చెప్పకనే చెబుతున్నా...నేను  చెప్పనయ్యా అన్నాడు పరమ్ కళ్యాణ్. 
పోనీ అడగండి ...
నేను అడగను...
పోనీ ఏం చేస్తారు...
ఏదోటి చేస్తాను...మీకెందుకు...
మరదేంటి ఏదో చేస్తాను...ఇంకేదో అంటాను...మరేంటో అడుగుతాను అంటారు కదా...
అంటాను...అనకపోతాను...మీకెందుకు...
మరి ఏమీ అనకుండా, ఏమీ చేయకుండా ఏదో చేస్తాను ఏదో అంటాను అని అనడం ఎదుకు?
ఏదో ఒకటి అనాలి కనుక...అలా అని ఎవరిని పడితే వాళ్లని అంటామేంటి?
ఇంతకీ మీ ఆలోచన ఏంటి?
నా ఆలోచనతో నీకు పనేంటి?
మరి జనం కోసం ఆలోచిస్తున్నా అన్నారుగా...?
అంటే ఆలోచిస్తున్నట్టేనా భలేవాళ్లే?
అయితే అనడం అంటే ఉట్టుట్టిగా అనడమా?
అబ్బే గట్టిగట్టిగా అనడమే కానీ బట్టీ పట్టి అనడం...
అంటే మీకు ఇలా అనమని ఎవరైనా చెబితే అంటున్నారా?
ఎవరో చెబితే అన్నానా లేదా అన్నది మీకెందుకు చెప్పాలి?
సరే పోనీ మీరేం చెబుతారో అదే చెప్పండి?
నా ఆస్తుల జాబితా చెబుతా...
అది మేం అడగలేదు కదా...పోనీ సరే చెప్పండి.
ఇప్పుడు కాదు...
మరెప్పుడు??
సమయం వచ్చినప్పుడు...
సరే ఇప్పుడేం చేయబోతున్నారు??
సభలు పెట్టడం, రాజకీయాల్లో రాజీనామాలపై ప్రసంగించడం, నా స్టాండేంటో చెప్పడం, ఒక్కొక్కటిగా నా నిర్ణయాలు ప్రకటించడం, అనుభవం ఉన్న నాయకులను సంప్రదించడం, నా ఇల్లు నిర్మించడం, నా ఆస్తులు ప్రకటించడం...
చాలు సర్, చాలు చాలు...మాకర్థం అయ్యింది...మీరు తీసుకున్న స్టాండ్..మీ వెనకున్న బ్రాండు...మీ ప్యాకేజీ డిమాండు...అన్నీ అర్థం అయ్యాయి...మీరు చెప్పాల్సింది చెప్పండి. జనం చేయాల్సింది చేస్తారు. నమస్కారం. 

Back to Top