3వేలు పెన్షన్ గతంలో ఎప్పుడైనా కూడా ఈ మాదిరిగా అవ్వాతాతలకు ఇంటికే రూ.3వేలు వచ్చిన పరిస్థితి ఏరోజైనా జరిగిందా?

ప్రభుత్వ బడుల్లో విద్యా విప్లవం.
గతంలో ఎప్పుడూ జరగని విధంగా పిల్లలకు ఈరోజు గవర్నమెంటు బడిలో నాడు-నేడు, బడి తెరిచేసమయానికే పిల్లలకు విద్యాకానుక, గవర్నమెంటు బడిలో ఇంగ్లిషు మీడియం, గవర్నమెంటు బడిలో బైజూస్ కంటెంట్, మూడోతరగతి నుంచే పిల్లలకు టోఫెల్ క్లాసులు, సబ్జెక్టు టీచర్లు అందుబాటులో ఉన్నారు. మొట్టమొదటిసారిగా ఈ రోజు ఇంగ్లిషు మీడియంతో వేసిన అడుగులు సీబీఎస్ఈ నుంచి ఐబీ దాకా ప్రయాణం జరుగుతోంది. 8వ తరగతికి వచ్చేసరికి గవర్నమెంటుబడిలో పిల్లల చేతులో ట్యాబులు కనిపిస్తున్నాయి. మొట్టమొదటిసారిగా ఇవాళ గవర్నమెంటు బడులలో 6వ తరగతి నుంచే క్లాస్ రూమ్ లలో డిజిటల్ బోర్డులు, వాటి ద్వారా డిజిటల్ బోధన మన పేదపిల్లలకు అందుబాటులోకి వచ్చింది. మొట్టమొదటిసారిగా ప్రభుత్వ బడులలో చదువుతున్న పిల్లలకు బైలింగువల్ టెక్ట్స్ బుక్స్ అంటే ఒక పేజీ తెలుగు, ఒక పేజీ ఇంగ్లిషు ఇస్తున్న పరిస్థితిలు కనిపిస్తున్నాయి. 

మరింత ఉన్నతంగా ఉన్నత విద్య.
పెద్ద చదువులు చదువుతున్న పిల్లలు ఇంజనీర్లు, డాక్టర్లు, డిగ్రీలు చదువుతున్న రాష్ట్రంలో ఉన్న 93 శాతం పిల్లలకు పూర్తి ఫీజులు కడుతూ ఆ పిల్లలకు, తల్లిదండ్రులకు అండగా ఉంటూ ఏకంగా జగనన్న విద్యాదీవెన, వసతి కూడా ఈ 59 నెలల కాలంలోనే వచ్చింది అవునా కాదా?.
మొట్టమొదటి సారిగా పెద్ద చదువులు చదువుతున్న పిల్లలకు మన కరిక్యులమ్ లోనే, మన కోర్సులకి అంతర్జాతీయ విశ్వవిద్యాలయా కోర్సులు, మన కరిక్యులమ్ లోకి ఆన్ లైన్ సర్టిఫికేషన్ తో మొదలు.. ఈ మార్పులతో ఒక విప్లవాన్ని సృష్టిస్తున్న కార్యక్రమం కూడా ఈ 59 నెలల కాలంలో కాదా అని మీ అందరినీ అడుగుతున్నాను. ఆలోచన చేయండి.
గదతంలో ఎప్పుడూ జరగనివిధంగా, ఎప్పుడూ చూడని విధంగా ఈ రోజు బడులకు తల్లులకు వాళ్ల పిల్లలను పంపిస్తే చాలు.. వారిని ప్రోత్సహిస్తూ తల్లుల చేతులకు అమ్మఒ    డి ఇస్తున్నాం. మొట్టమొదటి సారిగా అక్కచెల్లెమ్మలకు అండగా వాళ్ల కాళ్లు మీద వాళ్లు నిలబడేట్టుగా వారికి అండగా చేయూత, కాపునేస్తం, ఈబీసీ నేస్తం, వైయస్సార్ సున్నావడ్డీ, ఆసరా, ఆ అక్కచెల్లెమ్మల పేరిట ఏకంగా 31 లక్షల ఇళ్ల పట్టాలు వారి పేరిటే రిజిస్ట్రేషన్ చేసే కార్యక్రమం చేసాం. అందులో కడుతున్న 22 లక్షల ఇళ్లు. మొట్టమొదటిసారిగా అక్కచెల్లెమలకు తోడుగా ఉంటూ.. మహిళా సాధికారతకు అద్దం పడుతూ, వారి రక్షణ కోసం గ్రామాల్లోనే మహిలా పోలీసు. వారి ఫోన్ లోనే దిశ యాప్, అక్కచెల్లెమ్మలకు ఊతమిస్తూ ఏకంగా 50 శాతం రిజర్వేషన్లు వారికి దక్కేటట్టుగా ఏకంగా చట్టం చేసిన మహిళా సాధికారత ఎక్కడ జరిగింది ?  ఎప్పుడు జరిగింది ?  అంటే ఈ 59 నెలల పాలన కాలంలో మీ బిడ్డ పాలనలోనే కాదా అని మీ అందరి సమక్షంలో అడుగుతున్నాను.

