చంద్రబాబును ప్రజలు క్షమించరు..

ఢిల్లీః ప్యాకేజీ ముద్దు అని ప్రత్యేకహోదా కాదని రాష్ట్ర ప్రయోజనాలను బీజేపీకి తాకట్టుపెట్టిన చంద్రబాబును ప్రజలు క్షమించరని వైయస్‌ఆర్‌సీపీ నేత పృథ్వీరాజ్‌ అన్నారు.ఏపీని విడగొట్టిన మొదటి ముఖ్యమంత్రి,అఖరి ముఖ్యమంత్రి.. నల్లారి కిరణ్‌కుమార్‌ రెడ్డి అనకాపల్లిలో మాట్లాడుతూ  వైయస్‌ జగన్‌కు గమ్యం లేదని వ్యాఖ్యనించడం పట్ల తీవ్రంగా దుయ్యబట్టారు. కిరణ్‌కుమార్‌ రెడ్డికే గమ్యం లేదని, గోల్డొండ ఫోర్డ్‌లో గోల్ఫ్‌ ఆడుకుంటున్నారన్నారు. అటువంటి వారికి ఈ రాష్ట్రంలో జరిగే పరిస్థితులు పట్టవని విమర్శించారు.కొంతమంది నాయకులు సంక్రాంతికి హరిదాసులు వచ్చినట్లు వచ్చి  ప్రశ్నించడం ఆంధ్ర రాష్ట్ర ప్రజల దౌర్భగ్యమన్నారు.తెలంగాణ ఎన్నికల్లో మహాకూటమిని ప్రజలు చాచిపెట్టి కొట్టారని విమర్శించారు.నీతి,నిజాయతీ, సంక్షేమ రాజ్యం ఎక్కడని చంద్రబాబను ప్రజలు ప్రశ్నిస్తున్నారన్నారు.
Back to Top