Ysrcpnettv
YSR Congress Party Twitter YS Jagna Twitter

YSR Congress

Flash News >>>>
             ఇమామ్‌లకు నెలకు రూ.10 వేలు ఇస్తాం- వైయస్ జగన్ మోహన్ రెడ్డి                               రాష్ట్ర విభజన జరుగకూడదని చంద్రబాబు ఎప్పుడైనా అన్నారా? - బొత్స సత్యనారాయణ                               చ‌ంద్ర‌బాబు జీవితం అంతా వెన్నుపోటు రాజకీయమే- తమ్మినేని సీతాారాం                               ప్రజా సంకల్ప యాత్ర నుంచి దృష్టి మళ్లించడానికి అధికార పార్టీ కుయుక్తులు- వాసిరెడ్డి పద్మ                               సంక్షేమ హాస్టళ్లను మూసి వేస్తున్నారు-వైయస్ జగన్                               బాబును సీఎం కుర్చీ నుంచి దించితేనే మంచి రోజులు-వైయస్ జగన్                               తూ.గో డీసీసీ మాజీ అధ్యక్షుడు వైయ‌స్ఆర్‌సీపీలో చేరిక‌                               ప్రజల సమస్యలన్నింటినీ అధికారంలోకి వచ్చాక పరిష్కరిస్తాం..మీడియా తో వైయస్ జగన్ మోహన్ రెడ్డి                               హోదా కోసం నిస్వార్థంగా పోరాడుతున్నాం-ఎంపి వైవీ సుబ్బారెడ్డి                 
    Show Latest News
పచ్చనేతల బెదిరింపులు

Published on : 11-Aug-2017 | 16:00
 

నంద్యాల: ఉప ఎన్నికలో గెలుపొందేందుకు అధికార టీడీపీ నాయకులు నీచ రాజకీయాలకు దిగుతున్నారు. ఒకవైపు ప్రలోభాలకు గురి చేస్తూనే, మరోవైపు ఓటర్లను బెదిరిస్తున్నారు. వైయస్సార్‌ సీపీ మద్దతుదారులను లక్ష్యంగా చేసుకుని పోలీసులతో దాడులు చేయిస్తున్నారు. టీడీపీ విచ్చలవిడిగా అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నా పోలీసులు వారికి జోలికి వెళ్లడంలేదు. తమ పార్టీకి ఓటు వేయకుంటే పెన్షన్లు, డ్వాక్రా రుణాలు రావంటూ అధికార పార్టీ నేతలు బెదిరింపులకు దిగుతున్నారు. మూలసాగరం 31వ వార్డులో సర్వే పేరుతో టీడీపీ విద్యార్థులను వదిలి ఓటర్లను బెదిరింపులకు గురిచేస్తోంది.  ఓటర్లను భయపెడుతున్న నలుగురు ఇంజినీరింగ్‌ విద్యార్థులను వైయస్సార్‌ సీపీ నేతలు పోలీసులకు అప్పగించారు. వారి వద్ద ఓటర్ల జాబితా ఉన్నట్టు గుర్తించారు. టీడీపీ ప్రలోభాలు, బెదిరింపులకు ఎవరూ లొంగొద్దని వైయస్సార్‌ సీపీ శ్రీశైలం ఇంచార్జ్ బుడ్డా శేషారెడ్డి భరోసాయిచ్చారు. నంద్యాల ప్రజలకు తాము అండగా ఉంటామని ప్రకటించారు. దాడులకు వైయస్సార్‌ సీపీ నేతలు, కార్యకర్తలు భయపడబోరని చెప్పారు.

మీకు లోన్లు, రేషన్ రావని భయభ్రాంతులకు గురిచేస్తున్నారు. నంద్యాల ఎలక్షన్ సందర్భంగా మూలసాగరం 31వ వార్డుకు రావడం జరిగిందని, రాంగ్ సర్వే చేస్తూ ఇద్దరు వ్యక్తులు కనిపించారని బుడ్డా శేషారెడ్డి, ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్యలు తెలిపారు. పట్టుబడిన వారి వద్ద ఐడీ కార్డు, ఆధార్ ఏదీ లేదని, పశ్చిమగోదావరి, కాకినాడ, నర్సాపురం అని చెబుతున్నారని,  ఏ సంస్థకు చెందిన వారు కాదని చెబుతున్నారని తెలిపారు.  ఇంకా ఇలాంటి చాలా పెద్ద టీం ఉందన్న విషయం బహిర్గతమైందన్నారు.  రాత్రిళ్లు తిరగమని చెబుతున్నారని పట్టుబడ్డ విద్యార్థులు చెప్పినట్టు శేషారెడ్డి చెప్పారు. ప్రజలు మనసు అంగీకరించకున్నా వాళ్లతో బలవంతంగా భయపెట్టి రాయించుకుంటున్నారని మండిపడ్డారు. బాబు ఆఖరకు చేయాల్సిన సంక్షేమ కార్యక్రమాలు చేయకపోగా, ఎన్నికల్లో భయభ్రాంతులకు గురిచేయడం దారుణమన్నారు. ప్రతి వార్డులో అపరిచిత వ్యక్తులు సంచరిస్తున్నారని ఎలక్షన్ కమిషన్ దృష్టి సారించి కఠిన చర్యలు తీసుకోవాలని శేషారెడ్డి , సంజీవయ్యలు కోరారు. లేకపోతే ఓటింగ్ కు రావడానికి కూడ ఇక్కడి ప్రజలు భయపడే పరిస్థితి ఉంటుందన్నారు. వైయస్సార్సీపీ  ఇలాంటి కార్యక్రమాలు చేయదని,  దగాకోరు విధానాలకు పూనుకోదని చెప్పారు.

సంబంధిత వార్తలు

Home  |  News  |  Downloads  |  Gallery  |  Contact Us  |   Sitemap  

Official Website of YSR Congress Party
Copyright © 2011 ysrcongress.com