నేను చెప్పే ప్రతి అంశం ఆలోచన చేయండి. 
నేను చెప్పే ప్రతి అంశం గతంలో ఎప్పుడూ జరగలేదు. కేవలం ఈ 59 నెలల్లో జరిగిన అంశాలను, గతంలో ఎప్పుడూ చూడని పాలనను మీ కళ్లెదుటే చేసి, చూపించి ఇవాళ అడుగుతున్నాను. మొట్టమొదటిసారిగా గతంలో ఎప్పుడూ జరగని విధంగా రైతన్నలకు పెట్టుబడి సహాయంగా రైతన్నను చేయిపట్టుకుని నడిపిస్తూ.. రైతుభరోసా, మొట్టమొదటిసారిగా రైతులకు ఇ-క్రాప్, ఉచిత పంటలబీమా, మొట్టమొదటిసారిగా రైతన్నలకు పగటిపూటే తొమ్మది గంటలపాటు నాణ్యమైన ఉచిత విద్యుత్, మొట్టమొదటసారిగా పంటనష్టం జరిగితే సీజన్ ముగిసేలోగానే అంచనా వేసి.. ఇన్ పుట్ సబ్సిడీ ఇస్తున్న పరిస్థితులు.. మీ బిడ్డ ప్రభుత్వంలోనే ఈ 59 నెలల్లోనే జరిగాయి. 

రైతన్నను చేయిపట్టుకుని నడిపిస్తూ..
రైతన్నను చేయిపట్టుకుని నడిపిస్తూ గ్రామంలోనే ఆర్బీకే వ్యవస్ధను తీసుకొచ్చి విత్తనం నుంచి పంటకొనుగోలు దాకా రైతన్నకు ప్రతి అడుగులోనూ తోడుగా, అండగా మీ బిడ్డ ప్రభుత్వమే నిల్చింది. 

గతంలో ఎప్పుడూ జరగని విధంగా, ఏ పేదవాడు కూడా తన వైద్యం కోసం అప్పులు పాలయ్యే పరిస్థితి రాకూడదని ఆ పేదవాడికి అండగా ఉంటూ.. ఏకంగా ఉచితంగా రూ.25 లక్షల వరకు విస్తరించిన ఆరోగ్యశ్రీ, ఆ పేదవాడికి ఆపరేషన్ అయిన తర్వాత రెస్ట్ తీసుకునే సమయంలో ఓ ఆరోగ్య ఆసరా.. పేదవాడికి  ఇంటికే వెళ్లి టెస్టులు చేస్తూ.. మందులిస్తూ పేదవాడి ఇంటికే ఆరోగ్యసురక్ష, పేదవాడి గ్రామంలోనే ఫ్యామిలీ డాక్టర్, ఆ పేదవాడి గ్రామంలోనే విలేజ్ క్లినిక్ ఇవన్నీ ఈ 59 నెలల మీ బిడ్డ పాలనలోనే జరిగింది. నేను చెప్తున్న ఇవన్నీ గతంలో ఎప్పుడైనా చూశారా? గతంలో ఎప్పుడైనా జరిగాయా ?

