Ysrcpnettv
YSR Congress Party Twitter YS Jagna Twitter

YSR Congress

Flash News >>>>
             పచ్చచొక్కాల కోసమే ప్రభుత్వ పథకాలు: వైవీ సుబ్బారెడ్డి                               చిన్నరాయుడుపేట నుంచి వైయ‌స్ జ‌గ‌న్ 298వ రోజు ప్రజాసంకల్పయాత్ర ప్రారంభం                               బిడ్డ పుట్టి ఓటు హక్కు వచ్చిన తర్వాత తనకే ఓటు వేస్తారని చంద్రబాబు పేర్కొనడం హాస్యాస్పదం: పేర్నినాని                               వైయ‌స్ జ‌గ‌న్ బాలల దినోత్సవ శుభాకాంక్షలు                                మాజీ మంత్రి సి.రామ‌చంద్ర‌య్య వైయ‌స్ జ‌గ‌న్ స‌మ‌క్షంలో వైయ‌స్ఆర్‌సీపీలో చేరిక‌                               నాలుగేళ్లుగా దళితుల సమస్యలపై చంద్రబాబు స్పందించలేదని, ఎన్నికలకు 6 నెలల ముందు ఎస్టీలకు మంత్రి పదవి ఇచ్చారు: టీజేఆర్ సుధాక‌ర్‌బాబు                               వైయ‌స్ జ‌గ‌న్ స‌మ‌క్షంలో రాజ‌మండ్రికి చెందిన బీసీ సంఘం రాష్ట్ర అధ్య‌క్షుడు మార్గాని నాగేశ్వ‌ర‌రావు, భ‌ర‌త్ వైయ‌స్ఆర్ సీపీలో చేరిక‌                               కేంద్ర మంత్రి అనంత్‌కుమార్ మృతికి వైయ‌స్ జ‌గ‌న్ సంతాపం                               వైయ‌స్ జగన్ ప్ర‌జా సంక‌ల్ప యాత్ర‌ పున:ప్రారంభం                 
    Show Latest News
చిరునవ్వుల రేడు

Published on : 07-Jul-2018 | 17:34
 

వైఎఎస్ రాజశేఖర్ రెడ్డి ఆ పేరు చెబితే ముందుగా గుర్తొచ్చేదేమిటి. ఓ స్వచ్ఛమైన చిరునవ్వు కదూ. తెలుగుదనానినికి ప్రాణం పోసినట్టు రాజసంగా నిలిచిన రూపం కదూ. ఆత్మీయంగా ప్రతి ఒక్కరినీ పిలిచిన పిలుపు కదూ! అవును వైయస్ఆర్ ఓ మరపురాని జ్ఞాపకం. ప్రతి మనిషికి ఆయన చిరునవ్వుతో ఓ బంధం పెనవేసుకునే ఉంది.ఆ నవ్వులో ఎన్నిభావాలో

పేదలకు ఆయన నవ్వు ఆయుష్షు. అక్కచెల్లెళ్లకు ఆ చిరునవ్వేఓ ఆసరా. విద్యార్థులకు అది అంతులేని అభయం. అధికారులకు ఆ చిరునవ్వే స్నేహహస్తం. ప్రభుత్వానికి ఆ చిరునవ్వే ఆయుధం. ప్రతిపక్షానికి ఆ నవ్వే విమర్శనాస్త్రం. ఎంతటి ప్రతికూలతనైనా తన చిరునవ్వుతో గెలవడమే ఆయన సిద్ధాంతం. వైరి పక్షాల ఆరోపణలకు కూడా ఆయన చిరునవ్వే దీటైన సమాధానం. ఒక్కొక్కరికీ ఆ నవ్వులో ఒక్కో భావం ద్యోతకం అవుతుంది. సాయం కోరి వచ్చిన వారికి ఆ చిరునవ్వులోనే భరోసా దొరికితే, ఆరోపణలు చేసేవారికి ఆ నవ్వులో ధిక్కారం వినిపించేది.

ప్రతికూలతలను కూడా చిరనవ్వుతో అధిగమిస్తూ

ప్రజల మధ్య ఉన్నప్పుడు వైయస్ నవ్వితే అది పూల వర్షంలా ఉంటే, అసెంబ్లీలో ఉన్నప్పుడు ఆయన నవ్వు సింహగర్జనలా ఉండేది. ప్రతిపక్ష పార్టీ నాయకులను కూడా చిరునవ్వుతోనే ఎదొర్కోవడం వైయస్ ఆర్ కు మాత్రమే సాధ్యం. విమర్శలు, ఆరోపణలకు సైతం ఛలక్తులతో సమాధానం ఇచ్చే నాయకుడిని చూసి అసెంబ్లీ ఆశ్చర్యపోయేది. ఒక్కో సందర్భంలో చంద్రబాబు వైయస్ఆర్ నవ్వును చూసి తట్టుకోలేక ఆవేశపడిపోయేవారు. ప్రతిపక్ష నేతను తన చిరునవ్వుతో ఉడికిస్తూ, కవ్విస్తూ మధ్య మధ్యలో వాస్తవాలను వెల్లడించి తన చతురత చాటుకున్న చాణుక్యుడు వైయస్ఆర్. ఆయన తీరుకు సభ అంతా నవ్వుల పూవులు పూయడాన్ని పార్టీలకు అతీతంగా నాయకులంతా గుర్తు చేసుకుంటూంటారు.

కష్టకాలంలోనూ చెదరని నవ్వు

వైయస్ఆర్ జీవితం పూల బాట కాదు. ఎన్నో ఏళ్లు ప్రతిపక్ష నాయకుడి హోదాలో ఉన్నారు. ఆ సమయంలోనే ప్రజల కష్టాలు చూసి చలించిపోయారు. ప్రజా ప్రస్థానం పాదయాత్ర ప్రారంభించి, కన్నీళ్లతో ఎదురు చూస్తున్న ప్రజలకు తానున్నానే భరోసా కల్పించారు. మండుటెండలు, హోరు గాలులు, వర్షాలూ ఏవీ ఆయన పాదయాత్రకు ఆటంకం కాలేకపోయాయి. అనారోగ్యం పాలైనా సరే యాత్రకు విశ్రాంతి ఇవ్వలేదు. ప్రజలు ఇన్ని బాధలను సహిస్తున్నప్పుడు, వారిని ఓదార్చడానికి ఈ మాత్రం కష్టపడలేమా అంటూ చిరునవ్వుతో ముందుకే సాగారు వైయస్ఆర్.

వైరికి కూడా వరం ఆ చిరునవ్వు

సాయం కోరి వచ్చిన వారు శత్రువైనా సరే చిరునవ్వుతో పలకరించడం వైయస్ రాజశేఖర్ రెడ్డి నైజం. ఆ నవ్వు ప్రత్యర్థులను కలవరపెట్టడమే కాదు, అవసరమైతే కరుణనూ కురిపించగలదు. అందుకే సిద్ధాంతపరంగా ఆయనతో విబేధించే నాయకులు, విలేకరులు, విమర్శకులు  సైతం వైయస్ చిరునవ్వుకు ఫిదా అయ్యారు. ఆయన వ్యక్తిత్వానికి సలామన్నారు.

 

 

 

సంబంధిత వార్తలు

Home  |  News  |  Downloads  |  Gallery  |  Contact Us  |   Sitemap  

Official Website of YSR Congress Party
Copyright © 2011 ysrcongress.com