Ysrcpnettv
YSR Congress Party Twitter YS Jagna Twitter

YSR Congress

Flash News >>>>
             ఆత్రేయపురం నుంచి 190వ రోజు ప్రజాసంకల్పయాత్ర ప్రారంభం                               పేరవరం నుంచి 189వ రోజు ప్రజాసంకల్పయాత్ర ప్రారంభం                               రాజమహేంద్రవరం రైల్వేష్టేషన్ నుంచి వైయ‌స్ జ‌గ‌న్ పాద‌యాత్ర ప్రారంభం                               చంద్రబాబు ఎంతటి దుర్మార్గుడంటే గోదావరి పుష్కరాల పేరుతో రూ.2వేల కోట్ల రూపాయలు మింగేశారు: వైయ‌స్ జ‌గ‌న్‌                               మహానేత వైయ‌స్ఆర్‌ హయాంలోనే పోలవరం కుడి, ఎడమ కాలువల పనులు 90 శాతం పూర్తికావడం నిజం కాదా? : వైయ‌స్ జ‌గ‌న్‌                               ఒకే ప్రాజెక్టుకు ఆరుసార్లు శంకుస్థాపన, పూజా కార్యక్రమాలు చేయడం చంద్రబాబుకే చెల్లింది: వైయ‌స్ జ‌గ‌న్‌                               అశేష జ‌న‌వాహినిని న‌డుమ గోదావ‌రి బ్రిడ్జిపై కొన‌సాగుతున్న వైయ‌స్ జ‌గ‌న్ పాద‌యాత్ర‌                               పోల‌వ‌రం ప్రాజెక్టు దివంగ‌త ముఖ్యమంత్రి వైయ‌స్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి క‌ల‌: ఎంపీ విజ‌య‌సాయిరెడ్డి                               గోష్పాద క్షేత్రంలో వైయ‌స్‌ జగన్‌.. గోదారమ్మకు ప్రత్యేక పూజలు                 
    Show Latest News
రోడ్డెక్కని పాలన

Published on : 10-Jan-2018 | 18:55
 


కళ్లు మూసుకుని పాలు తాగుతున్న పిల్లి తన్నెవరూ చూడలేదనుకుంటుందట. దొంగ పిల్లిని చూసిన ఇంటి యజమాని దుడ్డుకర్రతో ఒక్కటిస్తే నడ్డి రాసుకుంటూ గోడదూకుతుందట. చంద్రబాబు తంతూ అలాగే ఉంది. ఆయనగారి సు’భిక్ష’మైన పాలనలో ప్రజలెవ్వరూ రోడ్డెక్కలేదట. రోడ్డున పడ్డ జనం దిగితే కదా....కాపు రిజర్వేషన్ల గురించి  నడిరోడ్డు మీద నడిచిన ప్రజలను ఆయన కళ్లతో చూడలేదులా ఉంది. కానీ అసాంఘిక శక్తులనీ, కడప నుంచి గూండాలనీ చెబుతూ జైళ్లలో పెట్టి వేధించిన వాళ్లు ఏ రాష్ట్ర ప్రజలో బాబుకే తెలియాలి. ఆక్వా పార్క్ మాకొద్దు మొర్రో అని, పచ్చని గ్రామాలు బుగ్గైపోతాయని, పంట పొలాల్లో కాక దూరంగా ఆ ఫ్యాక్టరీని కట్టుకోమని ఏళ్ల తరబడి ఊళ్లు కలబడి రోడ్డెక్కి చేస్తున్న పోరాటాలు ఆయన పాలనలోవి కాదుగాబోలు. రాజధాని పేరుతో మూడు పంటలు పండే పచ్చని నేలను బలవంతంగా గుంచుకుంటున్నారంటూ ర్యాలీలు చేసి, రోడ్లపై బైఠాయించిన అన్నదాతల గోడు అధికారం అడ్డుగోడగా కట్టుకున్న బాబుకు వినిపించలేదు, కనిపించలేదు. ప్రత్యేక హోదా కోసం ప్రతి తెలుగువాడి గుండె రగిలినప్పుడు, ప్రతిపక్ష నేత ప్రజాసమూహంలో ఒక్కడై నిరాహార దీక్ష చేసినప్పుడు, బలవంతంగా ప్రభుత్వం ఆ దీక్షను భగ్నం చేసినప్పుడు కూడా బాబుకు ప్రజలు రోడ్డెక్కి తనను ప్రశ్నిస్తున్నారనే అనిపించలేదు. విడ్డూరం. రుణమాఫీ కోసం, పంట నష్టపరిహారం కోసం ప్రాణాలు తీసుకునేందుకు రాజధాని నడిబొడ్డున నిలబడ్డ రైతన్నలు కూడా మబ్బుపొరలు కమ్మిన చంద్రబాబు కళ్లకు కనిపించనేలేదు. ఇప్పుడే కాదు గతంలో బాబు పాలించిన తొమ్మిదేళ్ల దాష్టీక కాలంలోనూ రోడ్లు ఎప్పుడూ ఖాళీగానే ఉన్నాయనుకుంటా. విద్యుత్ ఛార్జీల పెంపును వ్యతిరేకించిన వారిపై తూటల వర్షం కురిసింది, ఉద్యమించిన ఉద్యోగులను పోలీసుల బూటు కాళ్లతో తొక్కించిందీ ఖచ్చితంగా రోడ్లమీదైతే కాదు. చంద్రబాబు నడినెత్తిమీదే. నాకు ఓటేయకపోతే నే వేసిన రోడ్ల మీద నడవద్దని బాబు ఇచ్చిన వార్నింగ్ తో హర్ట్ అయిన ప్రజలు, తమ సొమ్ముతో సోకులు పోతున్న బాబును రోడ్డుమీద పడేసేదాకా రోడ్డెక్కకూడదని ప్రతినబూనారేమో ఎవరికి తెలుసు? 
రోడ్లంటే పసుపు పచ్చని తోరణాలతో, పచ్చ జెండాల రెప రెపలతో, పచ్చ పార్టీల వాహనాలతో, చంద్రబాబు కాన్వాయితో మాత్రమే ఉంటాయని చంద్రబాబు ఊహ. అలాగే ఉండాలన్నది ఆయన కోరిక. అయితే ఒక్కమాట ప్రజలు రోడ్డెక్కని పాలనను చేసింది ఒకప్పుడు హిట్లర్. ఇప్పుడు చంద్రబాబు...కానీ రోడ్లపై జనం కనబడ కూడదన్న వారి కోరక ఎప్పటికీ తీరదు....ప్రజాస్వామ్యంలో నిరంకుశ పాలన, నియంత నాయకుడు ఎప్పుడూ మట్టిగొట్టుకుపోయారు. ఆ హిట్లర్ చరిత్రనే కాదు, తన గత చరిత్రనూ చంద్రబాబు గుర్తు చేసుకుంటే ఆవిషయం బాగా తెలిసొస్తుంది. 
 
Labels : ap govt, chandrababu,
Home  |  News  |  Downloads  |  Gallery  |  Contact Us  |   Sitemap  

Official Website of YSR Congress Party
Copyright © 2011 ysrcongress.com