స్వయం ఉపాధికి అండగా నిలుస్తూ... 
స్వయం ఉపాధికి ఎప్పుడూ జరగని విధంగా అండగా నిలబడుతూ... రైతన్నకు రైతు భరోసా, అక్కచెల్లెమ్మలకు వారి కాళ్లమీద వాళ్లు నిలబడేలా ఓ కాపునేస్తం, ఈబీసీ నేస్తం, ఓ చేయూత,  ఆసరా, సున్నావడ్డీ, లాయర్లకు లా నేస్తం, మత్స్యకార్లకు మత్స్యకార భరోసా, నేతన్నలకు నేతన్న నేస్తం, సొంతంగా ఆటో, టాక్సీ నడుపుకుంటున్న వాళ్లకు వాహనమిత్ర, రోడ్డు పక్కనే చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటున్నవాళ్లు, తోపుడు బళ్ల మీద వ్యాపారాలు చేసుకుంటున్న వాళ్లు, టిఫిన్ సెంటర్లు నడుపుకుంటున్నవాళ్లందరికీ కూడా జగనన్న తోడు, జగనన్న చేదోడు, ఎంఎస్ఎంఈలకు గతంలో ఎప్పుడూ ఇవ్వనంతగా ప్రోత్సాహం ఇస్తున్న రోజులు కూడా ఈ 59 నెలల పాలనలోనే, మీ బిడ్డ కాలంలో కాదా ?

గ్రామ స్వరాజ్యానికి అర్దం చెబుతూ..
మొట్టమొదటసారిగా గ్రామస్వరాజ్యానికి అర్ధం చెబుతూ.. గ్రామ, వార్డు సచివాలయాల్లో ఏకంగా 600 రకాల సేవలు మీ ఇంటివద్దకే వస్తున్నాయి. ప్రతి 60-70 ఇళ్లకు ఏ వాలంటీర్ వ్యవస్ధ. లంచాలు  లేకుండా, వివక్ష లేకుండా ఇంటికే వచ్చే పెన్షన్, పౌర సేవలు, పథకాలు ఇవన్నీ జరిగింది కూడా ఈ 59 నెలల కాలంలోనే.

మొట్టమొదటిసారిగా ఎప్పుడూ జరగని విధంగా... 
ఎవరైనా మీ బిడ్డ ముఖ్యమంత్రి కాకముందు మీ దగ్గరకు వచ్చి లంచాలు లేకుండా, వివక్ష లేకుండా, ఎవరి చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా, గవర్నమెంటు ఇచ్చే డబ్బు నేరుగా మీ చేతికే, మీ ఇంటికే, మీ ఖాతాలకే వస్తుందని ఎవరైనా చెబితే మీలో ఎవరైనా నమ్మి ఉండేవారా? ఈ రోజు మొట్టమొదటిసారిగా గతంలోఎప్పుడూ చూడని విధంగా మీ బిడ్డ బటన్ నొక్కుతున్నాడు. నేరుగా నా అక్కచెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి ఏకంగా రూ.2.70 లక్షల కోట్లు జమ చేశాం.  వివిధ పథకాల ద్వారా 130 సార్లు మీ బిడ్డ బటన్లు నొక్కి నా అక్కచెల్లెమ్మల ముఖాల్లో సంతోషం చూసేందుకు, వారి కుటుంబాలకు మంచి చేసేందుకు ఏకంగా రూ.2.70 లక్షల కోట్లు ఎక్కడా లంచాలు, వివక్ష లేకుండా, ఎవరి చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా మీ బిడ్డ బటన్ నొక్కి అక్కచెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి నేరుగా జమ అవుతోంది. ఆలోచన చేయండి. 14 ఏళ్లు, 3 సార్లు ముఖ్యమంత్రిగా పరిపాలన చేశానని చంద్రబాబు అంటాడు.

 మిమ్నల్ని అడిగుతున్నాను. మీ బిడ్డ మీ సమక్షంలో ఇవన్నీ చెప్పాడు. ఇందులో నేను చెప్పినవాటిలో చంద్రబాబు హయాంలో.. ఆయన పేరు చెబితే ఏ పేదవాడికైనా గుర్తుకువచ్చే ఒక స్కీం కానీ, ఆయన చేసిన ఒక మంచి కానీ ఒక్కటంటే ఒక్కటి ఉందా? అని అడుగుతున్నాను.

చంద్రబాబు మోసాలు ఏ స్ధాయిలో ఉన్నాయంటే...
మరి 14 ఏళ్లు ఏ పేదవాడికి ఏ మంచీ చేయని ఈ చంద్రబాబు.. ఆయన చేసే అబద్దాలు, మోసాలు ఏ స్ధాయిలో ఉంటాయంటే.. ఒక్కసారి 2014లోకి వెళ్తాం. 
ఇది మీ అందరికీ గుర్తుందా? (పాంప్లెట్ చూపుతూ) 2014లో  స్వయంగా చంద్రబాబు సంతకం పెట్టి ... ఇదే ముగ్గురితో కూటమిగా ఏర్పడి, మీ ప్రతి ఇంటికి ముఖ్యమైన హామీలు అంటూ ఈ పాంప్లెట్ పంపించాడు. అప్పట్లో ఇదే ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5లో అడ్వటైర్ మెంట్లతో ఊదరగొట్టారు.
కింద చంద్రబాబు సంతకం, మీ ప్రతి ఇంటికి ఈ పాంప్లెట్ పంపించాడు. ఇందులో చెప్పిన ముఖ్యమైన హామీలను నేను ఒక్కసారి చదువుతాను. ఇవన్నీ జరిగాయా లేదా అన్నది మీకే విడిచిపెడతాను. మీరే చెప్పండి.

