మార్మోగిపోతున్న చంద్ర‌బాబు గొప్ప‌త‌నం..!

చంద్ర‌బాబు మంది మార్జ‌లంతో విశాఖ‌ప‌ట్నంలోని ఒక మార్కెట్‌కి ఆక‌స్మిక త‌నిఖీకి వెళ్ళాడు. ఒక యువ‌కుడు  ``చేప‌లు, చేప‌లు.......``అని అరుస్తూ క‌నిపించాడు.
`` ఏయ్ అబ్బాయి నీ పేరేంటి?`` బాబు అడిగాడు
``రాంబాబు సార్‌``
`` ఏం చ‌దువుకున్నావ్‌?``
`` ఎమ్మెస్సీ``
``ఎమ్మెస్సీ చ‌దువుకుని చేప‌లు అమ్ముకుంటున్నావా?``
`` రొయ్య‌లు అమ్ముకోడానికి పెట్టుబ‌డి లేదండి, కాస్ట్‌లో క‌దా``
`` నేన‌డిగింది అది కాదు, అంత‌చ‌దువుకొని చేప‌లెందుకు అమ్ముతున్నావ‌ని
`` ఆక‌లేస్తే అన్నం తినాలి క‌దండి. అందుకు చేప‌ల‌మ్మేది``
``ఎమ్మెస్సీలో నీ స‌బ్జెక్ట్ ఏంటి?``
``కెమెస్ట్రీ``
``కెమెస్ట్రీ చ‌దువుకొని కెమెస్ట్ కావాలి కానీ చేప‌లెందుకు అమ్ముతున్నావ్‌``
``దానికి మీరే స‌మాధానం చెప్పాలి``
``నేనా?  నేనెందుకు చెబుతాను చేప‌ల‌మ్ముతున్న‌ది నువ్వుక‌దా``
`` చేప‌లమ్మేలా చేసింది మీరు క‌దా......బాబొస్తే జాబొస్తుంద‌ని  మీరే క‌దా చెప్పారు. జాబు సంగ‌తేమో కానీ చేతికి చేప‌ల త‌క్కెడ వ‌చ్చింది`` మీ ప్ర‌భుత్వం పుణ్య‌మా అని డీఎస్సీ ప‌రీక్ష పాస్ అయ్యాను కానీ ఉద్యోగం లేక‌, ఇదిగో ఇలా చేప‌లు అమ్ముకొంటున్నా అన్నాడు. 
బాబు ఖంగు తిని నెత్తి గీరుకుని ఇంకా చోటికెళ్ళాడు. అక్క‌డ ఒకామె ఉల్లిపాయ‌లు అమ్ముతూవుంది.
``అమ్మీ, ఉల్లిపాయ‌లు కిలో ఎంత‌?``
``స‌రిగా చూడండి సార్ ,అవి వెల్లుల్లి 
బాబు తిక‌మ‌క‌గా చూసి ``వెల్లుల్లి తెల్ల‌గా స‌న్న‌గా వుంటాయి, ఉల్లిపాయ‌లు ఎర్ర‌గా లావుగా వుంటాయి. ఆ మాత్రం తెలియ‌దా ఏంటి?``
`` మీకు నిజానికి, అబ‌ద్దానికి తేడా ఎలాగూ తెలియ‌దు,ఇది కూడా తెలియ‌దా?``
బాబు ఆశ్చ‌ర్యంగా ఉల్లిపాయ‌ని కొరికి ``ఏం పిచ్చి పిచ్చిగా వుందా? ఉల్లిని చూపించి వెల్లిల్లి అంటావా నేనెవ‌రో తెలుసుకదా``
``అసెంబ్లీలో మీరు తిమ్మిని బ‌మ్మి,బమ్మిని తిమ్మి చేస్తే త‌ప్పులేదు కానీ నేను ఉల్లిని వెల్లుల్లి అంటే త‌ప్ప‌యిందా``
బాబు మెల్లిగా జారుకుని ఎండు చాప‌ల‌మ్మే చోటికెళ్ళాడు.
``ఎండు చాప‌లంటే వాస‌న రావాలి క‌దా, ఇక్క‌డేంటి వాస‌నేలేదు``
అని అడిగాడు బాబు
`` మీకు కంపు రాజ‌కీయాలు అల‌వాటు కావ‌డం వ‌ల్ల ఎండు చాప‌ల వాస‌న మీకు త‌గ‌ల‌డంలేదు`` చెప్పాడు అమ్మేవాడు
``ఏంట్రా ప్ర‌తివాడు పంచ్ లేస్తున్నాడు అనుకుంటూ బాబు అక్క‌డేవున్న ప‌ల్లీలు అమ్మే వాడి ద‌గ్గ‌ర‌కు వెళ్లాడు. 
``నువ్వేం చ‌దివావు?``
``పిహెచ్‌డీ సార్‌``అని పొట్లం క‌ట్టి కొన్ని ప‌ల్లీలు ఇచ్చాడు. 
``పిహెచ్‌డినా? అని ఆశ్చ‌ర్య‌పోయాడుబాబు
``మీ పాల‌న‌లో ఆశ్చ‌ర్య‌పోవాల్సిని ఇంకా చాలా వున్నాయి. మీరు జాబ్ ఎలాగూ ఇవ్వ‌ర‌ని అర్థ‌మై నా థీసిస్‌ని కూడా చించేసి శెన‌క్కాయ‌లు క‌డుతున్నాను``
దీంతో అస‌లు సంగ‌తి చంద్ర‌బాబే స్వ‌యంగా చెప్పాడు. ** ప్ర‌తివాడు బాబు, జాబు అంటున్నాడు.బాబొస్తే జాబొస్తుంద‌ని చెప్పానా లేదా?``
``చెప్పారు``
``మ‌రి వ‌చ్చింది క‌దా``
``ఎవ‌రికి``
``ఎవ‌రికేంటి నాకే...... బాబొస్తే నాకు సీఎం జాబొచ్చింది ఆ ర‌కంగా నా మాట నిజ‌మైంది``
అప్పుడు నిరుద్యోగుల‌కు చంద్ర‌బాబు విశ్వ‌రూపం అర్థ‌మైంది.
- రాహుల్‌

Back to Top