Ysrcpnettv
YSR Congress Party Twitter YS Jagna Twitter

YSR Congress

Flash News >>>>
             సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ, చంద్రబాబు మధ్య బంధం తేలతెల్లమవుతోంది: వాసిరెడ్డి పద్మ                                నచ్చితే నంది.. నచ్చకపోతే పందిలా తెలుగుదేశం పార్టీ పత్రికల తీరు: వాసిరెడ్డి పద్మ                               ఫీజు రీయింబ‌ర్స్‌మెంట్ ప‌థ‌కాన్ని నిర్వీర్యం చేస్తూ పేద‌ల‌కు ఉన్న‌త చ‌దువులు దూరం చేస్తున్న వైఖ‌రికి నిర‌స‌న‌గా వైయ‌స్‌ఆర్ విద్యార్ధి విభాగం ఆధ్వర్యంలో అన్ని జిల్లా కేంద్రాల‌లో అక్టోబ‌ర్ 25వ తేదీన ఫీజుపోరు : విజ‌య‌సాయిరెడ్డి                               జననేత వైయ‌స్ జ‌గ‌న్ ప్ర‌జా సంక‌ల్ప యాత్ర 292వ రోజు సాలూరు శివారు నుంచి ప్రారంభం                               చంద్రబాబు రాజకీయ జీవితమంతా రక్త చరిత్రే: భూమన కరుణాకర్‌రెడ్డి                                వైయస్‌ జగన్‌ను కలిసిన సాక్షార భారత్‌ గ్రామ కో–ఆర్డినేటర్లు                               తుని రైలు దహనం ఘటన వెనుక చంద్రబాబు హస్తం లేదా: భూమన కరుణాకర్‌రెడ్డి                                గుంటూరు జిల్లా టీడీపీ మాజీ అధ్యక్షుడు మల్లాది శివన్నారాయణ, చిలకలూరిపేట టీడీపీ మాజీ అధ్యక్షుడు శివయ్య, జి.వెంకట్రావు, కె.కాంతారావులు వైయ‌స్ఆర్‌సీపీలో చేరిక‌                               దేశంలో, రాష్ట్రంలో ఇలాంటి అబద్ధపు ముఖ్యమంత్రి ఎక్కడా లేరని, గల్ఫ్‌ దేశాల్లో ఇలాంటి అబద్ధాల ముఖ్యమంత్రిని ఎప్పుడో ఉరి తీసేవారు: ఎమ్మెల్యే ర‌వీంద్ర‌నాథ్‌రెడ్డి                 
    Show Latest News
ఆక్వాఫుడ్ పార్క్ బాధిత గ్రామాల్లో పోలీస్ జులుం

Published on : 29-Nov-2017 | 18:02
 

ఆక్వాఫుడ్పార్క్ తో పచ్చని పంట పొలాలు, గ్రామాలు నాశనం

-తీర ప్రాంతానికి మార్చమంటున్న ప్రజలు

టిడిపి అరాచక పాలనకు మరో ఉదాహరణగా నిలిచింది తుందుర్రు ఆక్వాఫుడ్పార్క్. పచ్చనిపంట పొలాలను నాశనం  చేస్తూ, చుట్టూ ఉన్నప్రజల జీవితాలను  కాలరాసే ఈ రావణకాష్టాన్నిబాధిత గ్రామాల ప్రజలుఎన్నాళ్లుగానో వ్యతిరేకిస్తున్నారు.

ఆక్వాఫుడ్ పార్కును  తీరప్రాంతానికి తరలించాలనే డిమాండ్ తో  ఆయా గ్రామాలప్రజలు విజయవాడధర్నాచౌక్లో ధర్నా చేపట్టాలని 

నిర్ణయించారు. దీనికి సంబంధించి అనుమతులు సైతం పొందారు. కానీ అనూహ్యంగా పోలీసులు తుందుర్రు, కె.బేతపూడి, జొన్నలగరువు గ్రామాల్లోపెద్దఎత్తున బలగాలను మొహరించారు. విజయవాడ వెళ్లకుండా ప్రజలను అడ్డుకుని నిర్భందించారు. 

ఆక్వాఫుడ్పార్కు వ్యతిరేక పోరాట కమిటీ నాయకుల ఇళ్లకు వెళ్లి వారిని అన్యాయంగా అరెస్టు చేసారు. మూడు గ్రామలలో 

ఇళ్లలోకి వెళ్లి మరీ పోలీసులు తనిఖీలు నిర్వహించారు. శాంతియుతంగా ధర్నాచేసేందుకు సిద్ధమైన వారిని, అనుమతులు కూడా పొందిన తర్వాత ప్రభుత్వం ఇలా పోలీసులను ప్రయోగించి నిర్భంధించడంతో గ్రామస్తులు

  ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

గతంలో  కూడాఈ  గ్రామాలవారుచేసిన ఆందోళనను ప్రభుత్వం పోలీసుల జులుంతో అణగదొక్కాలనే  ప్రయత్నించింది.

2016 అక్టోబర్ నెలలో కూడా ఫుడ్ పార్కు నిర్మాణ గ్రామాల్లో బ్రిటిష్ పాలనను తలపించేలా పోలీసు రాజ్యాన్ని నడిపింది సర్కార్.  

రెండు నెలలపాటు గ్రామాల్లో ఆంక్షలు విధించింది. ఎక్కడకు వెళ్లినా ప్రశ్నలు, ఆధార్, రేషన్ కార్డులు  చూపించమంటూ

 ఒత్తిడులు, పండగలు చేసుకోరాదని హెచ్చరికల మధ్య నాలుగు గ్రామాల ప్రజలు బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్ల దీసారు.

ప్రజా ఆందోళనలను ఖాకీల బూట్లకింద నలుపుతున్న కిరాతక ప్రభుత్వాన్ని ప్రజలు శాపనార్థాలతో దుమ్మెత్తిపోస్తున్నారు. 

సంబంధిత వార్తలు

Home  |  News  |  Downloads  |  Gallery  |  Contact Us  |   Sitemap  

Official Website of YSR Congress Party
Copyright © 2011 ysrcongress.com