ఇందులో చెప్పినది మొదటది... 
రైతుల రుణ మాఫీపై మొదటి సంతకం చేస్తానన్నాడు. నేను అడుగుతున్నాను. చంద్రబాబు చేస్తానన్న మరి రూ.87,612 కోట్ల రుణాల మాఫీ జరిగిందా?
ముఖ్యమైన హామీ అంటూ.. పొదుపు సంఘాల రుణాలు రద్దు చేస్తామన్నారు. ఏకంగా రూ.14,205 కోట్లు పొదుపు సంఘాల రుణాలు ఒక్క రూపాయి మాఫీ చేశాడా? 
ముఖ్యమైన హామీలు.. ఆడ బిడ్డ పుడితే మహాలక్ష్మి పథకం కింద రూ.25 వేలు బ్యాంకుల్లో వేస్తామన్నాడు. నేను అడుగుతున్నాను.. మీ అందరినీ కూడా చంద్రబాబు పరిపాలన చేసిన ఆ 5 సంవత్సరాల్లో మీలో ఏ ఒక్కరిలో అయినా కూడా ఏ ఒక్కరికైనా కూడా కనీసం ఒక్క రూపాయి అయినా వేశాడా? 

ఇంటింటికీ ఉద్యోగం, ఉద్యోగం ఇవ్వలేకపోతే నెల, నెలా రూ.2 వేలు నిరుద్యోగభృతి అన్నాడు. నేను అడుగుతున్నాను.5 సంవత్సరాలు, అంటే 60 నెలలు రూ.2 వేల చొప్పున రూ.1.20 లక్షలు మీ ఇళ్లలో ఏ ఇంటికైనా ఇచ్చాడా?
 అర్హులందరికీ 3 సెంట్ల స్థలం, కట్టుకునేందుకు పక్కా ఇళ్లు అన్నాడు. నేను అడుగుతున్నాను. ఇక్కడ ఇన్ని వేల మంది ఉన్నారు కదా. మీలో ఏ ఒక్కరికైనా కూడా ఒక్క సెంటు స్థలమైనా ఇచ్చాడా? 

మరో ముఖ్యమైన హామీ.. రూ.10 వేల కోట్లతో బీసీ సబ్ ప్లాన్, చేనేత పవర్ లూమ్స్ రుణాలు మాఫీ అన్నాడు జరిగిందా? ఉమెన్ ప్రొటెక్షన్ ఫోర్స్ ఏర్పాటు చేస్తామన్నాడు,  సింగపూర్ కు మించి అభివృద్ధి చేస్తామన్నాడు, చేశాడా? ప్రతి నగరంలో హైటెక్ సిటీ నిర్మిస్తామన్నాడు జరిగిందా? నరసాపురంలో కనిపిస్తోందా? మరి నేను మిమ్మల్నందరినీ ఒక్కటే అడుగుతున్నాను. ఆలోచన చేయండి.

ఇదే చంద్రబాబు ఈ ముఖ్యమైన హామీలంటూ 2014లో చంద్రబాబు సంతకం పెట్టి మీ ప్రతి ఇంటికీ పంపించిన ఈ పాంప్లెట్ లో.. చెప్పినవి ఒక్కటంటే ఒక్కటైనా జరిగిందా? 

బాబు హామీలను నమ్ముతారా...?
ఇలాంటి వ్యక్తులను నమ్మవచ్చా ? ఇవాళ  మరలా ఇదే చంద్రబాబు. ఇదే కూటమి. మళ్లీ మోసాలు చేసేందుకు కొత్త మేనిపెస్టో అంటూ బయలుదేరారు. సూపర్ సిక్స్ అంటూ, సూపర్ సెవెన్ అంటూ బయలుదేరారు. నమ్ముతారా?
ఇంటింటికీ కేజీ బంగారం ఇస్తామంటున్నారు. నమ్ముతారా? ఇంటింటికీ బెంజ్ కారు కొనిస్తామంటున్నారు. నమ్ముతారా? మరి ఆలోచన చేయమని కోరుతున్నాను. ఇలాంటి మోసగాళ్లతో, ఇలాంటి అబద్ధాలు చెప్పే వారితో ఇవాళ రాజకీయం యుద్ధం చేస్తున్నాం.

