Ysrcpnettv
YSR Congress Party Twitter YS Jagna Twitter

YSR Congress

Flash News >>>>
             మాజీ మంత్రి సి.రామ‌చంద్ర‌య్య వైయ‌స్ జ‌గ‌న్ స‌మ‌క్షంలో వైయ‌స్ఆర్‌సీపీలో చేరిక‌                               కొయ్యాన‌పేట నుంచి వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి 296వ రోజు ప్ర‌జా సంక‌ల్ప యాత్ర ప్రారంభం                               నాలుగేళ్లుగా దళితుల సమస్యలపై చంద్రబాబు స్పందించలేదని, ఎన్నికలకు 6 నెలల ముందు ఎస్టీలకు మంత్రి పదవి ఇచ్చారు: టీజేఆర్ సుధాక‌ర్‌బాబు                               వైయ‌స్ జ‌గ‌న్ స‌మ‌క్షంలో రాజ‌మండ్రికి చెందిన బీసీ సంఘం రాష్ట్ర అధ్య‌క్షుడు మార్గాని నాగేశ్వ‌ర‌రావు, భ‌ర‌త్ వైయ‌స్ఆర్ సీపీలో చేరిక‌                               కేంద్ర మంత్రి అనంత్‌కుమార్ మృతికి వైయ‌స్ జ‌గ‌న్ సంతాపం                               వైయ‌స్‌ జగన్ ప్ర‌జా సంక‌ల్ప యాత్ర 295వ రోజు సాలూరు నియోజకవర్గం, పాయకపాడు నుంచి ప్రారంభం                               వైయ‌స్ జగన్ ప్ర‌జా సంక‌ల్ప యాత్ర‌ పున:ప్రారంభం                               చంద్రబాబు ముందు రాష్ట్రం సంగతి చూడు.. తర్వాత దక్షిణాది రాష్ట్రాల పర్యటన చేద్దువు: ఎస్సీ సెల్‌ రాష్ట్ర అధ్యక్షుడు మేరుగ నాగార్జున                                వైయ‌స్‌ జగన్‌పై హత్యాయత్నంలో కుట్ర ఉంది.. ఏపీ ప్రభుత్వం, పోలీసుల అజమాయిషీ లేని విచారణ సంస్థల చేత దర్యాప్తు జరిపించాలి: వైయ‌స్‌ జగన్‌ తరపు న్యాయవాది                 
    Show Latest News
పశ్చిమాన ప్రజాసంకల్పం

