మ‌ళ్లీ వైయ‌స్ జ‌గ‌న్‌కే జనామోదం

ఏపీలో వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీకి తిరుగు లేదు

మ‌ళ్లీ వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డే ముఖ్య‌మంత్రి

- సీ ఓటర్ - ఇండియా టుడే సర్వే వెల్ల‌డి

అమ‌రావ‌తి: ‘‘ఆంధ్రప్రదేశ్‌లో వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి మ‌రోమారు రాజకీయ ప్రభంజనం సృష్టించబోతున్నారు. 2019 ఎన్నిక‌ల్లో  వైయ‌స్ఆర్ సీపీ ఘ‌న‌ విజయం సాధించగా, ఆ త‌రువాత జ‌రిగిన ప్ర‌తి ఎన్నిక‌లోనూ ప్ర‌భంజ‌నం సృష్టిస్తోంది.  ఇప్ప‌టికిప్పుడు ఎన్నిక‌లు జ‌రిగితే మ‌ళ్లీ వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ముఖ్య‌మంత్రి కావ‌డం ఖాయ‌మైంది. ఆంధ్రప్రదేశ్ ఇప్పటికిప్పుడు ఎన్నికలొస్తే మళ్లీ వైయ‌స్సార్ కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధి స్తుందని సీ ఓటర్- ఇండియా టుడే సర్వే తేల్చిచె ప్పింది. పార్టీ అధినేత, సీఎం వైయ‌స్ జగన్ మోహ‌న్ రెడ్డికి ప్రజా దరణ అణుమాత్రం తగ్గలేదని స్పష్టం చేసింది. ఏపీలోని 25 లోక్ స‌భ స్థానాల్లో కాంగ్రెస్, బీజేపీ పార్టీలకు ఒక్క సీటు కూడా రాదని కుండబద్దలు కొట్టింది. 

కొన‌సాగుతున్న ప్ర‌భంజ‌నం..
మాట తప్పని, మడమ తిప్పని పాదయాత్రికుడు వైయ‌స్‌ జగన్‌ ముఖ్యమంత్రి కావాలన్న సంకల్పంతో ప్రాంతాలు, వర్గాలతో సంబంధం లేకుండా అంతా వైయ‌స్ఆర్‌సీపీకి బ్రహ్మరథం పట్టారు. 2019 ఎన్నిక‌ల్లో వైయ‌స్ఆర్‌సీపీకి 151 అసెంబ్లీ సీట్లు, 22 లోక్‌స‌భ స్థానాల్లో విజ‌యం సాధించింది.  చంద్రబాబు నేతృత్వంలోని టీడీపీని ప్రజలు తిరస్కరించారు. 

అదే ఫ్యాన్‌ ఫాలోయింగ్‌.. మొన్న పంచాయతీ..  మున్సిపాలిటీ.. నిన్న‌ పరిషత్‌.. తిరుప‌తి పార్ల‌మెంట్ ఉప ఎన్నిక‌, బ‌ద్వేల్ అసెంబ్లీ ఉప ఎన్నిక ఏదైనా గెలుపు వైయ‌స్ఆర్‌సీపీదే.  సంక్షేమ యజ్ఞంతో ఉజ్వల భవితకు భరోసా ఇస్తున్న జగనన్న పాలనకు జనం బ్రహ్మరథం పడుతున్నారు. అందుకే పరిషత్‌ ఎన్నికల్లో సై‘కిల్‌’ కాగా, గ్లాసు బీటలు తీసింది. కమలం మరీ వాడిపోయింది. టోటల్‌గా సార్వత్రిక ఎన్నికల సీన్‌ రిపీట్‌ అయింది.  ప్ర‌తి ఎన్నిక‌లోనూ ప్రజలు వైయ‌స్ఆర్‌సీపీకే బ్రహ్మరథం పట్టారు. వైయ‌స్‌ జగన్‌ సంక్షేమ పాలనకు “జై’ కొట్టారు. వ‌చ్చే ఎన్నికల్లోనూ ఏకపక్ష గెలుపుతో వైయ‌స్ఆర్‌సీపీ రాష్ట్రంలో ప్రభంజనం సృష్టించ‌నుంద‌ని స‌ర్వేలు వెల్ల‌డిస్తున్నాయి.  సర్వే విశ్లేషణలో నిపుణు లుగా పరిగణించే సీనియర్ లిస్టులు రాహుల్ కన్వల్ (ఇండియా టుడే గ్రూపు న్యూస్ డైరెక్టర్, రాజ్ చెంగప్ప, (ఇండియా టుడే గ్రూపు ఎడిటోరియల్ డైరెక్ట‌ర్‌) ప్రజాదరణ విషయంలో జగన్‌కు తిరుగులేదని దీన్ని బట్టి తెలుస్తోందని విశ్లేషించారు.

 

Back to Top