ఎవరి వల్ల జరిగిన మంచి కొనసాగుతుందో ఆలోచించండి. మీ అందరితో ఒక్కటే విజ్ఞప్తి చేస్తున్నాం. 
నిరుడు ఎన్నికల్లో మీ బిడ్డకు ఓటు వేయనివారికి కూడా మీ బిడ్డ ఒక్కటే అడుగుతున్నాడు. ఈ రోజు రాష్ట్రంలో జరుగుతున్నది కులాల మధ్య యుద్ధం కాదు. ఈ రోజు రాష్ట్రంలో జరుగుతున్నది క్లాస్ వార్. ఇవాల పేదవాడు బాగుపడాలన్నా, పేదవాడి భవిష్యత్ మారాలన్నా... మీ ఓటు ఎంత అవసరమో ప్రతి ఒక్కరూ గమనించమని కోరుతున్నాను.  ఈ రోజు మిమ్మల్ని అందరినీ ఒక్కటే కోరుతున్నాను.
నాకు ఓటు వేయని వారిని కూడా ఒక్కటే అడుగుతున్నాను. మీ ఇంటికి వెళ్లి మీ అవ్వాతాతలతో కూర్చుండి. భార్యా పిల్లలతో కూర్చుని మాట్లాడండి. మాట్లాడి ఎవరి హయాంలో, ఎవరి వల్ల మంచి జరిగింది. ఎవరు ఉంటే ఆ మంచి కొనసాగుతుంది అన్నది ప్రతి ఒక్కరూ ఆలోచన చేసి.. ఆ తర్వాతే ఓటు ఎవరికి వేయాలో నిర్ణయం తీసుకొండి అని మిమ్నలిని అందరినీ కోరుతున్నాను.

మంచి పాలన కోసం రెండు ఓట్లు ఫ్యాన్‌ కే వేయండి.
వాలాంటీర్లు మళ్లీ ఇంటికే రావాలన్నా, పేదవాడి భవిష్యత్తు మారాలన్నా, లంచాలు, వివక్ష లేని పాలన జరగాలన్నా, పథకాలన్నీ కొనసాగాలన్నా, మన పిల్లల చదువులు, మన బడులు బాగుపడాలన్నా, మన ఆసుపత్రులు, మనవ్యవసాయం మెరుగుపడాలన్నా, ఇవన్నీ జరగాలంటే ఏం చేయాలి? రెండు బటన్లు ఫ్యాను మీద నొక్కాలి. నొక్కి 175కు 175 అసెంబ్లీ స్థానాలు, 25కు 25 ఎంపీ స్థానాలు, ఒక్కటి కూడా తగ్గేందుకు వీల్లేదు. సిద్ధమేనా..

ఇది మన గుర్తు. అన్నా ఇది మన గుర్తు. తమ్ముడూ ఇది మన గుర్తు. అక్కా ఇది మన గుర్తు. చెల్లీ ఇది మన గుర్తు. మన గుర్తు ఫ్యాను. మంచి చేసిన ఈ ఫ్యాను ఎక్కడుండాలి? ఇంట్లోనే ఉండాలి. చెడుచేసిన సైకిల్ ఎక్కడుండాలి?ఇంటి బయటే ఉండాలి. తాగేసిన టీ గ్లాస్ ఎక్కడుండాలి? సింక్ లోనే ఉండాలి.  ప్రతి ఒక్కరూ ఈ విషయాలను గుర్తెరగమని కోరుతున్నాను. 

ఈ రోజు ఈ మాటలన్నీ కూడా మీకు వివరంగా చెబుతూ ఈరోజు మన వైయస్సార్ సీపీ తరఫున నిలబడుతున్న మన అభ్యర్థులపై మీ చల్లని దీవెనలు, ఆశీస్సులు వారిపై ఉంచవలసిందిగా సవినయంగా ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నాను అని సీఎం శ్రీ వైయస్.జగన్ తన ప్రసంగం ముగించారు. 

ఈ కార్యక్రమంలో నరసాపురం వైయస్ఆర్‌ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్ధి ముదునూరి ప్రసాదరాజు, ఎంపీ అభ్యర్ది జి. ఉమాబాల పాల్గొన్నారు. 

Back to Top