Ysrcpnettv
YSR Congress Party Twitter YS Jagna Twitter

YSR Congress

Flash News >>>>
             రాగోలు నుంచి వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి 318వ రోజు ప్రజాసంకల్పయాత్ర ప్రారంభం                               హిందూపురం టీడీపీ మాజీ ఎమ్మెల్యే అబ్దుల్‌ గని వైయ‌స్ఆర్‌సీపీలో చేరిక‌                               ప‌వ‌న్‌కు చిత్త‌శుద్ది ఉంటే చంద్ర‌బాబు అవినీతిపై నిల‌దీయాలి: ఎమ్మెల్యే ఆదిమూల‌పు సురేష్‌                               డాక్టర్ బీఆర్ అంబేద్కర్‌కు వైయ‌స్ జగన్ నివాళులు                               టీడీపీ హయాంలో దళిత సంక్షేమం టీడీపీ దొంగల సంక్షేమంగా మారింది: మేరుగ నాగార్జున                               సంతవురిటి నుంచి వైయ‌స్ జ‌గ‌న్‌ 313వ రోజు ప్రజాసంకల్పయాత్ర ప్రారంభం                               రాజ్యాంగబద్ధంగా ప్రతిపక్ష హోదా దక్కినా ఆపదవి నిర్వహించనీయకుండా అడ్డుకోవడం వల్లే వైఎస్‌ జగన్‌ పాదయాత్ర చేస్తున్నారు: ధ‌ర్మాన ప్ర‌సాద‌రావు                               ఒక్కసారి వైయస్‌ జగన్‌కు అవకాశం ఇవ్వండి..30 ఏళ్ల సంక్షేమంతో రాష్ట్రం ముందుకెళ్తుంది: ఎంపీ విజయసాయిరెడ్డి                                అంతకాపల్లి నుంచి వైయ‌స్ జ‌గ‌న్‌ 312వ రోజు ప్రజాసంకల్పయాత్ర ప్రారంభం                 
    Show Latest News
రైతు సంక్షేమ‌మే ధ్యేయ‌మంటున్న జ‌న‌నేత‌

Published on : 21-Feb-2018 | 11:54
 

* వైయ‌స్ఆర్ సీపీ ప్ర‌క‌టించిన ప‌థ‌కాల‌పై రైతుల్లో ఆనందం
* తండ్రిని మించి పాల‌న చేస్తాడంటున్న అన్న‌దాత‌లు
* పాద‌యాత్ర‌కు ద‌న్నుగా నిలుస్తున్న రైతులు
అమ‌రావ‌తి: వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్య‌క్షులు వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ప్ర‌క‌టిస్తున్న ప‌థ‌కాల‌పై రైతులు హ‌ర్షం వ్య‌క్తం చేస్తున్నారు. రైతు సంక్షేమ‌మే త‌న ధ్యేయ‌మ‌ని చెబుతున్న జ‌న‌నేత‌కు అన్న‌దాత‌లు జేజేలు ప‌లుకుతున్నారు. మ‌హానేత వైయ‌స్ఆర్ పాల‌న‌లో రైతులు ఆనందంగా ఉండేవార‌ని, ఇప్పుడు ఆ ప‌రిస్థితి లేద‌ని, మ‌ళ్లీ వైయ‌స్ జ‌గ‌న్ అధికారంలోకి వ‌స్తేనే రైతుల‌కు న్యాయం జ‌రుగుతుంద‌ని అంటున్నారు. రైతుల ఆత్మీయ స‌మ్మేళ‌నాలు నిర్వ‌హిస్తూ.. రైతుల అభిప్రాయాలు తీసుకుంటూ.. రైతులను ఆదుకునేందుకు త‌న‌వంతు ప్ర‌య‌త్నం చేయ‌డం అభినంద‌నీయ‌మంటున్నారు. కాగా పాద‌యాత్ర‌లో పాల్గొంటున్న రైతులు అభిప్రాయాలు ఈ విధంగా ఉన్నాయి.
ఏపీ ప్ర‌తిప‌క్ష నేత వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి రైతుల కోసం మంచి ప‌థ‌కాల‌ను ప్ర‌వేశ‌పెట్టారంటున్నారు. వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్టుల‌న్నీ పూర్తి చేయ‌డంతో పాటు రైతుల‌కు ఉచితంగా 9 గంట‌ల విద్యుత్ ఇస్తామ‌ని ప్ర‌క‌టించ‌డంపై అన్న‌దాతలు హ‌ర్షం ప్ర‌క‌టిస్తున్నార‌న్నారు. పెట్టుబ‌డుల క్రింద రైతుల‌కు ఏటా రూ.12500లు ఇస్తామ‌ని చెప్ప‌డం, అన్న‌దాత‌లు అప్పుల పాలు కాకుండా ముందే ధ‌ర‌ల‌ను ప్ర‌క‌టించి ఆ ధ‌ర‌ల‌కే పంట‌ల‌ను కొంటామ‌ని వైయ‌స్ జ‌గ‌న్ చెప్పిన హామీ ఇవ్వ‌డం రైతుల్లో ధైర్యాన్ని నింపుతోంద‌న్నారు. అంతేకాకుండా ఏటా ధ‌ర‌ల స్థిరీక‌ర‌ణ నిధి కింద రూ.3వేల కోట్లు, ప్ర‌కృత్తి విప‌త్తుల క్రింద ఏటా రూ.4వేల కోట్లు కేటాయించి రైతుల‌ను ఆదుకుంటామ‌ని జ‌న‌నేత వైయ‌స్ జ‌గ‌న్ హామీ అంద‌రి మ‌న్న‌న‌ల‌ను పొందుతోంద‌న్నారు. ఏది ఏమైనా వైయ‌స్ జ‌గ‌న్ తండ్రికి మంచిన పాల‌న అందిస్తార‌ని రైతులు ఆశాభావం వ్య‌క్తం చేస్తుండ‌డం గ‌మ‌నార్హం. 

సంబంధిత వార్తలు

Home  |  News  |  Downloads  |  Gallery  |  Contact Us  |   Sitemap  

Official Website of YSR Congress Party
Copyright © 2011 ysrcongress.com