Ysrcpnettv
YSR Congress Party Twitter YS Jagna Twitter

YSR Congress

Flash News >>>>
             కర్ణాటక ఎన్నికలు ముగిసి 40 రోజులు కావొస్తోంది.. మరి బాబు చెప్పిన కేసులేమైనట్లు?: బొత్స స‌త్య‌నారాయ‌ణ‌                               ఉక్కు ఫ్యాక్టరీ కోసం టీడీపీ నేతలు దొంగ దీక్షలు: మాజీ ఎంపీ మిథున్‌రెడ్డి                               వైయ‌స్‌ జగన్‌ 198వ రోజు పాదయాత్ర సోమవారం ఉదయం మామిడికుదురు నుంచి ప్రారంభం                               కడపలో ఉక్కు ఫ్యాకర్టీ నిర్మిస్తే యువతకు ఉద్యోగాలు దొరుకుతాయి, ప్రజలకు ఉపాధి లభిస్తుంది: ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి                               కడప స్టీల్ ప్లాంట్‌ను ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేస్తూ వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ శనివారం కడపలో మహా ధర్నా                               చింత‌ల‌ప‌ల్లి నుంచి 196వ రోజు ప్రజాసంకల్పయాత్ర ప్రారంభం                               దేశంలోనే సీనియర్‌ నాయకుడిని అని చెప్పుకునే చంద్రబాబు యూటర్న్‌ ఎందుకు తీసుకున్నారు: ఉమ్మారెడ్డి వెంక‌టేశ్వ‌ర్లు                               రాష్ట్ర ప్రయోజనాల పరిరక్షణ కోసమే రాజీనామాలు చేశాం: మేకపాటి రాజమోహన్‌రెడ్డి                               ప్రత్యేక హోదా కోసం పోరాటం కొనసాగిస్తూ ఉంటామని, సాధించే వరకు తమ పోరాటం ఆగదు : మిథున్‌ రెడ్డి                  
    Show Latest News
ఎదగరా 'పచ్చ'గా...!!

Published on : 01-Jun-2018 | 10:52
 

అవును టిడిపి పచ్చగా ఎదగాలనుకుంటోంది. ఎపిలో కాదు లెండి ప్రపంచ వ్యాప్తంగా ఎదగాలని బాబు కోరిక. మహానాడును 100 దేశాల్లో నిర్వహించాలని కలలు కంటున్నాడు చంద్రబాబు. తెలుగు ప్రజలు ఉన్న చోటల్లా పచ్చ జెండా పాతేయాలన్నది బాబుగారి చిరకాల వాంఛ. అమెరికా, గల్ఫ్ దేశాల్లో మహానాడులు నిర్వహించిన టిడిపి అధినేత ప్రపంచ దేశాలన్నిటిలో మహానాడు ఏర్పాటు చేయాలని, 2100కి కూడా రాష్ట్రంలో టిడిపి పాలనే సాగాలని కలలు కంటున్నారు.

కలాం గారన్నట్టు కలలు కనాలి. అవి కూడా చాలా పెద్దగా కనాలి. బాబు గారు కూడా అలాంటి కలలే కంటున్నారు. కానీ ఆచరణలో అందుకు తగ్గ ప్రయత్నం మాత్రం ఏదీ చేయరు. ప్రపంచ దేశాల సంగతిపక్కన పెడితే పొరుగు రాష్ట్రాల్లో ఏనాడూ బాబుగారు మహానాడు నిర్వహించిన పాపాన పోలేదు. అంతెందుకు తాను చెప్పినందువల్లే కర్ణాటకలో తెలుగువాళ్లంతా బిజెపికి ఓట్లు వేయలేదని గొప్పలు పోయిన బాబు, ఆ రాష్ట్రంలో పోటీ ఎందుకు చేయలేదంటే నోరు విప్పడు.

ఇక తెలుగు వారు అత్యధికంగా ఉండే ముంబయి, మహారాష్ట్రలోనూ బాబు ఏ విధంగానూ ముందుకు పోలేదు. పొరుగునున్న తమిళనాడు, కేరళాల్లోనూ బాబు భజన నాడును పెట్టేలేకపోయారు. దేశమంతా తెలిసిన నేత, టెక్నాలజీకి పితామహుడు, దేశంలోనే సీనియర్ రాజకీయవేత్త, జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పిన వాడు అనే కీర్తి కిరీటాలు తగిలించుకుని తిరిగే బాబు పొరుగు రాష్ట్రాల్లో ఎందుకు మహానాడు ఏర్పాటు చేయలేకపోతున్నాడని మనబోటివాళ్లెవరైనా ప్రశ్నిస్తే తెలుగు తమ్ముళ్లకు కోపం వస్తుంది.  

నాన్నను మించిన వాడు నారా లోకేషు బాబు. వందదేశాల్లో మహానాడు అని చంద్రబాబు అంటే అమెరికాలోనూ అధికారంలోకి వద్దామని అన్నాడు లోకేశం ఈ మధ్య అమెరికాలో జరిగిన టిడిపి అభిమానుల సమావేశంలో. అందుకే అంటున్నారు ఎదగడానికెందుకురా తొందరా ఎదర పార్టీ బతుకంతా చిందర వందర అని...

Labels : NCBN, TDP

సంబంధిత వార్తలు

Home  |  News  |  Downloads  |  Gallery  |  Contact Us  |   Sitemap  

Official Website of YSR Congress Party
Copyright © 2011 ysrcongress.com