Published on : 25-May-2018 | 15:08
 

వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారి ప్రజాసంకల్పయాత్ర పశ్చిమగోదావరి జిల్లా గోపాలపురం, తాడేపల్లి గూడెం, ఉంగుటూరు, ఉండి నియోజక వర్గాల మీదగా సాగుతోంది. వివిధ వర్గాల ప్రజలు తమ గోడును ప్రతిపక్ష నేత ఎదుట చెప్పుకుంటున్నారు. ఆరోగ్యశ్రీ వర్తించక అనారోగ్యంతో సతమతం అవుతున్న కుటుంబాలు, ఫించన్లు రాక తల్లడిల్లుతున్న వారు, ఆశావర్కర్లు, ఉద్యోగులు వివిధ వర్గాల ప్రజలంతా యువనేతను కలిసి తమ సమస్యలను వెల్లడించారు. 
అవినీతిపై ధ్వజమెత్తిన జననేత
రాష్ట్రవ్యాప్తంగా టిడిపి ప్రభుత్వం చేస్తున్న అవినీతిపై బహిరంగ సభలో ప్రసంగించారు ప్రతిపక్షనేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. నీరుచెట్టు పేరుతో గ్రామాలను దోచేస్తున్నతీరును ఎండగట్టారు. యంత్రాలతో పనులు చేసి కూలీలు చేసారం బిల్లులు పెట్టడం, అసలు పనులే చేయకుండా బిల్లులు పెట్టి కోట్లు స్వాహా చేయడం ఈ ప్రభుత్వం చేస్తున్న పని అంటూ దుయ్యబట్టారు. గిరిజనులకు బాబు హయాంలో జరుగుతున్న అన్యాయాన్ని కూడా వారి తరఫునే ప్రశ్నించారు యువనేత. సబ్ ప్లాన్ కేటాయింపులు, గిరిజన ఆడపిల్లల పెళ్లికి ఇస్తామన్న 50వేల రూపాయిలు, ఇల్లు, రెండెకరాల పొలం, తండాల్లో సోలార్ ప్లాంట్లు, గిరిజన విశ్వవిద్యాలయం... హామీల్లో ఏ ఒక్కటీ నెరవేరలేదని వారు ప్రతిపక్షనేత వద్ద వాపోయారు. మైనారిటీలు, గిరిజనులు లేని క్యాబినెట్ చంద్రబాబు హయాంలోనే చూస్తున్నామంటూ మండిపడ్డారు ప్రతిపక్షనేత. అభివృద్ధిలో రాష్ట్రాన్ని తిరోగమనం పాలుచేసిన చంద్రబాబు టీడీపీ ఎమ్మెల్యేలకు రౌడీఇజంలో, గూండాఇజంలో, ఇసుక మట్టిలను అక్రమంగా తరలించుకోవడంలో, మహిళలను జుట్టుపట్టి ఈడ్పించడంలో శిక్షణ ఇచ్చారంటూ ధ్వజమెత్తారు. దారిపొడవునా రైతులు, కౌలు రైతుల సమస్యలను విని చలించిపోయారు వైఎస్ జగన్. అధికారంలోకి వచ్చిన వెంటనే కౌలు రైతుల సమస్యలను సమగ్రంగా అధ్యయనం చేసి, పరిష్కారం చూపుతామని హామీ ఇచ్చారు. పశ్చిమ గోదావరి జిల్లాలో ఏ ప్రాంతంలో చూసినా మంచీనటి సమస్య కనిపిస్తోందన్నారు వైఎస్ జగన్. పంచాయితీలు, మున్సిపల్ వాటర్ రోగాలు తెచ్చేవిగా ఉన్నాయని, రోజూ మంచినీటిని కొనుక్కుని తాగాల్సి వస్తోందని వాపోయారు ఈ ప్రాంత మహిళలు.
యువనేత హామీలు
500 జనాభా ఉన్న తండాలు, గూడేలను పంచాయితీలుగా మారుస్తామని హామీ ఇచ్చారు ప్రతిపక్షనేత. గిరిజన తండా, గూడాలలో ప్రతి ఇంటికీ 200 యూనిట్ల వరకూ ఉచిత కరెంటు అందిస్తామన్నారు.  ఐటీడీఎ పరిధిలో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి, పావలవడ్డీ రుణాలు, బ్యాక్ లాగ్ పోస్టుల భర్తీ చేపడతామని మాటిచ్చారు. చేపల, రొయ్యాల చెరువుల రైతులకు యూనిట్ 1.50కే కరెంటు అందిస్తామని చెప్పారు. వీటిపై ఆధారపడి నడిచే ఐస్, ప్రాసెసింగ్ ఫ్యాక్టరీల యూనిట్ ధర 7 నుంచి 5రూపాయలకు తగ్గిస్తామని కూడా ప్రకటించారు యువనేత.  సముద్రతీర ప్రాంతంలో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటు చేసి, నాణ్యత, మార్కెట్, దళారీ వ్యవస్థపై నియంత్రించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. రక్షిత తాగునీటి ఏర్పాట్లు చేస్తామని , కాలువల పక్కనే ఉన్న ప్రతిఊరికీ సమ్మర్ స్టోరేజీ టాంకులు కట్టిస్తామని హామీ ఇచ్చారు. కాలువలకు నీళ్లు రాగానే ఆ ట్యాంకులు నింపించి, ప్రతి ఊరిలో మినరల్ వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేస్తామని మాటిచ్చారు వైఎస్ జగన్. తాడేపల్లిగూడెం, గణపవరంలో జరిగిన బహిరంగ సభల్లో అశేష జనవాహిని యువనేతకు స్వాగతం పలికింది. జగన్ ప్రతి మాటకూ యువత గొంతు కలిపింది. ఆత్మీయ సమ్మేళనంలో వివిధ వర్గాల ప్రజలు తమ సమస్యలను నేరుగా యువనేత ముందుంచారు. 
ఆత్మీయతకు ఆనవాలు ప్రజాసంకల్పం
ప్రతిపక్ష నేత వస్తున్న దారంతా వేలాదిగా ఎదురుచూస్తున్న జన సందోహమే. వేల మైళ్లు నడుస్తున్న ఆ యువనేతను చూసి చలించిన అక్కచెల్లెళ్లు ఎదురొచ్చి తమ చెంగుతో ఆయన స్వేదాన్ని తుడుస్తున్నారు, మంచినీళ్లు, కాఫీ అందించి సేదతీరవయ్యా అంటూ తల్లిలా ఆదరణను చూపిస్తున్నారు, మనవడిలా దగ్గరకొచ్చి పలకరించిన యువనేతకు తమ బాధలు వివరించుకుంటున్నారు అవ్వాతాతలు. దివ్యాంగులు సైతం ఆ ప్రజానాయకుని ఒక్కసారైనా కలవాలంటూ ఎదురు చూపులు చూస్తున్నారు. వైఎస్ జగన్ వచ్చి పలకరించిన వేళ కొండత ధైర్యం వచ్చిందని ఆనందంగా చెబుతున్నారు. 

 

 

సంబంధిత వార్తలు

Home  |  News  |  Downloads  |  Gallery  |  Contact Us  |   Sitemap  

Official Website of YSR Congress Party
Copyright © 2011 ysrcongress.com